చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భార్య అడ్డదారి తొక్కింది. తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. భర్త కళ్లుకప్పి ప్రియుడితో జల్సా చేస్తున్న భార్య భాగోతం ఆమె భర్తకు తెలిసిపోయింది. అప్పటి నుంచి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇంకోసారి నీ ప్రియుడితో తిరగడం నేనే చూస్తే నీ ప్రాణం తీస్తానని భర్త అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. భర్తను చంపేస్తే ప్రియుడితో జీవితాంతం సుఖంగా ఉంటానని భార్య ఆలోచించింది. అంతే పక్కాప్లాన్ తో ప్రియుడితో కలిసి నిద్రలోనే చిన్నగాయం కూడా కాకుండా భర్తను చంపేసింది. తన భర్త పీకలదాక మద్యం సేవించి చనిపోయాడని అందరిని నమ్మించింది. భర్త తమ్ముడు కేసు పెట్టడంతో అక్కడ కథ మలుపు తిరిగింది. ప్రియుడి మోజులో పడిన భార్య ఆమె భర్తను నిద్రలోనే ఎలా చంపేసింది అని తెలుసుకున్న బంధువులు, స్థానికులు షాక్ అయ్యారు.

Lady leader: భార్య మేయర్ అభ్యర్థి, భార్యను రివాల్వర్ తో కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న టాప్ లీడర్ !Lady leader: భార్య మేయర్ అభ్యర్థి, భార్యను రివాల్వర్ తో కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న టాప్ లీడర్ !

మొదట్లో భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య

మొదట్లో భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య

తమిళనాడులోని సేలం జిల్లాలోని మెట్టూరు సమీపంలోని కారైక్కాడ్ గ్రామంలో శక్తివేల్ (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం శక్తివేల్ కుటుంబ సభ్యులు చూపించిన హరిసి (35) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న హరసి భర్త శక్తివేల్ తో మొదట్లో సంతోషంగా కాపురం చేసింది.

అడ్డదారి తొక్కిన భార్య

అడ్డదారి తొక్కిన భార్య

శక్తివేల్, హరసి దంపతులకు 8 సంవత్సరాల కొడుకు, 6 సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం మెట్టూరు సమీపంలో నివాసం ఉంటున్న ముత్తుకుమారన్ (29) అనే యువకుడు హరసికి పరిచయం అయ్యాడు. పిల్లలు పుట్టిన తరువాత శక్తివేల్ భార్య హరసి అడ్డదారి తొక్కింది.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య


తనకంటే వయసులో చిన్నవాడైన ముత్తుకుమారన్ అనే యువకుడితో హరసి అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. భర్త శక్తివేల్ కళ్లుకప్పిన హరసి ఆమె ప్రియుడు ముత్తుకుమారన్ తో జల్సా చేసింది. గత సంవత్సరం భార్య హరసి భాగోతం ఆమె భర్త శక్తివేల్ కు తెలిసిపోవడంతో అతను రగిలిపోయాడు.

 చంపేస్తానని భార్యకు వార్నింగ్

చంపేస్తానని భార్యకు వార్నింగ్


భార్య హరసి అక్రమ సంబంధం బయటపడినప్పటి నుంచి శక్తివేల్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య హరసి అక్రమ సంబంధం విషయం జీర్ణించుకోలేని శక్తివేల్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ఇంకోసారి నీ ప్రియుడు ముత్తుకుమారన్ తో తిరగడం నేనే చూస్తే నీ ప్రాణం తీస్తానని శక్తివేల్ అతని భార్య హరసికి వార్నింగ్ ఇచ్చాడు.

 రాత్రి నిద్రపోయిన భర్త ఉదయం శవం అయ్యాడు

రాత్రి నిద్రపోయిన భర్త ఉదయం శవం అయ్యాడు

తన భర్త శక్తివేల్ తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని, ప్రియుడు ముత్తుకుమారన్ ను దూరం అవుతాడని హరసి రగిలిపోయింది. రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన శక్తివేల్ కు అతని భార్య హసిని నిద్రమాత్రలు కలిపిన అన్నం పెట్టి నిద్రమాత్రలు కలిపిన నీళ్లు ఇచ్చింది. బోజనం చేసిన శక్తివేల్ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం శక్తివేల్ ఇంట్లోనే శవం అయ్యాడు.

భర్త తమ్ముడి ఎంట్రీతో సీన్ రివర్స్

భర్త తమ్ముడి ఎంట్రీతో సీన్ రివర్స్

తన భర్త శక్తివేల్ ప్రాణాలతో భయటపడితే నిజంగానే నన్ను చంపేస్తాడని అతని భార్య హసిని భయపడింది. అర్దరాత్రి దాటిన తరువాత ప్రియుడు ముత్తుకుమారన్ ను ఇంటికి పిలిపించిన హసిని పాలల్లో విషం కలిపి నిద్రపోతున్న భర్త శక్తివేల్ తో బలవంతంగా తాగించింది. శక్తివేల్ తమ్ముడు ముత్తుస్వామికి అనుమానం వచ్చి తన అన్నను చంపేసి ఉంటారని పోలీసు కేసు పెట్టాడు.

కంత్రీ పెళ్లామ్.... కిలాడీ ప్రియుడు అరెస్టు

కంత్రీ పెళ్లామ్.... కిలాడీ ప్రియుడు అరెస్టు

పక్కాప్లాన్ తో ప్రియుడు ముత్తుకుమారన్ తో కలిసి నిద్రలోనే చిన్నగాయం కూడా కాకుండా భర్త శక్తివేల్ ను చంపేసిన హసిని తన భర్త పీకలదాక మద్యం సేవించి చనిపోయాడని అందరిని నమ్మించి నాటకాలు ఆడింది. శక్తివేల్ తమ్ముడు కేసు పెట్టడంతో అక్కడ కథ మలుపు తిరిగింది. ప్రియుడు ముత్తుకుమారన్ మోజులో పడిన హసిని ఆమె భర్తను నిద్రలోనే చంపేసింది అని తెలుసుకున్న బంధువులు, స్థానికులు షాక్ అయ్యారు. హసిని, ఆమె ప్రియుడు ముత్తుకుమారన్ ను అరెస్టు చేశామని సేలం పోలీసులు తెలిపారు.

English summary
Illegal affair: The husband who condemned the illegal relationship wife gives poison near Salem in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X