Illegal affair: ప్రియుడు టచ్ లోకి రాకుండా చేసిన భర్త, భార్య ప్లాన్ కు భర్త ఫినిష్, సినిమా స్కెచ్ రివర్స్!

జైపూర్/ కోటా: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. వివాహం అయిన తరువాత భార్యకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం స్నేహితుడితో ఫోన్ లో మాట్లాడుతున్న మహిళ అతనికి దగ్గర అయ్యింది. రానురాను స్నేహితుడితో చనువు పెంచుకున్న వివాహిత మహిళ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలీకుండా ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది, భార్య ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతోందని భర్త గమనించాడు.

భార్యకు తెలీకుండా ఆమె గురించి భర్త ఆరా తీశాడు. తన భార్యకు వేరేవ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న భర్త బిత్తరపోయాడు. ప్రియుడితో ఫోన్ లో మాట్లాడకుండా, భార్య బయటకు వెళ్లకుండా భర్త కట్టడి చేశాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన సంతోషాలకు భర్త అడ్డుగా వస్తున్నాడని రగిలిపోయిన భార్య ఆమె ప్రియుడితో కలిసి భర్తను పక్కాప్లాన్ ప్రకారం చంపేసింది. కేసు నుంచి తప్పించుకోవడానికి పాత తమిళ సినిమా టెక్నిక్స్ ఉపయోగించిన భార్య, ఆమె ప్రియుడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య

భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య

రాజస్థాన్ లోని కోటా జిల్లాలోని భీమ్ గంజ్ ప్రాంతంలో నరేష్ పవన్ మీనా అలియాస్ పవన్ మీనా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సునీతా అనే మహిళతో కుటుంబ సభ్యులు ఆమెను పవన్ మీనాకు ఇచ్చి వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు చూపించిన పవన్ మీనాను వివాహం చేసుకున్న సునీతా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది.

ప్రియుడు ఎంట్రీ

ప్రియుడు ఎంట్రీ

మూడు సంవత్సరాలు సునీతా ఆమె భర్త పవన్ మీనాతో సంతోషంగా కాపురం చేసింది. వివాహం అయిన తరువాత సునీతాకు కంటోన్మెంట్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ప్రమోద్ ఖట్తో అలియాస్ ప్రమోద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం స్నేహితుడు ప్రమోద్ తో ఫోన్ లో మాట్లాడిన సునీత అతనికి దగ్గర అయ్యింది.

ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

రానురాను ప్రమోద్ తో చనువు పెంచుకున్న వివాహిత మహిళ సునీతా అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పవన్ మీనా ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత బయటకు వెలుతున్న సునీతా మీనా ఆమె ప్రియుడు ప్రమోద్ తో కలిసి జల్సా చేసింది. భర్త పవన్ మీనాకు తెలీకుండా అతని భార్య సునీతా మీనా ఆమె ప్రియుడు ప్రమోద్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది,

భర్తకు డౌట్ వచ్చేసింది

భర్తకు డౌట్ వచ్చేసింది

చాలాకాలంగా ప్రమోద్, సునీతా మీనా అక్రమ సంబంధం విషయం సీక్రేట్ గా సాగిపోయింది. భార్య సునీతా ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతోందని ఆమె భర్త పవన్ మీనా గమనించాడు. కొంతకాలంగా పవన్ మీనా అతని భార్య సునీతా మీద నిఘా వేశాడు. తన భర్త పవన్ కు తన మీద అనుమానం వచ్చిందని తెలుసుకున్న సునీతా సీక్రేట్ గా ఆమె ప్రియుడు ప్రమోద్ ను కలుసుకోవడం మొదలుపెట్టింది.

మ్యాటర్ లీక్

మ్యాటర్ లీక్

భార్య సునీతాకు తెలీకుండా ఆమె గురించి భర్త పవన్ మీనా ఆరా తీశాడు. తన భార్య సునీతాకు ప్రమోద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న భర్త పవన్ మీనా బిత్తరపోయాడు. ఇదే విషయంలో పవన్ మీనా అతని భార్య సునీతాతో గొడవపెట్టుకున్నాడు. సునీతా, పవన్ మీనా దంపతుల మద్య గొడవలు జరిగాయి.

భర్తను చంపేయాలని స్కెచ్ వేసిన భార్య

భర్తను చంపేయాలని స్కెచ్ వేసిన భార్య

ప్రియుడు ప్రమోద్ తో ఫోన్ లో మాట్లాడకుండా, భార్య సునీతా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పవన్ మీనా కట్టడి చేశాడు. ఇదే విషయంలో పవన్ మీనా, సునీతా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన సంతోషాలకు తన భర్త పవన్ మీనా అడ్డుగా వస్తున్నాడని రగిలిపోయిన అతని భార్య సునీతా ఆమె ప్రియుడు ప్రమోద్ తో కలిసి మార్చి 19వ తేదీన ఇంట్లోనే భర్త పవన్ మీనా గొంతును షూ లేస్ లతో బిగించి పక్కాప్లాన్ ప్రకారం చంపేసింది.

కేసు పెట్టిన భర్త కుటుంబ సభ్యులు

కేసు పెట్టిన భర్త కుటుంబ సభ్యులు

భర్త పవన్ మీనాను హత్య చేసిన సునీతా అతని గొంతు మీద పడిన గాయాలు కనపడకుండా ఉండటానికి మార్క్ లోని ఇంక్ అతని మెడ, గొంతు, తదితర చోట్ల పోసింది. తన భర్త పవన్ మీనా అనారోగ్యంతో చనిపోయాడని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. పవన్ మీనా అనారోగ్యంతో చనిపోలేదని, అతన్ని హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

 అడ్డంగా చిక్కిపోయిన భార్య, ప్రియుడు

అడ్డంగా చిక్కిపోయిన భార్య, ప్రియుడు

పోలీసులు పవన్ మీనా భార్య సునీతాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో తన ప్రియుడు ప్రమోద్ తో కలిసి తన భర్తను చంపేశానని సునీతా అంగీకరించింది. పవన్ మీనాను హత్య చేసిన అతని భార్య సునీతా, ఆమె ప్రియుడు ప్రమోద్ ను అరెస్టు చేశామని కోటా జిల్లా పోలీసులు తెలిపారు. కేసు నుంచి తప్పించుకోవడానికి పాత సినిమా టెక్నిక్స్ ఉపయోగించిన సునీతా మీనా, ఆమె ప్రియుడు ప్రమోద్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+