Wife: లవ్ మ్యారేజ్, ఒకరు కాదు చాలా మందితో అక్రమ సంబంధం, ఇంట్లో భార్యను చంపేసి డ్రామాలు !
ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. భార్య మతం మారకపోవడంతో భర్త మతం మారి అతని పేరు మార్చుకున్నాడు. ఇంట్లో భార్య చనిపోవడంతో ఆమె అంత్యక్రియలకు భర్త అన్ని ఏర్పాట్లు చేశాడు. అ మహిళ తల్లి కేసు పెట్టడంతో అన్నీ రివర్స్ అయ్యాయి.
చెన్నై/దిండుగల్: యువతి, యువకుడు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమించుకున్నారు. ఇద్దరు మతాలు వేరు. ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. భార్య మతం మారను అని భర్తకు తేల్చి చెప్పింది. విధిలేని పరిస్థితిలో భర్త మతం మారి అతని పేరు మార్చుకున్నాడు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తరువాత భర్త వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో భార్య అనుమానాస్పదంగా చనిపోయింది. భార్య అంత్యక్రియలకు ఆమె భర్త అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే మహిళ తల్లి కేసు పెట్టడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదికలో మహిళ హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది. అనేక మందితో అక్రమ సంబంధాల కారణంగా గొడవలు జరగడంతో భర్త అతని భార్యను చంపేశాడని వెలుగు చూసింది.

ఒకేచోట పని చేసిన లవర్స్
తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని వేదసందూరు ప్రాంతంలో వడివేలు (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వేదసందూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్పిన్నింగ్ మిల్లులో వడివేలు 14 సంవత్సరాల క్రితం పనిచేసేవాడు. వడివేలులో పాటు అక్కడే పని చేసిన తమిళనాడులోని అరవకురిచ్చికి చెందిన సైబుదీన్, ఫాతిమా దంపతుల కుమార్తె రంజాన్ (36) అనే మహిళతో వడివేలు ప్రేమలో పడ్డాడు. ఒకేచోట పని చేస్తున్న వడివేలు. రంజాన్ కొంతకాలం ప్రేమించుకున్నారు.

మతం మారి పేరు మార్చుకున్న వడివేలు
వడివేలు రంజాన్ గాఢంగా ప్రేమించాడు. 12 ఏళ్ల క్రితం రంజాన్‌ను వడివేలు వివాహం చేసుకున్నాడు. హిందూ మతంలోకి మారడానికి రంజాన్ నిరాకరించింది. అయితే వడివేలు ఇస్లాం మతం స్వీకరించి అతని పేరును మహమ్మద్ అబూబకర్ సిద్ధిఖి గా మార్చుకున్నాడు. రంజాన్ మహమ్మద్ దంపతులు గత కొన్నేళ్లుగా పెరియకులం జిల్లాలోని వడకరై లోని వీఆర్పీ నాయుడు వీధిలో నివాసం ఉంటున్నారు.

దంపతుల మధ్య గొడవలు
మహ్మద్ అబూబకర్ సిద్ధిఖీ అదే ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి కిరాణా దుకాణం నడుపుతూ వ్యాపారం చేస్తున్నాడు. మోహమ్మద్, రంజాన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు సంవత్సరాల నుంచి రంజాన్, మోహమ్మద్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. మోహమ్మద్ అబూబకర్ సిద్ధిఖీ, అతని ఇద్దరు పిల్లలు గత జనవరి 27న పెరియకులంలో అతని బంధువుల ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి వచ్చారు.

ఇంట్లోనే చనిపోయిన భార్య
రెండు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో ఇంట్లోనే ఉన్న రంజాన్ కాసేపు మాట్లాడలేక ఊపిరి పీల్చుకోలేక స్పృహతప్పి పడిపోయింది. తల్లి రంజాన్ అవస్థలు చూసిన ఇద్దరు కుమార్తెలు వారి తండ్రి మోహమ్మద్ ను ఏం జరిగిందని అడగ్గా అతను సమాధానం చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుమార్తెలు కేకలు వెయ్యడంతో ఇరుగుపొరుగు వారు, బంధువులు వచ్చి చూసే సరికి రంజాన్ మృతి చెందినట్లు తెలిసింది.

అత్త ఎంట్రీతో సీన్ ఫుల్ రివర్స్
తరువాత ఇంటికి వెళ్లిన మోహమ్మద్ ఇంటి ముందు పెండాల్ వేసి అతని భార్య రంజాన్ అంత్యక్రియలు చెయ్యడానికి ఏర్పాట్లు చేశాడు. నా భార్య అనారోగ్యంతో చనిపోయిందని చుట్టుపక్కల వాళ్లను, బంధువులను మోహమ్మద్ నమ్మించాడు. రంజాన్ ను ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రంజాన్ తల్లి ఫాతిమా (70) తన కుమార్తె మృతిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయని పెరియకుళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంజాన్ అంత్యక్రియలు జరపడానికి వీలు లేదని ఆమె తల్లి ఫాతిమా అడ్డం తిరిగింది.

పోస్టుమార్టం నివేదికలో ?
పెరియకులం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సంఘటనా స్థలానికి వెళ్లి రంజాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. రంజాన్ భర్త మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. రంజాన్ గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని, అనారోగ్యంతోనే ఆమె చనిపోయిందని మోహమ్మద్ పోలీసుల ముందు వాదించాడు. రంజాన్ ను గొంతు నులుమడంతో ఆమెకు ఊపిరాడక మృతి చెందిందని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. పోలీసులు మోహమ్మద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

అంగడికి వస్తున్న మహిళలతో అక్రమ సంబంధం
మోహమ్మద్ అబూబకర్ సిద్ధిఖీని పోలీసులు విచారించగా పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ అబూబకర్ సిద్ధిఖీకి కొంతమంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆ విషయం రంజాన్ తెలిసిపోవడంతో ఆమె ఖండించిందని, ఇదే విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు అన్నారు, అంగడికి వచ్చి వెలుతున్న మహిళలతో కూడా మోహమ్మద్ అలియాస్ వడివేలు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు అన్నారు.

ఆ రోజు అదే విషయంలో రంజాన్ తో గొడవలు
రంజాన్ ను హత్య చేసిన రోజు ఆమెతో ఇదే విషయంలో గొడవ చెయ్యడంతో రగిలిపోయిన మోహమ్మద్ అతని భార్యను గొంతు నులిమి చంపేశాడని, తరువాత కుమార్తెల ముందు డ్రామాలు ఆడాడని పోలీసులు అన్నారు. అనంతరం పెరియకులం పోలీసులు రంజాన్ అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి మోహమ్మద్ అబూబకర్ సిద్ధిఖీని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న మోహమ్మద్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్య రంజాన్ ను హత్య చేసి డ్రామాలు ఆడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications