Illegal affair: కొత్త పెళ్లి కూతురు, పుట్టింటి పక్కన ప్రియుడితో ఎంజాయ్, భార్య చీరతో కొత్త పెళ్లి కొడుకు, అంతే
నాగ్ పూర్/ ముంబాయి: ఓ యువకుడి కుటుంబ సభ్యులు అతనికి మంచి పెళ్లి సంబంధం చూశారు. అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆ యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. యువతి కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. యువతి, యువకుడి పెళ్లి 40 రోజుల ముందు గ్రాండ్ గా జరిగింది. కేవలం వారం రోజులు మాత్రమే భర్త దగ్గర ఉన్న కొత్త పెళ్లి కూతురు ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను పిలుచుకురావడానికి భర్త, అతని కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే భార్య మాత్రం నేను చచ్చినా భర్త దగ్గరకు రానని తేల్చి చెప్పింది. భర్త అతని భార్య గురించి ఆరా తీశాడు. పుట్టింటి సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకుని ఆవేదన చెందాడు.పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకుండానే నా భార్య నా పరువు తీసిందని స్నేహితుల ముందు ఆవేదన చెందాడు. నా ఆత్మహత్యకు నా భార్య, ఆమె ప్రియుడు కారణం అని డెత్ నోట్ రాసిన కొత్త పెళ్లి కొడుకు అతని భార్య చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

అందమైన అమ్మాయి
మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలోని చుంకి తాలుకాలోని చిక్నా గ్రామంలో కిషన్ అంకుష్ మోజాకంర్ అలియాస్ కిషన్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.కిషన్ కు అతని కుటుంబ సభ్యులు స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి పెళ్లి సంబంధం చూశారు. అమ్మాయి చూడటానికి బాగా ఉందని కిషన్ కుటుంబ సభ్యులు అనుకున్నారు.

మార్చి 6వ తేదీ గ్రాండ్ గా పెళ్లి
స్వప్నా చూడటానికి చాలా అందంగా ఉండటంతో కిషన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. స్వప్నా కూడా పెళ్లి చేసుకుంటానని ఆమె కుటంబ సభ్యులకు చెప్పింది. మార్చి 6వ తేదీన కిషన్, స్వప్నాల పెళ్లి 40 గ్రాండ్ గా జరిగింది. కిషన్ ను పెళ్లి చేసుకున్న స్వప్నా ఆమె అత్తారింటికి వెళ్లింది.

వారం రోజులకే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
కేవలం వారం రోజులు మాత్రమే భర్త కిషన్ తో కాపురం చేసిన కొత్త పెళ్లి కూతురు స్వప్నా తరువాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య స్వప్నాను పిలుచుకురావడానికి ఆమె భర్త కిషన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే స్వప్నా మాత్రం నేను చచ్చినా నా భర్త కిషన్ దగ్గరకు దగ్గరకు రానని తేల్చి చెప్పింది.

భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకుని ?
పెళ్లి చేసుకున్న ఆనందం వారం రోజుల్లోనే ఆవిరి అయిపోయిందని కిషన్ విచారంతో ఉన్నాడు. భార్య స్వప్నా సొంత ఊరుకు వెళ్లిన కిసన్ ఆమె గురించి ఆరా తీశాడు. పుట్టింటి సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తితో భార్య స్వప్నా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్న కిషన్ ఆవేదన చెందాడు.

డెత్ నోట్ రాసి కొత్త పెళ్లి కొడుకు ఆత్మహత్య
పెళ్లి జరిగి కేవలం 50 రోజులు కూడా కాకుండానే నా భార్య స్వప్నా ఆమె ప్రియుడితో తిరిగుతూ నా పరువు తీసిందని కిషన్ అతని స్నేహితుల ముందు ఆవేదన చెందాడు. నా ఆత్మహత్యకు నా భార్య స్వప్నా, ఆమె ప్రియుడు కారణం అని డెత్ నోట్ రాసిన కొత్త పెళ్లి కొడుకు కిషన్ అతని భార్య చీరతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications