Illegal affair: భార్యకు క్యూలో ఇద్దరు ప్రియులు, నిరుద్యోగి భర్త, కోసి కాలువలో విసిరేసి !
అహమ్మదాబాద్/చెన్నై: కరోనా వైరస్, లాక్ డౌన్ కష్టాలతో భర్త నిరుద్యోగి అయ్యాడు. చెయ్యడానికి పని చిక్కక భర్త జులాయిగా మారిపోయి మద్యంకు బానిస అయ్యాడు. డబ్బు సంపాధిస్తున్న భార్య మీద ఆదారపడిన భర్త ప్రతిరోజు మద్యం సేవిస్తూ ఆమె డబ్బు మొత్తం ఖాళీ చేశాడు. అప్పటికే భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడికి విషయం తెలిసింది. ప్రియుడి స్నేహితుడు కూడా భార్యను లైన్ లో పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు. డబ్బు సంపాధించలేని మొగుడు తనకు ఎందుకు, డబ్బు సంపాధిస్తున్న ఇద్దరు ప్రియులు ఉన్నారు కదా అని భార్య ఆలోచించింది. అంతే ఇద్దరు ప్రియులు, వారి స్నేహితుడితో కలిసి భార్య ఆమె భర్తను పక్కాప్లాన్ తో హత్య చేశారు. ప్రియులతో కలిసి భర్త గొంతుకోసి శవాన్ని ఫ్లైఓవర్ కింద కాలువలో విసిరేసిన భార్య చేతులు దులుపుకుంది.

కరోనా కాలంలో నిరుద్యోగి అయిన భర్త
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని కరంజ్ ప్రాంతంలోని భద్రకాళి ఆలయం సమీపంలో జిగ్నేష్ సోలంకి, రేఖా దంపతులు నివాసం ఉంటున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కష్టాలతో భర్త జిగ్నేష్ నిరుద్యోగి అయ్యాడు. చెయ్యడానికి పని చిక్కక జిగ్నేష్ సోలంకి జులాయిగా మారిపోయి మద్యంకు పూర్తిగా బానిస అయ్యాడు. ఇంతకాలం అక్కడక్కడా అప్పులు చేసిన జిగ్నేష్ కాలం గడుపుతూ వచ్చాడు.

భార్య డబ్బు మొత్తం ఖాళీ చేస్తున్న భర్త
రేఖా పని చేస్తూ డబ్బు సంపాధిస్తూ సంసారాన్ని నెట్టుకుని వస్తోంది. డబ్బు సంపాధిస్తున్న భార్య రేఖా మీద ఆదారపడిన భర్త ప్రతిరోజు మద్యం సేవిస్తూ ఆమె డబ్బు మొత్తం ఖాళీ చేశాడు. సంసాధిస్తున్న డబ్బు మొత్తం భర్త జిగ్నేష్ ఖాళీ చేస్తున్నాడని, పని చెయ్యడానికి తనకు అవకాశం లేకుండాపోతే నేను ఏమి చెయ్యాలని రేఖా కలవరపడింది.

భార్యకు అక్రమ సంబంధం
రెండు సంవత్సరాల నుంచి రేఖాకు సబీర్ పఠాన్ (19) అనే యువకుడితో అక్రమ సంబంధం ఉంది. భర్త జిగ్నేష్ జులాయి కావడంతో భార్య రేఖా యవ్వనంలో ఉన్న ప్రియుడు సబీర్ పఠాన్ తో ఎంజాయ్ చేస్తూ ఆమె కోరికలు తీర్చుకుంటున్నది. ఇదే సమయంలో సబీర్ పఠాన్ స్నేహితుడు రాజు దామోదరం రేఖాకు పరిచయం అయ్యాడు.

ప్రియుడి ఫ్రెండ్ ను లైన్ లో పెట్టిన రేఖ
ప్రియుడు సబీర్ పఠాన్ స్నేహితుడు రాజు దామోదరంతో కూడా రేఖా అక్రమ సంబంధం పెట్టుకుని ఇద్దరు ప్రియులతో ఎంజాయ్ చేస్తోంది. తన భర్త జిగ్నేష్ నేను సంపాధిస్తున్న డబ్బు మొత్తం ఖాళీ చేస్తున్నాడని రేఖా ఆమె ప్రియులకు చెప్పింది. నీ భర్త జిగ్నేష్ ను చంపేస్తే మేము నీకు జీవితాంతం తోడుగా ఉంటామని పఠాన్, దామోదరం ప్రియురాలు రేఖాకు చెప్పారు.

హత్యకు ముందు భర్తకు మందు పార్టీ
జులై 17వ తేదీ భర్త జిగ్నేష్, రేఖా ప్రియులు పఠాన్, దామోదరం, వీరి స్నేహితుడు శివమ్ ఠక్కర్ కలిసి ఎల్లీస్ బ్రిడ్జ్ సమీపంలోని రివర్ ఫ్రంట్ వెనుక భాగంలో కలుసుకుని మందు పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో రేఖా భర్త జిగ్నేష్ కు అందరూ పీకలదాక మద్యం తాగించారు. జిగ్నేష్ మద్యం మత్తులో లేచినిలబడలేని స్థితిలో ఉన్నాడు.

భర్త గొంతు కోసి కాలువలో విసిరేశారు
పఠాన్, దామోదరం, శివమ్ ఠక్కర్ కలిసి భర్త జిగ్నేష్ మీద దాడి చేశారు. తరువాత కత్తులతో జిగ్నేష్ గొంతు కోసేసిన నిందితులు శవాన్ని విక్టోరియా గార్డెన్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద ఉన్న కాలువలో విసిరేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు గురైయ్యింది జిగ్నేష్ అని పోలీసులు గుర్తించారు.

ఇద్దరు ప్రియులు ఉన్నారు.... మద్యలో మొగుడు ఎందుకు ?
జిగ్నేష్ భార్య పొంతనలేని సమాచారం ఇవ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రేఖాకు అక్రమ సంబంధం ఉందని, నిరుద్యోగి అయిన భర్త ఆమె డబ్బు మొత్తం ఖాళీ చేస్తుంటే కలవరపడిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇద్దరు ప్రియులు పఠాన్, దామోదరం జీవితాంతం తోడు ఉంటారని నమ్మకంతో భర్తను రేఖా హత్య చేయించిందని పోలీసులు అన్నారు.

ప్రియుల మీద భార్యకు వ్యామోహం
రేఖా, పఠాన్, దామోదరంను అరెస్టు చేశామని, పరారైన శివమ్ ఠక్కర్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రియుల వ్యామోహంలో పడిపోయిన భార్య రేఖా వారు చెప్పిన మాయమాటలు నమ్మి కట్టుకున్న భర్త జిగ్నేష్ ను హత్య చేయించి జైలుపాలైయ్యిందని పోలీసు అధికారులు అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications