Illegal affair: గురకపెట్టి నిద్రపోతున్న భర్త, పక్కరూమ్ లో భార్య, ప్రియుడి బర్త్ డే స్కెచ్ తో ఫినిష్ !
చెన్నై/ క్రిష్ణగిరి: ఇంట్లో సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు మొదట సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు పుట్టిన తరువాత భర్త ప్రతిరోజు మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. సంపాదిస్తున్న డబ్బు మొత్తం అతను తాగుడుకు తగలేస్తున్నాడని సమాచారం. భార్య పని చేస్తూ సంసారాన్ని నెట్టుకుని వస్తున్నది, ఇదే సమయంలో తనకంటే చిన్నవాడైన యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది, మద్యం మత్తులో భర్త గురకపెట్టి నిద్రపోతుంటే అతని భార్య ఆమె ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోంది, ఆరోజు రాత్రి భర్త తక్కువగా మందుతాగినట్లు ఉన్నాడు, అర్దరాత్రి అనుకోకుండా నిద్రలేచిన భర్త పక్కరూమ్ లో అతని భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించాడు, ఆ రోజు నుంచి భర్త అతని భార్యను వరసపెట్టి చితకబాదుతున్నాడు. రాత్రి టమోటో మార్కెట్ సమీపంలోని లిక్కర్ షాపు దగ్గర భర్త శవమై కనిపించాడు, తన భర్త విపరీతంగా మద్యం సేవించి కిందపడి చనిపోయాడని భార్య పోలీసులకు చెప్పింది. ఇనుపరాడ్ తో తలలోని మెదడు మీద బలంగా దాడి చెయ్యడంతో అతను చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది, భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మొదట రెండు రోజులు సినిమా స్టోరీలు చెప్పిన భార్య తరువాత మూడోరోజు అసలు కథ చెప్పింది.

సంతోషంగా ఉన్నారు..... కానీ ?
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని రాయకోటై సమీపంలోని కొట్టూరులో మారప్పన్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 18 సంవత్సరాల క్రితం గుండమ్మాల్ (35) అనే మహిళలో మారప్పన్ వివాహం జరిగింది. ఇంట్లో సెట్ చేసిన పెళ్లి చేసుకున్న మారప్పన్, గుండమ్మాల్ దంపతులు మొదట సంతోషంగా కాపురం చేశారు.

విపరీతంగా మద్యంకు బానిస అయ్యాడు
మారప్పన్, గుండమ్మాల్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు పుట్టిన తరువాత మారప్పన్ ప్రతిరోజు మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. మారప్పన్ అతను సంపాదిస్తున్న డబ్బు మొత్తం తాగుడుకు తగలేస్తున్నాడని సమాచారం. ఇదే విషయంలో మారప్పన్, గుండమ్మాల్ దంపతుల మద్య చిచ్చురేపింది.

భర్త ఫ్రెండ్ ను సెట్ చేసుకున్న భార్య
గుండమ్మాల్ కూలి పని చేస్తూ సంసారాన్ని నెట్టుకుని వస్తున్నది, మారప్పన్, శివశంకర్ అనే యువకుడు స్నేహితులు. శివశంకర్ మారప్పన్ ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇదే సమయంలో భర్త స్నేహితుడు, తనకంటే చిన్నవాడైన శివశంకర్ (30) అనే యువకుడితో గుండమ్మాల్ కు పరిచయం అయ్యింది, ప్రతినిత్యం మాట్లాడుకుంటున్న గుండమ్మాల్, శివశంకర్ దగ్గర అయ్యారు. తరువాత మారప్పన్ భార్య గుండమ్మాల్ ఆమె స్నేహితుడు శివశంకర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది,

గురకపెట్టి నిద్రపోతున్న భర్త... పక్కరూమ్ లో ఎంజాయ్ చేస్తున్న భార్య
రోజూ రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న మారప్పన్ గురకపెట్టి నిద్రపోతున్నాడు, భోజనం చేసి ఒకసారి పడుకుంటే మరుసటి రోజు మారప్పన్ నిద్రలేస్తున్నాడు. భర్త మారప్పన్ మత్తులో తూలుతుంటే అతని భార్య గుండమ్మాల్ ఆమె ప్రియుడు శివశంకర్ ను డైరెక్టుగా ఇంటికి పిలిపించుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది,

అర్దరాత్రి నిద్రలేచిన భర్త..... పక్కరూమ్ లో భార్య ?
నాలుగు నెలల క్రితం ఓరోజు రాత్రి మారప్పన్ తక్కువగా మందుతాగినట్లు ఉన్నాడు, అర్దరాత్రి అనుకోకుండా నిద్రలేచిన మారప్పన్ మూత్రవిసర్జన చెయ్యడానికి రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో పక్కరూమ్ లో అతని భార్య గుండమ్మాల్, ఆమె ప్రియుడు శివశంకర్ తో ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించాడు,

భార్యను చితకబాదుతున్న భర్త
బార్య గుండమ్మాల్ ఏరోజు అయితే ఆమె ప్రియుడు శివశంకర్ తో భర్తకు చిక్కిపోయిందో ఆరోజు నుంచి మారప్పన్ అతని భర్తను వరసపెట్టి చితకబాదుతున్నాడు. భర్త కొట్టే దెబ్బలు తట్టుకోలేక, ప్రియుడు శివశంకర్ ను మరిచిపోలేక గుండమ్మాల్ రగిలిపోయింది. తన భర్త మారప్పన్ ను చంపేస్తే మనం జీవితాంతం సుఖంగా ఉంటామని, నువ్వు ఆపని చెయ్యాలని గుండమ్మాల్ ఆమె ప్రియుడు శివశంకర్ కు చెప్పింది.

భర్తకు లిక్కర్ పార్టీ ఇస్తానని నమ్మించిన ప్రియుడు
ప్రియురాలు గుండమ్మాల్ భర్త మారప్పన్ ను చంపేయడానికి శివశంకర్ స్కెచ్ వేశాడు. ఈనెల 17వ తేదీన రాత్రి మారప్పన్ దగ్గరకు వెళ్లిన శివశంకర్ ఈరోజు నా బర్త్ డే, నీకు మందుపార్టీ ఇస్తానని నమ్మించి అతన్ని రాయకోటైలోని టమోటో మార్కెట్ సమీపంలోకి పిలుచుకుని వెళ్లాడు. అక్కడ మారప్పన్ కు పీకలదాక మద్యం తాగించిన తరువాత గుండమ్మాల్ కు ఫోన్ చేసి పిలిపించాడు.

నాటకాలు ఆడిన భార్య
ప్రియుడు శివశంకర్ తో కలిసి గుండమ్మాల్ మద్యం మత్తులో ఉన్న భర్త మారప్పన్ తల మీద ఇనుపరాడ్ తో దాడి చేసి చంపేశారు. మారప్పన్ శవాన్ని సమీపంలోని లిక్కర్ షాపు దగ్గర పడేసిన అతని భార్య గుండమ్మాల్, ఆమె ప్రియుడు శివశంకర్ ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం తన భర్త మారప్పన్ ఎక్కువగా మద్యం సేవించి కిందపడి చనిపోయాడని గుండమ్మాల్ రాయకోటై పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకాలు ఆడింది.

పోస్టుమార్టంతో స్కెచ్ రివర్స్
మారప్పన్ తల మీద, శరీరం మీద గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి అతని శవాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఇనుపరాడ్ తో మారప్పన్ తలలోని మెదడు మీద బలంగా దాడి చెయ్యడంతో అతను చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది, పోలీసులకు అనుమానం వచ్చి మారప్పన్ భార్య గుండమ్మాల్ ను విచారణ చేశారు.

రెండు రోజులు సినిమా స్టోరీలు..., మూడో రోజు అసలు కథ
పోలీసుల విచారణ చేస్తే మొదట రెండు రోజులు సినిమా స్టోరీలు చెప్పిన గుండమ్మాల్ తరువాత మూడోరోజు అసలు కథ చెప్పింది. తన భర్త మారప్పన్ ప్రతిరోజు మద్యం సేవించి తనకు చిత్రహింసలకు గురి చేశాడని, అదే సమయంలో పరిచయం అయిన శివశంకర్ తో తాను అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో సంతోషంగా ఉంటున్నానని, నా భార్య నా సంతోషానికి అడ్డుపడటం వలనే అతన్ని చంపేశామని గుండమ్మాల్ పోలీసులకు జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications