Illegal affair: ప్లాస్టిక్ డ్రమ్ లో భర్త శవం, బెడ్ రూమ్ లో ప్రియుడితో భార్య, మ్యాటర్ లీక్ తో, క్లైమాక్స్ !
చెన్నై/సేలం: యువతి, యువకుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో కలిసి భార్య కొంతకాలం సంతోషంగా జీవించింది. పని చెయ్యడానికి బయట ఊర్లకు వెలుతున్న భర్త కొన్ని రోజులు అక్కడే ఉంటున్నాడు. భర్త బయట ఊర్లో ఉన్న సమయంలో పక్కింటిలో నివాసం ఉంటున్న యువకుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. బయట భర్త కష్టపడి పని చేస్తుంటే అతని భార్య పక్కింటి ప్రియుడితో జల్సా చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేస్తోందని భర్తకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. తన ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య రగిలిపోయింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య అతని శవాన్ని ప్లాస్టిక్ బ్యారల్ లో వేసి పైన మూత పెట్టడం కలకలం రేపింది. ప్లాస్టిక్ బ్యారెల్ లో భర్త శవం పెట్టుకుని ప్రియుడిని డైరెక్టుగా ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తున్న భార్య అడ్డంగా చిక్కిపోయింది.

లవ్ మ్యారేజ్
తమిళనాడులోని సేలంలోని కిచ్చపాళ్యం నేషనల్ రీ కన్ స్ట్రక్షన్ కాలనీలో సేతుపతి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సేతుపతికి ప్రియా అనే యువతి పరిచయం అయ్యింది. రానురాను సేతుపతి, ప్రియాల పరిచయం ప్రేమగా మారింది. ప్రేమించుకున్న సేతుపతి, ప్రియా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. పెద్దలను ఎదిరించిన ప్రియా, సేతుపతి 8 సంవత్సరాల క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నారు.

పని చెయ్యడానికి వెలుతున్న భర్త
సేతుపతి, ప్రియా దంపతులకు ఆరు సంవత్సరాల వయసు ఉన్న కూతురు, 10 నెలల వయసు ఉన్న మరో కూతురు ఉంది. భర్త సేతుపతితో కలిసి ప్రియా కొంతకాలం సంతోషంగా జీవించింది. కూలి పని చెయ్యడానికి బయట ఊర్లకు వెలుతున్న సేతుపతి కొన్ని రోజులు అక్కడే ఉంటున్నాడు. కొన్ని రోజులు పని చేసి ఇంటికి వెలుతున్న సేతుపతి అతని భార్య ప్రియా, పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటూ మళ్లీ పనికి వెలుతున్నాడు.

ఎర్రగా ఉండే భార్యకు పక్కింట్లో ప్రియుడు
ప్రియా చూడటానికి ఎర్రగా, సన్నగా పొడువగా ఉంటుంది. భర్త సేతుపతి ఎక్కువగా బయట ఉండటంతో ఇద్దరు కూతుర్లతో ఇంట్లో ఉంటున్న ప్రియాకు పక్కింటిలో నివాసం ఉంటున్న సతీష్ కుమార్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. రోజూ పక్కింట్లో నివాసం ఉంటున్న సతీష్ కుమార్ తో గంటలు గంటలు గడుపుతున్న ప్రియా అతని వలలో పడిపోయింది.

ప్రియుడితో మస్త్ మజా చేసిన భార్య
కూలి పనులు చేసి ఇంటికి వస్తున్న భర్త సేతుపతితో ప్రియా సంతోషంగా ఉండేది. భర్త మళ్లీ పని చెయ్యడానికి ఊరికి వెళ్లిన వెంటనే ప్రియుడు సతీష్ కుమార్ తో కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. తమ అక్రమ సంబంధం విషయం బయటపడలేదని సతీష్ కుమార్, ప్రియా చాలా కాలం గుడ్డిగా అనుకున్నారు.

భార్య అసలు మ్యాటర్ భర్తకు తెలిసిపోయింది
సతీష్ కుమార్, ప్రియా అక్రమ సంబంధం విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోయింది. కొంతకాలం తరువాత ప్రియా అక్రమ సంబంధం విషయం ఆమె భర్త సేతుపతికి తెలిసిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ప్రియా పక్కింటోడు సతీష్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని తెలుసుకున్న సతీష్ కుమార్ రగిలిపోయాడు.

ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్
కొంతకాలం నుంచి సేతుపతి అతని భార్య ప్రియాను పట్టుకుని చితకబాదుతున్నాడు. పక్కింటోడు సతీష్ కుమార్ తో మాట్లాడితే నిన్ను చంపేస్తానని సేతపతి అతని భార్య ప్రియాను హెచ్చరించాడు. ఇదే విషయంలో సేతుపతి, ప్రియా దంపతుల మద్య గొడవలు జరిగాయి. తన ప్రియుడు సతీష్ కుమార్ తో ఎంజాయ్ చెయ్యడానికి తన భర్త సేతుపతి అడ్డుగా ఉన్నాడని ప్రియా రగిలిపోయింది. ప్రియుడు సతీష్ కుమార్ తో కలిసి భర్త సేతుపతిని హత్య చెయ్యడానికి ప్రియా స్కెచ్ వేసింది.

భర్త శవాన్ని డ్రమ్ లో దాచిపెట్టిన భార్య
పని చేసి ఇంటికి వెళ్లిన సేతుపతి మద్యం మత్తులో నిద్రపోయాడు. ఆ సమయంలో ప్రియుడు సతీష్ కుమార్ ను ఇంటికి పిలిపించుకున్న ప్రియా ఆమె భర్త సేతుపతిని చంపేసింది. సేతుపతిని దారుణంగా చంపేసిన భార్య అతని శవాన్ని ప్లాస్టిక్ బ్యారల్ లో వేసి పైన మూత పెట్టింది. అర్దరాత్రి సేతుపతి శవాన్ని ఊరి బయట పడేయాలని రెండు రోజులు ప్రియా ప్రయత్నించడంతో సాధ్యం కాలేదు.

డ్రమ్ లో భర్త శవం..... ఇంట్లో ప్రియుడితో భార్య
ప్లాస్టిక్ బ్యారెల్ లో భర్త సేతుపతి శవం పెట్టుకుని ప్రియుడు సతీష్ కుమార్ డైరెక్టుగా ఇంటికి పిలిపించుకున్న ప్రియా అతనితో ఎంజాయ్ చేసింది. ప్రియా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రియా ఇంటిని పరిశీలించగా ప్లాస్టిక్ బ్యారెల్ లో సేతుపతి శవం బయటపడటంతో కిలాడీ లేడి ప్రియా పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది. ప్రియా ఇచ్చిన సమాచారం మేరకు ప్రియుడు సతీష్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications