Wife: రియల్ ఎస్టేట్ లో భర్తకు, బెడ్ రూమ్ లో భార్యకు పార్ట్నర్, 10 మందితో, రూ. లక్షలు ఇచ్చి !
బెంగళూరు/ అనంతపురం: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో అతని భార్య కింగ్ పిన్ అని వెలుగు చూడటం కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ లో భర్తకు బిజినెస్ పార్ట్నర్, బెడ్ రూమ్ లో భార్యకు పార్ట్నర్ అయిన వ్యక్తి ప్రియురాలి కోసం అన్నంత పని చేశాడు. భర్తను చంపించడానికి భార్య లక్షల రూపాయలు కిరాయి ఇవ్వడంతో బంధువులు షాక్ అయ్యారు. ప్రియుడి మోజులో పడిని భార్య మొత్తం 10 మందితో లింక్ పెట్టుకుని భర్తను సినిమా స్టైల్లో చంపించేసింది. భర్త హత్య కేసులో ఓ బాలుడు ఉండటంతో పోలీసుల దిమ్మతిరిగిపోయింది. బెడ్ రూమ్ లో రెచ్చిపోయిన భార్య డబ్బులు ఇచ్చి మరీ భర్తను చంపించడం కలకలం రేపింది.

పెళ్లిలో పరిచయం
బెంగళూరులోని గౌసియా నగర్ లో నివాసం ఉంటున్న మోహమ్మద్ షఫీ కొన్ని సంవత్సరాల క్రితం తస్లీం బాను అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత భర్త మోహమ్మద్ షఫీతో అతని భార్య తస్లీం బాను చక్కగానే కాపురం చేసింది. రెండు సంవత్సరాల క్రితం బంధువుల పెళ్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్సర్ ఖాన్ అనే వ్యక్తి మోహమ్మద్ షఫీకి, అతని భార్య తస్లీం బానుకు పరిచయం అయ్యాడు.

ఫస్ట్ పార్ట్ లో బిజినెస్ పార్ట్నర్
అప్సర్ ఖాన్ జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇదే సమయంలో అప్సర్ ఖాన్ రెండుమూడు సార్లు మోహమ్మద్ షఫీని కలిశాడు. అప్పుడప్పుడు మోహమ్మద్ షఫీ ఇంటికి వెళ్లి వస్తున్న అప్సర్ ఖాన్ అతని భార్య తస్లీం బాను మీద కన్ను వేశాడు. పైసా పెట్టుబడి లేకుండా నాతో వ్యాపారం చెయ్యడానికి చాన్స్ ఇస్తానని, నన్ను నమ్మాలని మోహమ్మద్ ఖాన్ కు అప్సర్ ఖాన్ కు చెప్పాడు.

సెకండ్ పార్ట్ లో బెడ్ రూమ్ లో భార్యకు పార్ట్నర్
మోహమ్మద్ షఫీ, అప్సర్ ఖాన్ కలిసి వ్యాపారం చెయ్యడం మొదలుపెట్టాడు. వ్యాపారలావాదేవీలు మాట్లాడటానికి మోహమ్మద్ షఫీ ఇంటికి వెళ్లి వస్తున్న అప్సర్ ఖాన్ తస్లీం బానును తగులుకున్నాడు. పనిలో పనిగా ఇంటికి వచ్చి వెలుతున్న భర్త ఫ్రెండ్ అప్సర్ ఖాన్ కు బెడ్ రూమ్ లో తస్లీం బాను స్వర్గం చూపించడం మొదలుపెట్టింది.

రియల్ ఎస్టేట్ బయట కదా ? ఇంట్లో ఏం పని
ప్రతిరోజూ తస్లీం బాను ప్రియుడు అప్సర్ ఖాన్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ బయట తిరగడం మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బయట చెయ్యాలని కాని మొగుడు లేని సమయంలో అప్సర్ ఖాన్ అతని ఇంటికి వెళ్లి తలుపులు లాక్ చేసుకుని అతని భార్య తస్లీం బానుతో ఏం వ్యాపారం చేస్తున్నాడు ? అంటూ స్థానికులకు అనుమానం పెరిగిపోయి భర్త మోహమ్మద్ షఫీ చెవిలో వేశారు.

మంత్రాలు.... చేతబడి విఫలం
ఎప్పటికేనా తన భర్త బతికుంటే తన ప్రియుడు అప్సర్ ఖాన్ తో ఎంజాయ్ చెయ్యడం కష్టం అవుతుందని బావించిన తస్లీం బాను భర్త మోహమ్మద్ షఫీకి చేతబడి చేయించి మంత్రాలతో అతని అనారోగ్యానికి గురి చేసి చంపేయాలని స్కెచ్ వేసింది. అయితే చేతబడి, మంత్రాలు ఏమాత్రం ఫలించకపోవడం, భర్త ఆరోగ్యంగానే ఉండటంతో ఆ విషయాన్ని భార్య తస్లీం బాను జీర్ణించుకోలేకపోయింది.

రెండు లక్షలు ఇస్తా.... నా మొగుడిని ఏసేయండి
తన భర్త మోహమ్మద్ ను చంపేస్తే రెండు లక్షలు నేనే ఇస్తానని భార్య తస్లీం బాను ప్రియుడు అప్సర్ ఖాన్ కు చెప్పింది. ప్రియురాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్సర్ ఖాన్ నేరచరిత్ర ఉన్న కిరాయి రౌడీలు తబ్రేజ్ షాష, వాసీం తదితరులతో డీల్ మాట్లాడి రూ. 2 లక్షలు కిరాయి ఇచ్చాడు. తబ్రేజ్, వాసీం వారి అనుచరులతో కలిసి మోహమ్మద్ షఫీ హత్యకు స్కెచ్ వేశారు.

డీల్ మాట్లాడలని చెప్పి లేపేశారు
మార్చి 19వ తేదీన ప్రియుడు అప్సర్ ఖాన్ తస్లీం బాను భర్త మోహమ్మద్ షఫీకి ఫోన్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఓ ఫ్లాట్ డీల్ మాట్లాడటానికి న్యూగురప్పనపాళ్య టింబర్ హౌస్ దగ్గరకు రావాలని చెప్పారు. టింబర్ హౌస్ దగ్గరకు వెళ్లిన మోహమ్మద్ షఫీని తబ్రేజ్, వాసీం అతని అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి అక్కడిక్కడే నరికి చంపేసి పరారైనారు. పోలీసులు రంగంలోకి దిగి అనేక కోణాల్లో విచారణ చేశారు.

నిద్రలేస్తే భార్యకు అదే పని
భర్తను చంపేశారని ఏమాత్రం జాలి లేకుండా టిప్పుటాప్ గా రెడీ అవుతున్న తస్లీం బాను ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రియుడు అప్సర్ ఖాన్ కు ఫోన్ చేసి మాట్లాడుతూ కాలం గడిపింది. అప్పటికే హత్య కేసులో కొన్ని వివరాలు సేకరించిన పోలీసులు మోహమ్మద్ షఫీ భార్య తస్లీం బాను, రియల్ ఎస్టేట్ పార్ట్నర్ అప్సర్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే వాళ్ల అక్రమ సంబంధం విషయం, మొహమ్మద్ షఫీ హత్య స్కెచ్ విషయం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహమ్మద్ షఫీ హత్య కేసులో అతని భార్య తస్లీం బాను, ప్రియుడు అప్సర్ ఖాన్, కిరాయి హంతకులు తబ్రేజ్, వాసీంతో పాటు మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 10 మందిలో ఓ మైనర్ కూడా ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications