Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భర్త, ప్రియుడు మందు పార్టీ, బెడ్ రూమ్ లో భార్య ? ఫుల్ బాటిల్ బ్రాందీతో ఫినిష్, కరోనా స్కెచ్ !

చెన్నై/మదురై/తేనీ/కడలూరు: భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్యకు ఓ కొడుకు పుట్టాడు. పుట్టినిల్లు, అత్తారింటిలో మంచి పేరు తెచ్చుకుని బతుకున్న భార్య జీవితంలోకి ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. రెండు సంవత్సరాల నుంచి ప్రియుడితో కలిసి భార్య వీరలెవల్లో ఎంజాయ్ చేసింది. భర్తకు భార్య బాగోతం తెలిసిపోవడంతో మంచిగా అతను కట్టుకున్న భార్యకు హితభోద చేశాడు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భార్య ప్రియుడితో కలిసి ఓ ఫుల్ బాటిల్ బ్రాందీ తెప్పించింది. భర్త, ప్రియుడు మందు పార్టీ చేసుకున్న తరువాత పక్కాప్లాన్ తో భర్తను చంపేసిన భార్య నా మొగుడికి కరోనా వచ్చిందెమో ? ఊపిరిఆడక కుప్పకూలిపోయాడు అంటూ నాటకాలు ఆడి అందర్ని బోల్తా కొట్టించింది.

8 ఏళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి

8 ఏళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని కల్లప్పగౌండ్రన్ పట్టిలో నివాసం ఉంటున్న ప్రభు కుమారుడు అరుణ్ కుమార్ (36), తేనీ జిల్లాకు చెందిన వైష్ణవి (27) అనే యువతికి 8 సంవత్సరాల క్రితం పెద్దలు నిశ్చయించిన పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అరుణ్ కుమార్, వైష్ణవి దంపతులకు 7 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.

 అత్తారింటిలో, పుట్టింటిలో వైష్ణవి ఫుల్ హ్యాపి

అత్తారింటిలో, పుట్టింటిలో వైష్ణవి ఫుల్ హ్యాపి

అరుణ్ కుమార్ కంబంలో ఓ జ్యువెలరీ షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త అరుణ్ కుమార్ తో చక్కగా కాపురం చేస్తున్న వైష్ణవి కుమారుడిని చాలా బాగా చూసుకునేది. అత్తారింటిలో, పుట్టింటిలో వైష్ణవి మాటకు తిరుగేకుండాపోయింది. బంధువులు అందరితో వైష్ణవి చాలా చక్కగా మాట్లాడుతూ వారిని బాగా చేసుకోవడంతో ఆమె అందరికీ దగ్గర అయ్యింది.

 రెండేళ్ల క్రితం ప్రియుడు ఎంట్రీ

రెండేళ్ల క్రితం ప్రియుడు ఎంట్రీ

అరుణ్ కుమార్ నివాసం ఉంటున్న ఊరిలోనే జయచంద్రన్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులకు జయచంద్రన్ పరిచయం ఉన్నాడు. రెండు సంత్సరాల క్రితం అరుణ్ కుమార్ భార్య వైష్ణవి, జయకుమార్ రాసుకునిపూసుకుని ఆమె ఇంట్లోనే తిరిగారు. తన వయసుకు సరిపోయే కుర్రాడు జయకుమార్ తగిలాడని వైష్ణవి అతన్ని చిన్నగా ముగ్గులోకి దింపింది.

 వేళపాళ లేకుండా ఎంజాయ్

వేళపాళ లేకుండా ఎంజాయ్

భర్త అరుణ్ కుమార్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. అప్పుడప్పుడు జయకుమార్, అరుణ్ కుమార్ మద్యం సేవించేవాళ్లు. అరుణ్ కుమార్ కు పికలదాకా మద్యం తాగించి అతన్ని ఇంటికి పిలుచుకుని వచ్చే నెపంతో జయకుమార్ అతని ఇంటిలో దూరేవాడు. రాత్రి ఇంట్లో దూరుతున్న జయకుమార్ ప్రియురాలు వైష్ణవితో రాత్రి ఫుల్ గా ఎంజాయ్ చేసి అరుణ్ కుమార్ కు మత్తు దిగిపోయిన తరువాత ప్రియుడు జయకుమార్ అతని ఇంటి నుంచి వెళ్లిపోవడం చేశాడు.

 హాల్ లో మొగుడు.... బెడ్ రూమ్ లో ప్రియుడు

హాల్ లో మొగుడు.... బెడ్ రూమ్ లో ప్రియుడు

అరుణ్ కుమార్ మద్యం సేవించిన ప్రతిసారి అతనికి పీకలదాక మద్యం తాగిస్తున్న జయకుమార్ రాత్రి అతని భార్యతో ఎంజాయ్ చెయ్యడం సర్వసాధారణం అయిపోయింది. ఇలా రెండు సంవత్సరాల నుంచి వైష్ణవి, ఆమె ప్రియుడు జయకుమార్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఓ రోజు అర్దరాత్రి తాగిన కిక్ పూర్తిగా తగ్గిపోవడంతో అరుణ్ కుమార్ నిద్రలేచి చూశాడు. అంతే తాను హాల్ లో ఉంటే బెడ్ రూమ్ లో తన భార్య వైష్ణవి, ఆమె ప్రియుడు జయకుమార్ నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న విషయం తెలుసుకుని ఇద్దరిని చితకబాదేశాడు.

 రాజీ చేసిన పాపానికి మళ్లీ బ్యాడ్ టైమ్

రాజీ చేసిన పాపానికి మళ్లీ బ్యాడ్ టైమ్

భార్య వైష్ణవి, ప్రియుడు జయకుమార్ కు వార్నింగ్ ఇచ్చిన అరుణ్ కుమార్ ఇంకో సారి ఇలా జరిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం బయటకు తెలిస్తే తన సంసారం నాశనం అవుతుందని అరుణ్ కుమార్ భార్య వైష్ణవితో రాజీ అయిపోయాడు. కొన్ని నెలలు బుద్దిగా ఉన్న వైష్ణవి మళ్లీ ప్రియుడితో పాతపురాణం మొదలుపెట్టింది. తన భర్త అడ్డుగా ఉంటే ప్రియుడు జయకుమార్ తో తాను సంతోషంగా ఉండలేనని, ఎలాగైనా నా మొగుడిని చంపేయాలని వైష్ణవి డిసైడ్ అయ్యింది.

 మొగుడు, ప్రియుడు ఫుల్ బాటిల్ మందు పార్టీ

మొగుడు, ప్రియుడు ఫుల్ బాటిల్ మందు పార్టీ

వెయ్యి రూపాయలు ప్రియుడు జయకుమార్ కు ఇచ్చిన వైష్ణవి ఓ ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురావాలని చెప్పింది. రాత్రి అరుణ్ కుమార్ ఇంటికి ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకెళ్లిన జయకుమార్ మందు పార్టీ చేసుకుందామని చెప్పాడు. కొంతకాలంగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడని అరుణ్ కుమార్ ఓకే అన్నారు. రాత్రి అరుణ్ కుమార్ కు అతని భార్య ప్రియుడు ఫుల్ గా మద్యం తాగించాడు. తరువాత జయకుమార్, అతని ప్రియురాలు వైష్ణవితో కలిసి అరుణ్ కుమార్ గొంతు నులిమి చంపేశారు. జయకుమార్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

 భార్య స్కెచ్ ఫుల్ రివర్స్

భార్య స్కెచ్ ఫుల్ రివర్స్

అర్దరాత్రి 1.30 గంటల సమయంలో తన భర్త అరుణ్ కుమార్ ఊపిరిఆడక కిందపడిపోయాడని, అతనికి కరోనా ఏమైనా వచ్చిందేమో అంటూ బంధువులను నమ్మించడానికి ప్రయత్నించింది. అప్పటికే అరుణ్ కుమార్ ప్రాణం పోయిందని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కడలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నివేదికలో రాత్రి 10. 30 గంటలకే అరుణ్ కుమార్ ప్రాణం పోయిందని, అతని గొంతు నులిమి చంపేశారని వెలుగు చూసింది.

 భార్య కిలాడీ అని చెప్పిన బంధువులు

భార్య కిలాడీ అని చెప్పిన బంధువులు

అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు వైష్ణవి, ఆమె ప్రియుడు జయకుమార్ స్టోరీని కడలూరు పోలీసులకు చెప్పారు. చిత్తూరుకు పారిపోతున్న జయకుమార్, వైష్ణవి పోలీసులు పట్టుకని వారికి బెండ్ తియ్యడంతో జరిగిన స్టోరీ మొత్తం చెప్పి అరుణ్ కుమార్ ను హత్య చేసినట్లు అంగీకరించారు. ఫుల్ బాటిల్ బ్రాందీ స్కెచ్ తో భార్య వైష్ణవి ఆమె భర్త అరుణ్ కుమార్ ను చంపేసిన విషయం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+