Illegal affair: పెళైన 22 రోజులకే భర్తను చంపేచాలని స్కెచ్, సీన్ రివర్స్ తో ?, నగలు కుదువ పెట్టి !
చెన్నై/తేని: పోలీసు ఉద్యోగం చెయ్యాలని యువతి ఆశపడుతోంది. పోలీసు ఉద్యోగం సంపాధించాలని ఆ యువతి కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్నది. ఇదే సమయంలో యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. కేబుల్ ఆపరేటర్ గా బాగా డబ్బులు సంపాధిస్తున్న యువకుడితో యువతి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. అమ్మాయి, అబ్బాయికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి, యువకుడు బలవంతంగానే కాపురం చేశారు. దంపతులు బైక్ లో బయటకు వెళ్లిన సమయంలో కారులో వెనుక నుంచి వెళ్లిన ఐదు మంది భర్తను చంపేయాలని అనుకుని అతని బైక్ ను ఢీకొట్టారు. అయితే ప్రాణాలతో భయటపడిన భర్తను చితకబాదేసిన ఐదు మంది అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు. భర్త పోలీసులు కేసు పెట్టడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్తను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన నిందితులు పోలీసులకు చిక్కిపోయారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. వివాహం జరిగిన 20 రోజులకే భార్య ఆమె భర్తను హత్య చెయ్యడానికి బంగారు నగలు కుదువ పెట్టి ప్రియుడికి కిరాయి ఇచ్చిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

పోలీసు కావాలని లేడీకి ఆశ
తమిళనాడులోని తేనీ జిల్లాలోని కంబం కురుంగమాయన్ ప్రాంతంలో గౌతమ్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో భువనేశ్వరి (22) అనే యువతి నివాసం ఉంటున్నది. పోలీసు ఉద్యోగం చెయ్యాలని భువనేశ్వరి ఆశపడుతోంది. పోలీసు ఉద్యోగం సంపాధించాలని భువనేశ్వరి తేనీలోని కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్నది.

బలవంతంగా 20 రోజుల క్రితం పెళ్లి
భువనేశ్వరికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. కేబుల్ ఆపరేటర్ గా బాగా డబ్బులు సంపాధిస్తున్న దూరపు బంధువు అయిన గౌతమ్ తో భువనేశ్వరి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. భువనేశ్వరి, గౌతమ్ కు వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ల కుటుంబ సభ్యులు నవంబర్ 10వ తేదీన పెళ్లి జరిపించేశారు.

కళ్లు మూసుకుని కాపురం చేసింది..... పెళ్లికి ముందే భార్యకు ప్రియుడు
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న గౌతమ్, భువనేశ్వరి బలవంతంగానే కాపురం చేశారు. పోలీసు శిక్షణ తీసుకోవడానికి వెళ్లి వస్తున్న సమయంలో పోలీసు ఉద్యోగం సంపాధించాలని కోచింగ్ సెంటర్ కు వెలుతున్న నిరంజన్ అనే యువకుడితో భువనేశ్వరి పరిచయం పెంచుకుంది. పెళ్లికి ముందే భువనేశ్వరి, నిరంజన్ ఎంజాయ్ చేస్తున్నారు.

భర్తను చంపడానికి నగలు కుదువ పెట్టిన భార్య
తన భర్త గౌతమ్ ను చంపేసి ప్రియుడు నిరంజన్ తో కలిసి సంతోషంగా ఉండాలని కొత్త పెళ్లి కూతురు భువనేశ్వరి ప్లాన్ వేసింది. పెళ్లికి కుటుంబ సభ్యులు తీసిచ్చిన బంగారు నగలు బ్యాంకులో కుదువ పెట్టిన భువనేశ్వరి రూ. 70 వేలు తీసుకుంది. ప్రియుడు నిరంజన్ ను కలిసిన భువనేశ్వరి అతనికి రూ. 70 వేలు ఇచ్చి తన భర్తను చంపేయాలని చెప్పింది.

పక్కాప్లాన్ తో భర్తను బయటకు పిలుచుకుని వెళ్లిన భార్య
ప్రియురాలు భువనేశ్వరి ఇచ్చిన రూ. 70 వేలతో నిరంజన్ కేరళలో రిజిస్టర్ అయిన ఓ కారును తీసుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం భువనేశ్వరి ఆమె భర్త గౌతమ్ ను ఇంటి నుంచి బైక్ లో బయటకు పిలుచుకుని వెళ్లింది. మార్గం మధ్యలో నిరంజన్ అతని స్నేహితులతో కలిసి కారులో వెళ్లి గౌతమ్ బైక్ ను ఢీకొన్నారు.

భర్తను చితకబాది ప్రియుడు ఎస్కేప్
కారు డీకొనడంతో కిందపడిపోయిన గౌతమ్ ప్రాణాలో బయటపడ్డాడు. ఆ సమయంలో నిరంజన్ అతని స్నేహితులు గౌతమ్ ను చితకబాదేసి అతని మీద కారుతో తొక్కించాలని ప్రయత్నించారు. అయితే గౌతమ్ ప్రాణాలతో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అనేక కోణాల్లో విచారణ చేశారు.

భయంతో భార్య ఆత్మహత్య
పోలీసులు గౌతమ్ తో పాటు అతని భార్య భువనేశ్వరిని విచారణ చేసి వివరాలు సేకరించారు. తన భర్త గౌతమ్ ను హత్య చెయ్యడానికి తానే కిరాయి ఇచ్చానని వెలుగు చూస్తే జైలుకు పంపిస్తారనే భయంతో ఈనెల 8వ తేదీన భువనేశ్వరి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త గౌతమ్ మీద హత్యాయత్నం జరగడం, వెంటనే అతని భార్య భువనేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులకు ఇంకా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

చిక్కిపోయిన ప్రియుడు
భువనేశ్వరి మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు నిరంజన్ ను పట్టుకున్నారు. భువనేశ్వరి ఆమె భర్త గౌతమ్ ను చంపేయాలని చెప్పిందని, మేము అతన్ని చంపడానికి ప్రయత్నించామని పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు గౌతమ్ హత్యకు ఉపయోగించిన కారుతో పాటు నిరంజన్ (22), అతని స్నేహితులు మనోజ్ (20), సత్య (22), ప్రదీప్ (37)తో పాటు 16 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. కేవలం రూ. 70 వేలకు కొత్త పెళ్లి కొడుకు గౌతమ్ ను హత్య చెయ్యడానికి కిరాయి హంతకులు రంగంలోకి దిగారని వెలుగు చూడటం తేనీలో కలకలం రేపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications