Illegal affair: వదినతో సెటిల్ అయిపోయిన భర్త, భార్యకు మండిపోయి వెళ్లి చితకబాది కారు డిక్కీలో !
బెంగళూరు/కోలారు: అన్నా, తమ్ముడికి వివాహాలు జరిగి వారి భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అన్న చనిపోవడంతో అతని భార్య ఒంటరిగా ఉంటున్నది. తమ్ముడు అతని భార్య, పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. మూడు సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్న భర్త ఆమె వదినతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతోనే ఉండిపోయాడని సమాచారం. భర్త దూరం కావడంతో అతని భార్య రగిలిపోయింది. నా భర్తను అతని వదిన వలలో వేసుకుందని రగిలిపోయిన భార్య ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆమె అంతు చూడాలని అనుకుంది. భర్తకు తెలీకుండా అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న వదినను కిడ్నాప్ చెయ్యాలని స్కెచ్ వేశారు. భర్త దూరం అయ్యాడని రగిలిపోయిన భార్య కారులో వెళ్లి అందరూ చూస్తుండగానే ఆమె భర్త వదినను చితకబాదేసింది. అందరూ కలిసి ఆమెను చితకబాదడమే కాకుండా కారు డిక్కీలో వేసుకుని కిడ్నాప్ చేశారు. మహిళను చితకబాది, కారులో కిడ్నాప్ చేస్తున్న సమయంలో స్థానికులు కొందరు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహిళను కిడ్నాప్ చేసిన భార్య, అత్త మీద ఆమె భర్త రివర్స్ కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

సొంత అన్నా, తమ్ముడు
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు తాలుకాలో సోమసంద్రలో విజయ్ కుమార్, అతని తమ్ముడు రమేష్ నివాసం ఉండేవారు. విజయ్ కుమార్ కు కమలమ్మ అలియాస్ కమల (35) అనే మహిళతో, రమేష్ కు మీనా అనే మహిళతో వివాహం అయ్యింది. అన్న విజయ్ కుమార్, తమ్ముడు రమేష్ వివాహాలు చేసుకుని వారివారి భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.

అనారోగ్యంతో చనిపోయిన అన్న
కొన్ని సంవత్సరాల క్రితం అన్న విజయ్ కుమార్ అనారోగ్యంతో చనిపోయాడు. భర్త చనిపోవడంతో విజయ్ కుమార్ భార్య కమల సోమసంద్రలో ఒంటరిగా నివాసం ఉంటున్నది. విజయ్ కుమార్ తమ్ముడు రమేష్ అతని భార్య మీనా, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటూ వ్యాపారం చేసేవాడు.

వదినతో అక్రమ సంబంధం ?
గత మూడు సంవత్సరాలుగా రమేష్ అతని భార్య మీనా, ఇద్దరు పిల్లలకు దూరంగా ఉంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తన భర్త రమేష్ ఆమె వదిన కమలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మీనా ఆరోపిస్తోంది. తన భర్త రమేష్ ఆమె వదిన కమల మోజులో పడిపోయి ఆమెతోనే ఉండిపోయాడని మీనాకు తెలిసింది. భర్త రమేష్ దూరం కావడంతో అతని భార్య మీనా రగిలిపోయింది.

భర్త ప్రియురాలిని కిడ్నాప్ చెయ్యాలని భార్య స్కెచ్
నా భర్త రమేష్ ను అతని వదిన కమల వలలో వేసుకుందని రగిలిపోయిన అతని భార్య మీనా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆమె అంతు చూడాలని అనుకుంది. మీనా, ఆమె తల్లి రామక్క, మీనా ఇద్దరు పిల్లలు, వారి మరో ఇద్దరు బంధువులు కలిసి రమేష్ కు తెలీకుండా అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న వదిన కమలను కిడ్నాప్ చెయ్యాలని స్కెచ్ వేశారు.

వదినను చితకబాది కారు డిక్కీలో కిడ్నాప్
మీనాతో పాటు అందరూ బెంగళూరు నుంచి షిఫ్ట్ కారులో కోలారు సమీపంలోని సోమసంద్రకు వెళ్లారు. భర్త రమేష్ దూరం అయ్యాడని రగిలిపోయిన మీనా కారులో నేరుగా కమల ఇంటి దగ్గరకు వెళ్లింది. అందరూ చూస్తుండగానే రమేష్ వదిన కమలను చితకబాదేశారు. మీనాతో పాటు బెంగళూరు నుంచి వెళ్లిన అందరూ కలిసి కమలను చితకబాదడమే కాకుండా ఆమెను కారు డిక్కీలో వేసుకుని కిడ్నాప్ చేసి బెంగళూరు బయలుదేరారు. మహిళను చితకబాది, కారులో కిడ్నాప్ చేస్తున్న సమయంలో స్థానికులు కొందరు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

రివర్స్ కేసు పెట్టిన భర్త
తన వదిన కమల ఒంటరిగా ఉందని ఆమె యోగక్షేమాలు మాత్రమే నేను చూస్తున్నానని, ఆమెతో తాను అక్రమ సంబంధం పెట్టుకోలేదని రమేష్ కోలారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మీద కోపంతో తన భార్య మీనాతో పాటు ఆమె తల్లి రామక్క కలిసి బంధువుల సహాయంతో తన వదిన కమలను కిడ్నాప్ చేశారని రమేష్ అతని భార్య మీనా మీద రివర్స్ కేసు పెట్టాడు.

బెంగళూరులో భార్య అండ్ కో అరెస్టు
విషయం తెలుసుకున్న పోలీసులు మీనా కోసం గాలించారు. బెంగళూరులోని కాడుగోడి పోలీసులు మీనాతో పాటు కమలను కిడ్నాప్ చేసిన అందరిని అరెస్టు చేశారని తెలిసింది. తన మరిది రమేష్ తో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని కమల పోలీసులకు చెప్పిందని తెలిసింది. కమల కోలారు జిల్లాలో కిడ్నాప్ కావడంతో కోలారు పోలీసులు బెంగళూరు చేరుకుని రమేష్ భార్య మీనాతో పాటు ఆమెతో పాటు వెళ్లి కమలను కిడ్నాప్ చేసిన అందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద భర్త అక్రమ సంబంధం పెట్టుకున్ మహిళను అతని భార్య కిడ్నాప్ చెయ్యడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications