Illegal affair: భర్తకు బిజినెస్ పార్ట్ నర్, భార్యకు బెడ్ రూమ్ పార్ట్ నర్, కిలాడీ పెళ్లామ్, కంత్రి ప్రియుడు !
భోపాల్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. దంపతులు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భర్త తల్లి, తమ్ముడు మరో ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం భర్త అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. నేను వేరే రాష్ట్రంలో పని చేస్తున్నానని, ఇంటికి రావడానికి సాధ్యం కావడం లేదని, వీలు చూసుకుని వస్తానని తల్లికి చెబుతున్నాడు. కొడుకు, కోడలు ఇంటికి రాకపోయినా కనీసం ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుతున్నారని అతని తల్లి భ్రమపడింది. గత రెండు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతోంది. అయితే తమ్ముడికి ఫోన్ చేసిన ఆ వ్యక్తి తల్లికి ఏమి డైలాగులు చెబుతున్నాడో అదే డైలాగులు చెప్పాడు. ఫోన్ చేసిందని తన అన్నకాదని, ఆ వాయిస్ తన తనదికాదని తమ్ముడు పసిగట్టాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తమ్ముడు, అతని తల్లి మా కొడుకు ఆచూకి చిక్కడం లేదని కేసు పెట్టారు. అన్న భార్య మీద అనుమానం ఉందని తమ్ముడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. అన్న హత్యకు గురై 22 నెలలు అవుతోందని వెలుగు చూసింది. అన్న భార్య అక్రమ సంబంధం మ్యాటర్ కూడా బయటకు రావడం కలకలం రేపింది.

దంపతుల కాపురం
మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో విశ్వనాథ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న విశ్వనాథ్ కొన్ని సంవత్సరాల క్రితం రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న విశ్వనాథ్, రేఖా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. రేఖా, విశ్వనాథ్ దంపతులు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

బయట ఎక్కువగా తిరుగుతున్న భర్త
విశ్వనాథ్ తల్లి, అతని తమ్ముడు మరో ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వ్యాపారం చేస్తున్న విశ్వనాథ్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. రెండు సంవత్సరాల నుంచి విశ్వనాథ్ అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. నేను వేరే రాష్ట్రంలో పని చేస్తున్నానని, ఇంటికి రావడానికి సాధ్యం కావడం లేదని, వీలు చూసుకుని వస్తానని అరవింద్ అనే వ్యక్తి విశ్వనాథ్ పేరుతో అతని తల్లికి చెబుతున్నాడు.

అత్తకు సక్రమంగా వినపడదని స్కెచ్
కొడుకు విశ్వనాథ్, కోడలు రేఖా ఇంటికి రాకపోయినా కనీసం ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుతున్నారని విశ్వనాథ్ తల్లి భ్రమపడింది. గత రెండు సంవత్సరాల నుంచి అరవింద్ విశ్వనాథ్ పేరుతో అతని తల్లికి ఫోన్ చేసి ఆమెను మోసం చేస్తున్నాడు. కంటి చూపు సరిగా లేకపోవడం, సక్రమంగా వినపడకపోవడంతో విశ్వనాథ్ తల్లి ఎవరు ఫోన్ చేస్తున్నారు అని గుర్తించలేక ఇంతకాలం మోసపోయింది.

తమ్ముడికి అనుమానం
అరవింద్ అనే వ్యక్తి విశ్వనాథ్ సొంత తమ్ముడికి ఫోన్ చేసిన అతని తల్లికి ఏమి మాయమాటలు చెప్పాడో అదే డైలాగులు చెబుతూ వచచాడు. ఫోన్ చేసిందని తన అన్న విశ్వనాథ్ కాదని, ఆ వాయిస్ తన తనదికాదని తమ్ముడు పసిగట్టాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తమ్ముడు, అతని తల్లి మా కొడుకు విశ్వనాథ్ ఆచూకి చిక్కడం లేదని కేసు పెట్టారు. అన్న విశ్వనాథ్ భార్య రేఖా మీద అనుమానం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

భర్తకు బిజినెస్ పార్ట్ నర్..... భార్యకు బెడ్ రూమ్ పార్ట్ నర్
వ్యాపారవేత్త విశ్వనాథ్ అతని స్నేహితుడు అరవింద్ తో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. భర్త విశ్వనాథ్ కోసం ఇంటికి వచ్చి వెలుతున్న అతని స్నేహితుడు అరవింద్ తో రేఖా అక్రమ సంబందం పెట్టుకుంది. భర్త విశ్వనాథ్ వ్యాపార భాగస్వామి అరవింద్ వాళ్ల ఇంటికి వచ్చి వెలుతుండటంతో ఎవ్వరికి అనుమానం రాలేదు. ఇదే సందర్బంలో భర్త విశ్వనాథ్ ఫ్రెండ్ అరవింద్ తో రేఖా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

22 నెలల క్రితమే భర్తను చంపేసిన కిలాడి
2020 నవంబర్ 23వ తేదీన ఇంటికి వెళ్లిన విశ్వనాథ్ కు నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టింది. ఆ సందర్బంలో మత్తులోకి జారుకున్న భర్త విశ్వనాథ్ ను రేఖా, ఆమె ప్రియుడు అరవింద్ కలిసి హత్య చేశారు. శవాన్ని తీసుకెళ్లి నదీ కాలువలో విసిరేశారు. కొన్ని రోజుల తరువాత విశ్వనాథ్ శవం కుళ్లిపోయిన స్థితిలో పోలీసులకు చిక్కింది. గుర్తు తెలియని శవం అని పోలీసులు విశ్వనాథ్ శవం పూడ్చి పెట్టేశారు.
Recommended Video


భర్త మ్యాటర్ బయటకు రాకూడదని ?
భర్త విశ్వనాథ్ కనపడటం లేదని కేసు పెడితే మొదటికే మోసం వస్తుందని ఊహించిన రేఖా ఆమె ప్రియుడు అరవింద్ తో భర్త కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడిస్తూ 22 నెలల పాటు మేనేజ్ చేసింది. భర్త విశ్వనాథ్ ఆస్తులు, డబ్బుతో ప్రియుడు అరవింద్ తో కలిసి ఇంతకాలం ఎంజాయ్ చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త విశ్వనాథ్ ను చంపేసి అతని ఫ్రెండ్ అరవింద్ తో ఇంతకాలం జల్సా చేసిన రేఖా, ఆమె ప్రియుడు అరవింద్ మధ్యప్రదేశ్ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications