Illegal affair: ఎంతమంది కావాలి ?, నన్ను మోసం చేసి నువ్వు జల్సాలు చేస్తావా ?, భార్యను చంపి !

బెంగళూరు/బెళగావి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు చక్కగా వ్యాపారం చేసిన భర్త అతని భార్య, పిల్లలను బాగా చూసుకున్నాడు. డబ్బులు బాగా సంపాదిస్తున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. దెబ్బకు వ్యాపారం అటకెక్కింది. భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చితకబాది సినిమా చూపించాడు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, నువ్వే నన్ను, పిల్లలను పోషించాలని భార్యకు చిత్రహింసలు పెట్టాడు. భార్య, కూతురిని ఇంటి నుంచి బయటకు తరిమేశాడు. చివరికి భార్య ఉంటున్న ఇంటికి వెళ్లిన భర్త నువ్వు ఇంకా ఎంతమందితో తిరిగుతావే, నన్ను మోసం చేసి నువ్వు జల్సాలు చేస్తున్నావా అంటూ ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఏదో ఘనకార్యం చేసినట్లు కత్తి తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మ్యాటర్ మొత్తం చెప్పాడు.

 10 ఏళ్ల క్రితం పెళ్లి

10 ఏళ్ల క్రితం పెళ్లి

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని సవదత్తి తాలుకాలోని మునవళ్ళిలో ననివాసం ఉంటున్న మోహబూబ్ సాబ్ అనే యువకుడు 10 సంవత్సరాల క్రితం ఖానాపుర తాలుకాలోని బీడి గ్రామంలో నివాసం ఉంటున్న శబనా (29) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మోహబూబ్ సాబ్, శబనా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

 మద్యం మత్తులో భర్త

మద్యం మత్తులో భర్త

మోహబూబ్ సాబ్, శబనా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు భార్య శబనాతో చక్కగా సంసారం చేశాడు. సొంత ఊరిలో ఎగ్ రైస్ వ్యాపారం చేసిన ఆమె భర్త మోహబూబ్ సాబ్ అతని భార్య, పిల్లలను బాగా చూసుకున్నాడు. ఎగ్ రైస్ చెయ్యడంలో మోహబూబ్ సాబ్ ఫేమస్ అయిపోవడంతో అతను డబ్బులు బాగా సంపాదించాడు.

 భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

రానురాను మోహబూబ్ సాబ్ విలాసాలకు బానిస అయ్యాడు. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మోహబూబ్ సాబ్ మద్యం మత్తులో మునిగిపోయేవాడు. డబ్బులు బాగా సంపాదిస్తున్న మోహబూబ్ సాబ్ మద్యం సేవించడానికి బానిస కావడంతో దెబ్బకు అతని వ్యాపారం అటకెక్కింది. ఇదే సమయంలో భార్య శబనా మీద అనుమానం పెంచుకున్న మోహబూబ్ సాబ్ ఆమెను చితకబాదడం మొదలు పెట్టాడు.

 భార్యకు టార్చర్ పెట్టిన భర్త

భార్యకు టార్చర్ పెట్టిన భర్త

శబనా ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ లాక్కొన్న మోహబూబ్ సాబ్ ఆమె ఎవ్వరితో మాట్లాడకుండా, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు. ఎలాంటి పని చెయ్యకుండా ఇంటికే పరిమితం అయిన మోహబూబ్ సాబ్ కొంతకాలం తరువాత భార్యను పనికి పంపించడానికి సిద్దం అయ్యాడు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, నువ్వే నన్ను, పిల్లలను పోషించాలని శబనాకు చిత్రహింసలు పెట్టాడు.

 భార్య, కూతురిని ఇంటి నుంచి తరమేసిన భర్త

భార్య, కూతురిని ఇంటి నుంచి తరమేసిన భర్త

భార్య శబనాను, కూతురిని ఇంటి నుంచి బయటకు తరిమేశాడు. మోహబూబ్ సాబ్ అతని కొడుకుతో పాటు వేరే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. భార్య శబనాతో విడాకులు తీసుకోవడానికి మోహబూబ్ సాబ్ విడాకులకు అర్జీ సమర్పించాడు. శబనా, ఆమె కూతురు సబదత్తిలోని అయ్యప్పనగర్ లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.

 భార్యను చంపేసి లొంగిపోయిన భర్త

భార్యను చంపేసి లొంగిపోయిన భర్త

ఇంటి పని చేస్తున్న శబనా ఆమె కూతురిని పోషిస్తోంది. ఉదయం శబనా నివాసం ఉంటున్న అయ్యప్పనగర్ లోని ఇంటికి వెళ్లిన మోహబూబ్ సాబ్ నువ్వు ఇంకా ఎంతమందితో తిరిగుతావు, నన్ను మోసం చేసి నువ్వు జల్సాలు చేస్తున్నావా అంటూ రెచ్చిపోయి ఆమెను చితకబాదేశాడు. ఆరు సంవత్సరాల కన్న కూతురి ముందే కత్తితో భార్య శబనా గొంతు కోసి దారుణంగా చంపేశాడు. శబనాను హత్య చేసిన ఆమె భర్త మోహబూబ్ సాబ్ కత్తి తీసుకుని నేరుగా సవదత్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్యను నేనే చంపేశాను అంటూ లొంగిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+