Illegal affair: మొదటి భార్య అలా, రెండో భార్య ఇలా, గ్రహాలు అనుకూలించలేదు, ప్రియుడితో కలిసి, క్లైమాక్స్ లో !
బెంగళూరు/ చిత్రదుర్గా: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొన్ని సంవత్సరాలు కాపురం చేశాడు. భార్య అనారోగ్యంతో చనిపోవడంతో అతను ఒంటరివాడు అయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అతనికి వేరే యువతితో పెళ్లి జరిపించారు. రెండో భార్యతో కాపురం చేసిన వ్యక్తి ఇద్దరు కూతుర్లకు తండ్రి అయ్యాడు. రెండో భార్యతో కలిసి కొన్ని సంవత్సరాలు అతను సంతోషంగా కాపురం చేశాడు. ఇదే సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న వ్యక్తితో రెండో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్ని సంవత్సరాలు అక్రమ సంబంధం సాఫీగా సాగిపోయింది. రెండు సంవత్సరాల నుంచి రెండో భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో బరితెగించి తిరగడం మొదలుపెట్టింది. పెద్దలు పంచాయితీలు చేసి భార్యకు బుద్దిమాటలు చెప్పారు. అయితే రెండో భార్య మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఇదే సమయంలో అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న భర్తను చంపేయాలని అతని రెండో భార్య స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను అతని తల్లిదండ్రుల ఇంటి సమీపంలోనే హత్య చేసిన రెండో భార్య చేతులు దులుపుకోవాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కైపోయింది.

భార్య చనిపోయింది
కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లాలోని హోళల్కెరే తాలుకాలోని భరమసాగరాలోని జట్ పట్ నగర్ లో బాషాసాబ్ అలియాస్ బాషా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 13 ఏళ్ల క్రితం బాషాసాబ్ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు బాషాసాబ్ తో కాపురం చేసిన అతని భార్య అనారోగ్యంతో చనిపోయింది.

రెండో పెళ్లి చేసుకున్న అమాయకుడు
భార్య అనారోగ్యంతో చనిపోవడంతో బాషాసాబ్ ఒంటరివాడు అయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి 10 సంవత్సరాల క్రితం బాషాసాబ్ కు పర్వీన్ అనే యువతితో పెళ్లి జరిపించారు. రెండో భార్య పర్వీన్ తో కాపురం చేసిన బాషాసాబ్ ఇద్దరు కూతుర్లకు తండ్రి అయ్యాడు. రెండో భార్య పర్వీన్ తో కలిసి కొన్ని సంవత్సరాలు బాసాసాబ్ సంతోషంగా కాపురం చేశాడు.

ప్రియుడిని సెట్ చేసుకున్న రెండో భార్య
బాషాసాబ్ దూరపు బంధువు దాదాపీర్ తో పర్వీన్ చనువు పెంచుకుంది. ఇదే సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న దాదాపీర్ తో బాషాసాబ్ రెండో భార్య పర్వీన్ అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్ని సంవత్సరాలు పర్వీన్, దాదాపీర్ ల అక్రమ సంబంధం చాపకింద నీరులా సాఫీగా సాగిపోయింది.

మ్యాటర్ లీక్... తాగుబోతు అయిపోయిన భర్త
రెండు సంవత్సరాల నుంచి బాషాసాబ్ రెండో భార్య పర్వీన్ అక్రమ సంబంధం పెట్టుకున్న దాదాపీర్ తో బరితెగించి తిరగడం మొదలుపెట్టింది. పెద్దలు పంచాయితీలు చేసి బాషాసాబ్ రెండో భార్య పర్వీన్ కు బుద్దిమాటలు చెప్పారు. అయితే బాషాసాబ్ రెండో భార్య పర్వీన్ మాత్రం పద్దతి మార్చుకోలేదు. రెండో భార్య పర్వీన్ అక్రమ సంబంధం దెబ్బతో ఆమె భర్త బాషాసాబ్ ఉదయం నుంచి రాత్రి వరకు విపరీతంగా మద్యం సేవిస్తూ వీరతాగుబోతు అయిపోయాడు.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన రెండో భార్య
మద్యంమత్తులో ఇంటికి వెలుతున్న బాషాసాబ్ అతని రెండో భార్య పర్వీన్ ను పట్టుకుని చితకబాదుతున్నాడు. అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న భర్త బాషాసాబ్ ను చంపేయాలని అతని రెండో భార్య పర్వీన్ స్కెచ్ వేసింది. రాత్రి మద్యం సేవించి బాషాసాబ్ ఇంటికి బయలుదేరాడు. ప్రియుడు దాదాపీర్ తో కలిసి భర్త బాషాసాబ్ ను అతని తల్లిదండ్రుల ఇంటి సమీపంలోనే హత్య చేసిన రెండో భార్య పర్వీన్ చేతులు దులుపుకోవాలని ప్రయత్నించింది.

భార్యకు గ్రహాలు అనుకూలించలేదు
బాషాసాబ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పర్వీన్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో ఆమె అడ్డంగా బుక్కైపోయింది. తన ప్రియుడు దాదాపీర్ తో కలిసి తన భర్త బాషాసాబ్ ను గొంతునుమిలి హత్య చేశామని పర్వీన్ అంగీకరించిందని చిత్రదుర్గా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications