Illegal affair: డిగ్రీ పూర్తి, వ్యాపారం చెయ్యమంటే వివాహిత మహిళతో ?, సీసీటీవీల్లో చిక్కిపోయి ?, క్లైమాక్స్ !

చెన్నై/కన్యాకుమారి: కొడుకును బాగా చదివించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కొడుకు డిగ్రీ పూర్తి చెయ్యడంతో అతని ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు వ్యాపారం చెయ్యాలని చెప్పారు. ఆక్వేరియం షాపు పెట్టిన యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. షాపు సమీపంలో ఉంటున్న వివాహిత మహిళతో ఆ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పటికే భర్తకు దూరంగా ఉంటున్న మహిళ మోజులో పడిపోయిన యువకుడు ఇంటికి కూడా వెళ్లకుండా ఆమె ఇంటిలోనే సెటిల్ అయిపోయాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ఆమె ప్రియుడికి చెప్పింది. ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని, ఆమె ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ఆ యువకుడు రూ. 5 వడ్డీకి లక్షల రూపాయలు అప్పులు చేశాడు. మహిళ మోజులో పడిపోయి షాపు కూడా సక్రమంగా తియ్యకపోవడం, పగలు రాత్రి అని తేడా లేకుండా ఆమెతో ఎంజాయ్ చేస్తున్న ఆ యువకుడు అప్పుల్లో కూరుకుపోయాడు. ఇదే సమయంలో డబ్బులు ఇచ్చి వాళ్లు వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేశారు. ప్రియురాలితో సుఖంగా ఉండాలని, అప్పులు తీర్చేయాలని డిగ్రీ పూర్తి చేసిన యువకుడు ఊరిమీద పడ్డాడు. గత కొంతకాలంగా మహిళకు నిద్రలేకుండా చేసిన పోటుగాడి అసలు మ్యాటర్ సీసీటీవీ కెమెరాల్లో చూసిన పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అతను వేసుకున్న స్కెచ్ పూర్తిగా రివర్స్ అయ్యింది.

డిగ్రీ పూర్తి చేసిన యువకుడు

డిగ్రీ పూర్తి చేసిన యువకుడు


తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కులాచల్, కరుంగల్ లోని ఇరానీయాల్ ప్రాంతంలో సుబిన్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొడుకు సుబిన్ ను బాగా చదివించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. సుబిన్ డిగ్రీ పూర్తి చెయ్యడంతో అతనికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు వ్యాపారం చెయ్యాలని తల్లిదండ్రులు అతనికి చెప్పారు.

లేడీతో అక్రమ సంబంధం

లేడీతో అక్రమ సంబంధం

ఆక్వేరియం షాపు పెట్టిన సుబిన్ వ్యాపారం చేస్తున్నాడు. షాపు సమీపంలో ఉంటున్న వివాహిత మహిళతో సుబిన్ పరిచయం పెంచుకుని కొంతకాలానికే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పటికే భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళ మోజులో పడిపోయిన సుబిన్ ఇంటికి కూడా వెళ్లకుండా ఆమె ఇంటిలోనే సెటిల్ అయిపోయాడు.

ప్రియురాలి కోసం అప్పులు చేసిన ప్రియుడు

ప్రియురాలి కోసం అప్పులు చేసిన ప్రియుడు

సుబిన్ వ్యాపారం చేసి సంపాధిస్తున్న డబ్బు మొత్తం ప్రియురాలి ముఖాన తగలేశాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని ప్రియరాలు ఆమె ప్రియుడు సుబిన్ కు చెప్పింది. ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని, ఆమె ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని సుబిన్ రూ. 5 వడ్డీకి లక్షల రూపాయలు అప్పులు చేశాడు.

ప్రియురాలి ఇంట్లో 24 x 7

ప్రియురాలి ఇంట్లో 24 x 7


మహిళ మోజులో పడిపోయి షాపు కూడా సక్రమంగా తియ్యకపోవడం, పగలు రాత్రి అని తేడా లేకుండా ఆమెతో ఎంజాయ్ చేస్తున్న సుబిన్ అప్పుల్లో కూరుకుపోయాడు. ఇదే సమయంలో డబ్బులు ఇచ్చి వాళ్లు వడ్డీ చెల్లించాలని సుబిన్ మీద ఒత్తిడి చేశారు. ప్రియురాలితో సుఖంగా ఉండాలని, అప్పులు తీర్చేయాలని డిగ్రీ పూర్తి చేసిన సుబిన్ బైక్ ఎత్తుకునిన ఊరిమీద పడి కనపడిన మహిళ మెడలో బంగారు గోలుసులు, మంగళసూత్రాలు లాక్కొనిపారిపోవడం చేస్తున్నాడు.

సీసీటీవీ కెమెరాలతో చిక్కిపోయాడు

సీసీటీవీ కెమెరాలతో చిక్కిపోయాడు

గత కొంతకాలంగా విపరీతంగా చైన్ స్నాచింగ్ లు చేసిన సుబిన్ ఆ ప్రాంతంలోని మహిళకు నిద్రలేకుండా చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ కెమెరాల్లో పరిశీలించారు. మొదట చైన్ స్నాచింగ్ లు చేసిన సబిన్ బైక్ నెంబర్ గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సుబిన్ పోలీసులకు చిక్కిపోవడంతో అతను వేసుకున్న స్కెచ్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇప్పటి వరకు 9 మంది మహిళల మెడలో మంగళసూత్రాలు, బంగారు గోలుసులు లాక్కెళ్లినట్లు సుబిన్ అంగీకరించాడని కన్యాకుమారి పోలీసులు మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+