మున్సిపల్ అధికారుల దూకుడు.. భారీ భవంతులు నేలమట్టం..! (వీడియో)
ఇండోర్ : మధ్యప్రదేశ్ మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు. అనుమతులు లేని భవనాలపై కన్నెర్రజేస్తున్నారు. ఆ క్రమంలో కాస్ట్లీ బిల్డింగులు కూలగొడుతుండటం చర్చానీయాంశమైంది. అక్రమ భవనాలు ఎవరివైనా సరే ముందు వెనుకా చూడకుండా కూల్చివేస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం ఉదయం ఇండోర్ కామధేను నగర్‌లోని ఓ భారీ భవంతిని నేలమట్టం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ క్రమంలో ఈనెల 4వ తేదీన ఉజ్జయిని మున్సిపల్ అధికారులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే గాకుండా, ఆ స్థలంలో పెద్ద హోటల్ కట్టిన యజమానులకు షాక్ ఇచ్చారు. ఆ భవనం నిర్మించడానికి వారికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదు గానీ.. మున్సిపల్ అధికారులు మాత్రం కేవలం 25 సెకన్లలో దాన్ని నేలమట్టం చేశారు. ఆ వీడియో కూడా వైరలయింది.
#WATCH: An illegal building was demolished by Municipal Corporation at Kamdhenu Nagar in Indore, earlier today. #MadhyaPradesh pic.twitter.com/RdCLiJDI6W
— ANI (@ANI) July 16, 2019
ఉజ్జయినిలో చాలా ఫేమస్ అయిన శాంతి ప్యాలెస్ హోటల్‌ను జులై 4వ తేదీన మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమంగా హోటల్ నిర్మించారనే కారణంగా భారీ భవనాన్ని సెకన్ల వ్యవధిలో కూల్చిపడేశారు. న్యాయస్థానం తీర్పుతో పురపాలక అధికారులు ఆ హోటల్‌ను నేలమట్టం చేశారు.
20 కోట్ల రూపాయలతో దాదాపు 100 గదులతో నిర్మితమైన అత్యాధునిక సౌకర్యాల శిఖరాగ్రం శాంతి ప్యాలెస్ హోటల్ కూల్చడం చర్చానీయాంశమైంది. రెసిడెన్షియల్ కాలనీ నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న హోటల్ యజమానులు భారీ భవంతిని కట్టారు. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టులో దాదాపు పదేళ్లుగా కేసు నడిచింది. ఆ క్రమంలో శాంతి ప్యాలెస్ హోటల్‌ను అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేయాలని ఆదేశించింది న్యాయస్థానం. భారీ భవంతులను ఇలా కూలగొట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications