జ్యోతిష్కుడి అక్రమ సంబంధం, పెళ్లి పేరుతో నగలు, నగదు స్వాహా, రేప్ కేసు పెడుతా, యువతిని చంపేసి !

చెన్నై: అక్రమ సంబంధం సాగిస్తున్న యువతి దగ్గర భారీ మొత్తంలో నగదు, బంగారు నగలు తీసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే తన మీద అత్యాచారం చేసి బెదిరించి నగలు, నగదు తీసుకున్నాడని పోలీసు కేసు పెట్టి జైలుకు పంపిస్తానని యువతి ప్రియుడిని బెదిరించింది. పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి చేసిన యువతిని పక్కాప్లాన్ తో ఓ జ్యోతిష్కుడు హత్య చేసి కావేరీ నిదిలో విసిరేశాడు. గత్యంతరం లేక ప్రియురాలిని హత్య చేసిన జ్యోతిష్కుడు తహసిల్దార్ ముందు లొంగిపోయాడు.

ఆరు నెలల్లో భర్త వదిలేశాడు

ఆరు నెలల్లో భర్త వదిలేశాడు

తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుచ్చెంగోడు సమీపంలోని ఆలండివలస ప్రాంతంలో నివాసం ఉంటున్న జ్యోతిష్కుడు కంఠస్వామి తన కుమార్తె నెలైయమ్మాల్ (22)ను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడితో వివాహం చేశాడు. నెలైయమ్మాల్ దంపతుల మధ్య అభిప్రాయవిభేదాలు రావడంతో ఆరు నెలల్లోనే వారు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న నెలైయమ్మాల్ పుట్టింటికి చేరుకుని అక్కడే నివాసం ఉంటోంది.

గురువుతో వ్యాపార లావాదేవీలు

గురువుతో వ్యాపార లావాదేవీలు

నామక్కల్ సమీపంలోని అన్నై సెట్టియార్ నగర్ లో నివాసం ఉంటున్న ఆర్ముగం కుమారుడు ముత్తు (25) జ్యోతిష్కుడు. వ్యాపార లావాదేవీల కారణంగా ముత్తు తన గురువు కంఠస్వామి ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో కంఠస్వామి కుమార్తె నెలైయమ్మాల్ తో ముత్తుకు పరిచయం అయ్యింది.

నిన్నేప్రేమిస్తున్నా

నిన్నేప్రేమిస్తున్నా

గురువు కంఠస్వామి కుమార్తె నెలైయమ్మాల్ తో పరిచయం పెంచుకున్న ముత్తు నిన్నేప్రేమిస్తున్నా అంటూ ఆమె వెంటపడ్డాడు. తరువాత ముత్తు, నెలైయమ్మాల్ కలిసి అనేక సార్లు సినిమాలు, షికార్లకు తిరిగారు. తరువాత ముత్తు, నెలైయమ్మాల్ శారీరకంగా దగ్గరై ఉల్లాసంగా, ఏకాంతంగా గడిపారు.

మాయమాటలతో నగలు, నగదు స్వాహా !

మాయమాటలతో నగలు, నగదు స్వాహా !

తనకు ఎక్కువ అప్పులు ఉన్నాయని, ఆ సమస్యలు తీరిపోతే మనం సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుందని ముత్తు అతని ప్రియురాలు నెలైయమ్మాల్ కు చెప్పాడు. తన ప్రియుడు ముత్తు అప్పులు అన్నీ తీరిపోతే తనను వివాహం చేసుకుంటే ఇద్దరూ సుఖంగా ఉంటామని నెలైయమ్మాల్ భావించింది. తరువాత తన దగ్గర ఉన్న నగదుతో పాటు బంగారు నగలు ఇచ్చిన నెలైయమ్మాల్ వాటిని కుదవ పెట్టుకుని మీ సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రియుడు ముత్తుకు చెప్పింది.

ప్రియుడు రివర్స్

ప్రియుడు రివర్స్

నగదు, నగలు తీసుకున్న ముత్తు రానురాను నెలైయమ్మాల్ కు దూరం కావడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో తనను వివాహం చేసుకోవాలని నెలైయమ్మాల్ ప్రియుడు ముత్తు మీద ఒత్తిడి చేసింది. పెళ్లి చేసుకుంటానని ఈ రోజు.... రేపు అంటూ కొంత కాలం గడిపిన ముత్తు నిన్ను వివాహం చేసుకోవడం కుదరదని, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ ఎందురుతిరిగాడంతో నెలైయమ్మాల్ షాక్ కు గురైయ్యింది.

రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తా !

రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తా !

తనను వివాహం చేసుకోకుంటే తన మీద అత్యాచారం చేసి బలవంతంగా నగలు, నగదు లాక్కొన్నాడని కేసు పెట్టి జైలుకు పంపిస్తానని నెలైయమ్మాల్ ప్రియుడు ముత్తును బెదిరించింది. ఆ సమయంలో కొంత కాలం ఓపికపట్టాలని, మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని ముత్తు ప్రియురాలు నెలైయమ్మాల్ కు నచ్చచెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

కత్తితో పొడిచి చంపేసి కావేరీ నదిలో పారేశాడు

కత్తితో పొడిచి చంపేసి కావేరీ నదిలో పారేశాడు

బుధవారం పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు నెలైయమ్మాల్ ను నమ్మించిన ముత్తు ఆమెను పిలుచుకుని కావేరి నదీ తీరానికి తీసుకెళ్లాడు. తరువాత అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ముత్తు ఆవేశంలో కత్తి తీసుకుని ప్రియురాలు నెలైయమ్మాల్ ను పొడిచి చంపేశాడు. తరువాత నెలైయమ్మాల్ శవం కావేరీ నదిలో విసిరేశాడు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో సమీపంలోని తహసిల్దార్ కదిరివేల్ దగ్గరకు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కావేరీ నదిలో గాలించి నెలైయమ్మాల్ శవాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ముత్తును అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+