• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ఇద్దరు భర్తలు, ఇద్దరికీ జామకాయ, పార్ట్ టైమ్ లవర్ తో అడ్డంగా చిక్కి !

|

చెన్నై/ తిరువల్లూరు: తల్లిదండ్రులు చూసిన యువకుడిని ఓ యువతి పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసింది. అదే సమయంలో పరిచయం అయిన వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకునింది. మొదటి భర్తకు మసాలా దోసె తినిపించి చేతిలో ఆరంజ్ పెట్టిన భార్య ప్రియుడితో కలిసి లేచిపోయి అతన్ని రెండు పెళ్లి చేసుకుని వేరే ఇంటిలో కాపురం పెట్టింది. రెండో భర్త జేసీబీ డ్రైవర్ కావడంతో వారంలో నాలుగు రోజుల పని, మూడు రోజులు ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేశాడు. రెండో భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో ఖాళీగా ఉండటం దేనికి అంటూ పార్ట్ టైమ్ ప్రియుడిని వెతుకున్న ప్రియాక పాపం పండియింది. రెండోభర్త ఏం చెయ్యాలో అది చేస్తే ఆమె జనాభా లెక్కల్లో నుంచి శాస్వతంగా కనపడకుండాపోయింది.

Illegal affair: టిఫిన్ సెంటర్ ఆంటీ, ఇడ్లీ,వడ, దోసె, పూరీ ఫ్రీ, పగలు పని...రాత్రి పండగ!

కార్తీక్ VS ప్రియాంక

కార్తీక్ VS ప్రియాంక

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా వెంగల్ సమీపంలోని మెన్నవేడు ప్రాంతంలో కార్తీక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పెద్దలు చూపించిన ప్రియాంక అనే యువతితో కార్తీక్ పెళ్లి జరిగింది. పెద్దలు చూసి పెళ్లి చేసిన కార్తీక్ తో ప్రియాంక కొంతకాలం చక్కగా కాపురం చేసింది. భార్య ప్రియాంకను కార్తీక్ కూడా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు.

 రాజ్ కుమార్ ఎంట్రీ

రాజ్ కుమార్ ఎంట్రీ

తమిళనాడులోని తిరువలంకాడు ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజ్ కుమార్ అనే యువకుడు ప్రియాంకకు పరిచయం అయ్యాడు. ప్రియాంక, రాజ్ కుమార్ ఇద్దరి ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. భర్త కార్తీక్ లేని సమయంలో ప్రియాంక రాజ్ కుమార్ కు ఫోన్ చెయ్యడం మొదలుపెట్టింది. ఫోన్లలో మాట్లాడుకుంటున్న ప్రియాంక, రాజ్ కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

 అసలే జేసీబీ డ్రైవర్..... దున్మేశాడు

అసలే జేసీబీ డ్రైవర్..... దున్మేశాడు

రాజ్ కుమార్ జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ప్రియాంక నివాసం ఉంటున్న మెన్నమేడు పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్న రాజ్ కుమార్ ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. అసలే జేసీబీ డ్రైవర్ కావడంతో ప్రియాంకను పట్టుకుని దున్మేశాడు. ఒక పక్క భర్త కార్తీక్, మరోపక్క ప్రియుడు రాజ్ కుమార్ తో ప్రియాంక పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

ప్రియాంక జెండాపై కపిరాజు

ప్రియాంక జెండాపై కపిరాజు

ఇటీవల ఉదయం భర్త కార్తీక్ కు మంచి సద్ది అన్నం పెట్టిన ప్రియాంక ప్రియుడు రాజ్ కుమార్ తో కలిసి లేచిపోయింది. రాజ్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకున్న ప్రియాంక తిరువాలాంకాడ్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టింది. భార్య ప్రియాంక కోసం వెతికి వెతికి విసిగిపోయిన కార్తీక్ ఆమె గురించి పట్టించుకోవడం మానేశాడు.

 ఇద్దరు భర్తలు..... పార్ట్ టైమ్ ప్రియుడు

ఇద్దరు భర్తలు..... పార్ట్ టైమ్ ప్రియుడు

రాజ్ కుమార్ ఒక్కసారి జేసీబీ తీసుకుని పని చెయ్యడానికి వెళితే ఇంటికి రావడానికి రెండుమూడు రోజులు పట్టేది. ప్రతిసారి ఇంటి నుంచి వెళ్లిన రాజ్ కుమార్ రెండుమూడు రోజుల తరువాత ఇంటికి వెళ్లేవాడు. ఇదే సమయంలో ప్రియాంక పార్ట్ టైమ్ గా ఎంజాయ్ చెయ్యడానికి సెల్వా అనే యువకుడిని లైన్ లో పెట్టింది. రాజ్ కుమార్ పనికి వెళ్లిన రెండుమూడు రోజులు సెల్వాతో ప్రియాంక ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

డౌట్ రాకుండా రాజీ అయ్యాడు

డౌట్ రాకుండా రాజీ అయ్యాడు

ఇటీవల అనుకోకుండా పని మధ్యలో ఆగిపోవడంతో ఒక్కరోజు తరువాత రాజ్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అర్దరాత్రి ప్రియుడు సెల్వాతో కలిసి ప్రియాంక బెడ్ రూమ్ లో అడ్డంగా రెండో భర్త రాజ్ కుమార్ కు చిక్కిపోయింది. నేనే సెకండ్ హ్యాండ్ అనుకుంటే మళ్లీ నీకు మూడో వాడు కావాలా ? అంటూ రాజ్ కుమార్ ప్రియాంకను పట్టుకుని చితకబాదేశాడు. మరుసటి రోజు ప్రియాంకు సర్దిచెప్పిన రాజ్ కుమార్ ఆమెకు డౌట్ రాకుండా లేపేయాలని డిసైడ్ అయ్యాడు.

కాళ్లు చేతులు కట్టేసి..... లేపేశాడు

కాళ్లు చేతులు కట్టేసి..... లేపేశాడు

కూల్ డ్రింక్ లో ముందుగా కలిపిన పురుగుల మందు తీసుకు వెళ్లి ప్రియాంక చేతులు కాళ్లు కట్టేసి ఆమెతో బలవంతంగా పురుగులమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి కూల్ గా చంపేశాడు. శరీరంలోకి విషం చేరిపోవడంతో ప్రియాంక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రియాంక చనిపోయిందని నిర్దారించుకున్న రాజ్ కుమార్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి నా భార్యను చంపేశానని సమాచారం ఇచ్చాడు. మొత్తం మీత మూడో మొగుడి కోసం వెంపర్లాడిన ప్రియాంక రెండో భర్త చేతిలో హత్యకు గురికావడం కలకలం రేపింది.

English summary
Illegal relationship: Husband killed wife near Tiruvallur due to family issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X