ఇంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారా..?

దాంపత్య జీవితం లో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు వున్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తుంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి.

పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. ఇంకా ఏయే కారణాలు ఉన్నాయో తెలుసుకుందాం.భారతదేశంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కారణాలను ఇక్కడ చర్చిద్దాం:

Illegal relationships on the rise in the country

ఆర్థిక సమస్యలు
ఆర్థిక సమస్యలు, ఖర్చులు పెరగడం వలన దాంపత్య జీవితం ఒత్తిడికి గురవుతుంది. ఆర్థిక భారంతో వ్యక్తులు మానసికంగా, శారీరకంగా దూరమవుతారు. ఆర్థికంగా ఆందోళనలతో ఉన్న వ్యక్తులు బయట ఆనందం కోసం వివాహేతర సంబంధాలను పెట్టుకోవడం ప్రారంభిస్తారు.

సోషల్ మీడియా
ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ విస్తరణ కారణంగా కొత్త పరిచయాలు సులభంగా ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా వ్యక్తులకు ప్రైవెసీ అవకాశాలను మరింత పెంచుతున్నాయ్. ఆన్‌లైన్ లో పరిచయాలు, చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా వ్యక్తులు సులభంగా సంబంధాలు ఏర్పరుచుకోవడం చేస్తున్నారు.

సంస్కృతి మారడం
ఆధునిక సమాజంలో సాంస్కృతిక మార్పులతో వ్యక్తుల ఆలోచన విధానాలు, అభిరుచులు మారుతున్నాయి. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం, సమాజంలో స్వేచ్ఛా భావం పెరగడం వలన వివాహేతర సంబంధాలను కొంతమంది సాధారణంగా తీసుకుంటున్నారు. సాంప్రదాయక ఆంక్షలు తగ్గి, వ్యక్తులు స్వేచ్ఛగా ఆలోచించే పరిస్థితి ఏర్పడ్డం వల్ల వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

శారీరక, మానసిక అవసరాలు
దాంపత్య జీవితంలో శారీరక, మానసిక అవసరాలు తీరకపోవడం కూడా వివాహేతర సంబంధాలకు కారణం అవుతుంది. ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం, శారీరక సంతృప్తి కోసం వ్యక్తులు వివాహేతర సంబంధాలను ఆశ్రయిస్తారు.ఇది కూడా వివాహేతర సంబంధానికి కరణమౌతుందని అంటున్నారు.

కొత్తదనం, సాహసవాంఛ
కొత్త వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకోవడం, ఒకే వ్యక్తితో సుదీర్ఘంగా ఉండటం వలన వచ్చే విసుగు, కొత్తదనం కోసం ఆరాటపడ్డం ద్వారా వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారు. దాంపత్యంలో ప్రేమ తగ్గి కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వివాహేతర సంబంధాలను పెరిగిపోతున్నాయ్.

భర్త, భార్యల మధ్య నమ్మకం లేకపోవడం
దాంపత్య జీవితంలో విశ్వాసం, స్నేహం లేకపోవడం వలన ఒకరి పై మరొకరు అనుమానం పెరగుతుంది. ఆ అనుమానాలు నిజమై వివాహేతర సంబంధాలకు దారితీస్తాయి. విశ్వాసం లోపించడం వ్యక్తులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అభిరుచులు, ఆసక్తులు విభిన్నంగా ఉండటం వలన విభేదాలు, దూరం పెరుగుతుంది. ఈ విభేదాలు ఇతర వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరగడానికి కారణం అవుతాయి.

సంబంధాలలో బద్ధకము
కొన్నిసార్లు దాంపత్య జీవితంలో వచ్చిన బద్ధకము కూడా వివాహేతర సంబంధాలకు కారణం అవుతుంది. ఒకే రకమైన దైనందిన జీవితంలో ఆసక్తి కోల్పోవడం, కొత్త అనుభవాలు కోసం ఇతర సంబంధాలను ఆశ్రయిస్తున్నారు. పాత సంబంధాలలో ప్రేమ, ఆకర్షణ తగ్గిపోవడం వలన, ఇతర సంబంధాలు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. మానసిక సంతృప్తి కోసం వ్యక్తులు వివాహేతర సంబంధాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది.

వివాహేతర సంబంధాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులు దీనికి ప్రధాన కారణాలు. ఈ కారణాలను అర్థం చేసుకోవడం, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+