బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

climax: అక్కతో అక్రమ సంబంధం, బావమరిదిని బావ ఏం చేశాడంటే ?,రాజీకి పిలిచి ?, క్లైమాక్స్ లో ట్విస్ట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మండ్య/చిక్కమగళూరు: ఓ యువతి, యువకుడి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో వివాహం జరిగిన తరువాత దంపతుల ఇంటికి ఇరువైపుల కుటుంబ సభ్యులు వచ్చివెలుతున్నారు. భార్యకు తమ్ముడు, భర్తకు అక్క ఉన్నారు. పండుగలు, శుభకార్యాలకు ఇరువైపుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అందరూ దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రగిలిపోయిన బావ అతని బావమరిదిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. బావ అతని బావమరిదిని హత్య చెయ్యడంతో రెండు కుటంబాలు షాక్ కు గురైనాయి.

mother: కన్న తల్లికి తుపాకితో కాల్చి చంపేసిన కొడుకు, కుర్చీలో కుర్చుని ఫోన్, తండ్రికి ముగ్గురు భార్యలు !mother: కన్న తల్లికి తుపాకితో కాల్చి చంపేసిన కొడుకు, కుర్చీలో కుర్చుని ఫోన్, తండ్రికి ముగ్గురు భార్యలు !

సంతోషంగా పెళ్లి చేశారు

సంతోషంగా పెళ్లి చేశారు

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో నివాసం ఉంటున్న వెంకటేష్ కు, చిక్కమంగళూరుకు చెందిన ఓ యువతికి పెళ్లి చెయ్యాలని పెద్లు నిశ్చయించారు. వెంకటేష్ తో పాటు అమ్మాయి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇద్దరూ పెళ్లికి అంగీకరించడంతో కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్, ఆ యువతి వివాహం జరిగింది.

బెంగళూరులో కాపురం

బెంగళూరులో కాపురం

వివాహం చేసుకున్న తరువాత వెంకటేష్ బెంగళూరు చేరుకుని కంగేరి సమీపంలోని చిక్కనహళ్లిలోని విశ్వేశ్వరయ్య లేఔట్ లో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ కూరగాయాల వ్యాపారం చేస్తున్నాడు. వెంకటేష్ భార్యకు సతీష్ అనే తమ్ముడు ఉన్నాడు. సతీష్ కూడా బెంగళూరు చేరుకుని వేరుగా నివాసం ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు.

దంపతుల ఇంటిలో శుభకార్యాలయాలు

దంపతుల ఇంటిలో శుభకార్యాలయాలు

వెంకటేష్ కు పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో వివాహం జరిగిన తరువాత వెంకటేష్ దంపతుల ఇంటికి ఇరువైపుల కుటుంబ సభ్యులు వచ్చివెలుతున్నారు. భార్యకు తమ్ముడు సతీష్, భర్త వెంకటేష్ కు రేఖా అనే అక్క ఉన్నారు. పండుగలు, శుభకార్యాలకు ఇరువైపుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అందరూ బెంగళూరులోని వెంకటేష్ దంపతుల ఇంటికి వచ్చి వెలుతున్నారు.

అక్కతో అక్రమ సంబంధం

అక్కతో అక్రమ సంబంధం

వెంకటేష్ అక్క రేఖా ఆమె తమ్ముడు ఇంటకి వచ్చి వెలుతున్నది. ఇదే సమయంలో వెంకటేష్ భార్య తమ్ముడు సతీష్ కూడా వారి ఇంటికి వచ్చి వెలుతున్నాడు. వెంకటేష్ అక్క రేఖాకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేష్ భార్య తమ్ముడు సతీష్ కు ఇంకా పెళ్లికాలేదు. బావ వెంకటేష్ అక్క రేఖాతో సతీష్ కు పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి బావ వెంకటేష్ అక్క రేఖాతో సతీష్ ఎక్కువ చనువు పెంచుకుని ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు.

భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్

భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్

సతీష్ బెంగళూరులోనే ఉద్యోగం చేస్తున్నాడు. సోదరుడి భార్య తమ్ముడు సతీష్ తో అక్రమ సంబంధం పెట్టకున్న రేఖా చివరికి అతని మోజులో పడిపోయి ఆమె బిడ్డతో విడిపోయి పిల్లలను కూడా వదిలేసి బెంగళూరు వచ్చి ప్రియుడు సతీష్‌తో కలిసి కెంగేరి సబ్‌ సిటీలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నది. భర్తను దిలేసిన రేఖా ఆమె ప్రియుడు సతీష్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. బావ అక్క రేఖాతో అక్రమ సంబంధం పెట్టుకున్న కుర్రాడు సతీష్ కూడా ఇంతకాలం ఎంజాయ్ చేశాడు.

మ్యాటర్ రివర్స్

మ్యాటర్ రివర్స్

ఇటీవల కాలంలో సతీష్, రేఖాల మధ్య మనస్పర్థలు పెరిగిపోయాయి. రేఖా మీద సతీష్ కు అనుమానం ఎక్కువ అయ్యింది. తరువాత రోజు రేఖా, సతీష్ గొడవపడటం ఎక్కువ అయ్యింది. భర్త, పిల్లను వదిలేసి తనతో పెళ్లికాకుండానే సహజీవనం చేస్తున్న రేఖా మీద సతీష్ కు అనుమానం ఎక్కువ అయ్యింది, రానురాను రేఖాతో గొడవ పెట్టుకుంటూ వచ్చిన సతీష్ చివరికి ఆమెను వదిలేసి దూరంగా ఉంటున్నాడు.

అక్క జీవితం నాశనం చేశాడని హత్య చేసిన బావ

అక్క జీవితం నాశనం చేశాడని హత్య చేసిన బావ

తన సోదరి రేఖాతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె జీవితాన్ని తన బావ మరిది సతీష్ నాశనం చేశాడని అతని బావ వెంకటేష్ ఆగ్రహంతో ఇంతకాలం రగిలిపోతూ ఉన్నాడు. ఇదే సమయంలో తన అక్క రేఖాను తన బావ మరిది సతీష్ వదిలేసి వేరుగా ఉంటున్నాడని తెలుసుకున్న వెంకటేష్ ఇంకా రగిలిపోయాడు. భార్య సొంత తమ్ముడు అయిన సతీష్ ను చంపేయాలని అతని బావ వెంకటేష్ డిసైడ్ అయ్యాడు.

రాజీకి పిలిపించి చంపేసిన బావ

రాజీకి పిలిపించి చంపేసిన బావ

సతీష్‌ కు ఫోన్ చేసిన వెంకటేష్ నీతో మాట్లాడాలని, ఇంటికి రావాలని చెప్పాడు. చర్చల కోసం సతీష్ ను చిక్కనహళ్లికి పిలిపించిన వెంకటేష్ తరువాత అతనితో గొడవపెట్టుకున్నాడు. తరువాత మాటామాట పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన వెంకటేష్ అతని అక్క రేఖాను మోసం చేసిన సతీష్ ను దారుణంగా పొడిచి చంపేశాడు. బావమరిది సతీష్ ను హత్య చేసిన తరువాత శ్రీరంగపట్నం వెళ్లిన వెంకటేష్ అక్కడ రక్తపు బట్టలు మార్చుకుని ఆ బట్టలు నదిలో విసిరేసి రాత్రంతా నది ఒడ్డున ఒంటరిగా కూర్చున్నాడు. చివరకు అరెస్టు భయంతో వెంకటేష్ బెంగళూరు చేరుకుని స్వయంగా కెంగేరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన అక్కతో అక్రమ సంబందం పెట్టుకున్న తన బావమరిది సతీష్ ను తానే హత్య చేశానని వెంకటేష్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Illicit relationship between brother-in-law and sister, enjoying in the same house without marriage, brother-in-law killed by sister's husband in climax in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X