romance: అక్రమ సంబంధం, ఒకే కంపెనీలో ? రాత్రి కారులోనే రొమాన్స్, లక్షలు స్వాహా, ట్విస్ట్ !
గురుగ్రామ్/ హర్యాన: వివాహిత మహిళతో ఓ వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. ఇద్దరు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే టైమ్ లేదో, లేక తట్టుకోలేకపోయారో తెలీదు కాని కారులోనే ఇద్దరు రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. కారు గ్లాస్ లో క్లోజ్ చేసి డోర్ లాక్ చేసి కారులోపల జంట మంచిరసపట్టులో ఉన్నారు. ఆ సందర్బంలో ఖాకీ దుస్తులు వేసుకున్న వ్యక్తి కారు దగ్గర ప్రత్యక్షం అయ్యాడు. కారులో రోమాన్స్ చేసిన పాపానికి అక్రమ సంబందం పెట్టుకున్న ఆ జంట అక్షరాల రూ. 1. 40 లక్షలు ఆ పోలీసుకు సమర్పించుకున్నారు. బహిరంగ ప్రదేశంలో శృంగారం చేసినందుకు కేసు నమోదు చేస్తానని బెదిరించి కారులో వెళ్తున్న జంట నుంచి ఆ పోలీసు అధికారి రూ.1.40 లక్షలు వసూలు చెయ్యడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

ఇద్దరికి వివాహం అయ్యింది
హర్యానాలోని గురుగ్రామ్ లో శుభం తనేజా అలియాస్ శుభం అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వివాహిత మహిళకు శుభం బాయ్ ఫ్రెండ్. మేడమ్ బాయ్ ఫ్రెండ్ శుభంకు మరో మహిళతో వివాహం అయ్యింది. భార్య ఉన్న శుభం, భర్తతో కాపురం చేస్తున్న ఆమహిళ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇద్దరూ అప్పుడుప్పుడు బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. హోటల్స్, రిసార్టులు ఇలా ఎక్కడికి పడితే అక్కడకు వెలుతున్న శుభం జంట రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే శుభం, ఆ మహిళ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు.

కారు పార్కింగ్ లో రాత్రి ?
బుధవారం రాత్రి 8 గంటలకు శుభం అతని గర్ల్ ఫ్రెండ్ తో తన మహిళా సహోద్యోగితో కలిసి కారులో ఓ గురుగ్రామ్ లోని ఓప్రాంతానికి వెళ్లాడు. కారులోనే శుభం, అతని ప్రియురాలు ఇద్దరూ రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టారు. కారు గ్లాస్ లో క్లోజ్ చేసిన శుభం డోర్ లాక్ చేసి కారులోపల మేడమ్ తో మంచిరసపట్టులో ఉన్నాడు. ఆ సందర్బంలో ఖాకీ దుస్తులు వేసుకున్న వ్యక్తి కారు దగ్గర ప్రత్యక్షం అయ్యాడు. కారు డోర్ తియ్యాలని ఆ పోలీసు శుభంకు చెప్పాడు. కారు అద్దాలు కిందకు దింపాలని శుభంకు సూచించాడు.

పబ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ చేస్తారా ? మీ ఐడీ కార్డులు ఇవ్వండి
కారులో శుభం ఒక మహిళతో ఉన్నాడని తెలుసుకున్న ఆ పోలీసు ఇద్దరి సెల్ ఫోన్లు, ఐడీ కార్డులు వారి దగ్గర నుంచి లాక్కొన్నాడు. కొంత సేపటి తరువాత శుభంతో పాటు ఆ మహిళను ఆ పోలీసు బెదిరించడం మొదలుపెట్టాడు. పబ్లిక్ ప్లేస్ లో సెక్స్ చేస్తారా, మీ ఇద్దరిపై కేసు పెడుతానని, బహిరంగ ప్రదేశంలో కారులో శృంగారం చేస్తే పోలీస్ స్టేషన్‌కు రావాలని, లేదంటే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని శుభంతో పాటు ఆమెను బెదిరించాడు. శుభంతో పాటు ఆ మహిళ ఎక్కడ మా విషయం ఇళ్లల్లో తెలిసిపోతుందని భయాందోళనకు గురైనారు.

వాడు నకిలీ పోలీసురా బాబు
చివరికి గురుగ్రామ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన శుభం జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు. తరువాత శుభం దగ్గర రూ. 1. 40 లక్షలు లూటీ చేసి నకిలి పోలీసు అని వెలుగు చూసింది. అనంతరం ఈ విషయమై బాధితుడుశుభం కేసు నమోదు పెట్టాడు. కారు పార్కింగ్ చేసిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నకిలీ పోలీసు కోసం గాలిస్తున్నారు. మొత్తం మీద కారులో రొమాన్స్ చేసిన పాపానికి శుభం జంట రూ. 1. 40 లక్షలు నకిలి పోలీసుకు సమర్పించుకోవడం గురుగ్రామ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications