Daughter: ప్రియురాలి కూతుర్ని చంపిన ప్రియుడు, బాయ్ ఫ్రెండ్ కు ఇంటి తాళం ఇచ్చింది !
చెన్నై/ తిరువళ్లూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు ఓ కూతురు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం భార్య తీరుతో విసిగిపోయిన భర్త ఆమెతో విడిపోయాడు. కూతురితో కలిసి భార్య వేరేగా కాపురం ఉంటున్నది. భర్తకు దూరం అయిన మహిళ ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. ఇంటికి ఉన్న రెండు తాళాలలో ఒకటి ప్రియుడికి ఇచ్చిన మహిళ ఇంకో తాళం ఆమె దగ్గర పెట్టుకుంది. మహిళ ఉదయం బయటకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వెళ్లిన మహిళ కూతురు శవమై కనిపించడంతో హడలిపోయింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చేశాయి.

భర్తతో సంతోషంగా ఉంది
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని పూతంమల్లి సమీపంలోని చెన్నీరు కుప్పం ప్రాంతంలో అసం వల్లి అలియాస్ వల్లి (36) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం వల్లి సెల్వరాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. సెల్వరాజ్ ను వివాహం చేసుకున్న వల్లి ఆమె భర్తతో కాపురం చేసింది.

భర్తతో విడిపోయి ప్రియుడితో రొమాన్స్
సెల్వరాజ్, వల్లి దంపతులకు సంగీత (16) అనే కూతురు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం భార్య వల్లి తీరుతో విసిగిపోయిన ఆమె భర్త ఆమెతో విడిపోయాడు. కూతురు సంగీతతో కలిసి వల్లి వేరేగా కాపురం ఉంటున్నది. భర్తకు దూరం అయిన వల్లి నాలుగు సంవత్సరాల క్రితం రాజు (38) అనే ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది.

ఇంట్లో కూతురు హత్య
ఇంటికి ఉన్న రెండు తాళాలలో ఒకటి ప్రియుడు రాజుకు ఇచ్చిన వల్లి ఇంకో తాళం ఆమె దగ్గర పెట్టుకుంది. వల్లి కూలి పని చేస్తోంది. ఎప్పటిలాగే వల్లి పనికి బయలుదేరింది. ఆ సందర్బంలో వల్లి కూతురు సంగీత ఇంట్లోనే ఉంది. వల్లి సాయంత్రం ఇంటికి వెళ్లి చూడగా ఆమె కూతురు సంగీత శవమై కనిపించడంతో హడలిపోయింది.

ప్రియుడికి పెళ్లి సెట్ అయ్యిందని ?
పోలీసుల విచారలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. వల్లి ప్రియుడు రాజుకు ఇటీవల పెళ్లి సెట్ అయ్యింది. రాజు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వల్లి అతనితో గొడవపడుతోంది. తన ప్రియురాలు వల్లికి బుద్ది చెప్పాలని అనుకున్న రాజు ఆమె కూతురు సంగీతను హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, కమ్మలు, కాలి గజ్జెలు లాక్కొని వెళ్లిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రియురాలు కూతురు సంగీతను హత్య చేసి పరారైన రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications