• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Boyfriend: భర్తకు విడాకులు, సిట్టింగ్ లవర్ తో కలిసి మాజీ బాయ్ ఫ్రెండ్ ను ?, లిక్కర్ పార్టీ ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తోంది. భార్య ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది. విషయం తెలుసుకున్న భర్త ఆమె జీవితంలో మారదని డిసైడ్ అయ్యి ఆమెకు దూరం అయ్యాడు. పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉంటున్న భార్య ఆమె కంటే వయసులో 10 ఏళ్ల చిన్నవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి ప్రత్యేకంగా మరో ఇంటిని అద్దెకు తీసుకుంది. కొంతకాలం ప్రియుడితో ఎంజాయ్ చేసిన కిలాడీ లేడి ఆమె బాయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పేసింది. ఇదే సమయంలో కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తున్న మరో వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. మాజీ ప్రియుడు అప్పుడప్పుడు ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. మాజీ ప్రియుడు ప్రాణంతో ఉంటే నేను సిట్టింగ్ ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడం కష్టం అని అనుకున్న కన్నింగ్ లేడీ అతన్ని చంపేయాలని స్కెచ్ వేసింది. సిట్టింగ్ ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని గొంతు కోసి చంపేసిన కిలాడీ లేడీ ఉద్యోగానికి వెళ్లి ఏమీ తెలీనట్లు నటించింది.

Actress: నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, సిరాజుద్దీన్ కు నోటీసులు, దీపా ఐఫోన్ లో ? !Actress: నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, సిరాజుద్దీన్ కు నోటీసులు, దీపా ఐఫోన్ లో ? !

 ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

చెన్నై కార్పోరేషన్ లో సౌందర్య (37) అనే మహిళ స్వీపర్ గా ఉద్యోగం చేస్తున్నది. 18 సంవత్సరాల క్రితం నాగరాజ్ అనే వ్యక్తితో సౌందర్య వివాహం జరిగింది. నాగరాజ్, సౌందర్య దంపతులకు 14 ఏళ్లు, 12 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. సౌందర్య ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

 భార్యకు విడాకులు

భార్యకు విడాకులు

సౌందర్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న నాగరాజ్ తన భార్య సౌందర్య ఇంతకు ముందే అనేక మందితో తిరిగిందని, ఆమె జీవితంలో మారదని డిసైడ్ అయ్యి రెండు సంవత్సరాల క్రితం ఆమెకు పూర్తిగా దూరం అయ్యి చెన్నైలోనే వేరుగా నివాసం ఉంటున్నాడు,. సౌందర్య విరుగంబాక్కంలో అద్దె ఇల్లు తీసుకుని ఆమె ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నది.

 10 ఏళ్ల చిన్నవాడితో అక్రమ సంబంధం

10 ఏళ్ల చిన్నవాడితో అక్రమ సంబంధం

భర్త నాగరాజ్ కు దూరం అయిన రెండు నెలలకే సౌందర్య ఆమెకంటే వయసులో 10 ఏళ్ల చిన్నవాడు అయిన విజయ్ కుమార్ అలియాస్ విజి (27) అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న సౌందర్య అతనితో ఎంజాయ్ చేసింది. ప్రియుడు విజయ్ కుమార్ తో ఎంజాయ్ చెయ్యడానికి సౌందర్య ప్రత్యేకంగా మరో ఇంటిని అద్దెకు తీసుకుంది.

 కొత్త ప్రియుడిని సెట్ చేసుకుని పాత ప్రియుడికి గుడ్ బై

కొత్త ప్రియుడిని సెట్ చేసుకుని పాత ప్రియుడికి గుడ్ బై

కార్పోరేషన్ లో స్వీపర్ గా ఉద్యోగం చేస్తున్న కోడంబాక్కంలోని కామరాజర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభు (40) అనే వ్యక్తితో సౌందర్య అక్రమ సంబంధం పెట్టుకుంది. కొత్త ప్రియుడు ప్రభు మోజులో పడిన సౌందర్య ఇంతకాలం ప్రియుడు విజయ్ కుమార్ ఎంజాయ్ చేసింది చాలు అంటూ ఆమె బాయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యింది.

 మాజీ ప్రియుడు వదలడని డౌట్ ?

మాజీ ప్రియుడు వదలడని డౌట్ ?

సౌందర్య, ప్రభుల అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న విజయ్ కుమార్ ఇద్దరితో గొడవపెట్టుకున్నారు. రానురాను సౌందర్య, ప్రభు, విజయ్ కుమార్ ల మద్య ఇదే విషయంలో గొడవలు జరిగాయి. రాజీ అవుదామని, నువ్వు రావాలని విజయ్ కుమార్ కు ఫోన్ చేసిన ప్రభు అతన్ని సౌందర్య ఇంటికి పిలిపించాడు.

 మాజీ ప్రియుడిని చంపేసి ఉద్యోగాలకు వెళ్లారు

మాజీ ప్రియుడిని చంపేసి ఉద్యోగాలకు వెళ్లారు

రాత్రి విజయ్ కుమార్, ప్రభు, సౌందర్య ముగ్గురు మద్యం సేవించారు. తరువాత కూరగాయలు కోసే కత్తి తీసుకున్న ప్రభు, సౌందర్య మద్యం మత్తులో ఉన్న విజయ్ కుమార్ గొంతు కోసి చంపేశారు. మరుసటి రోజు వేకువజామున 3 గంటల సమయంలో సౌందర్య, ప్రభు చెన్నైలో చెత్త శుభ్రం చెయ్యడానికి వెళ్లిపోయారు.

 సిట్టింగ్ ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడి హత్య

సిట్టింగ్ ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడి హత్య

రాత్రి ఇంటికి వెళ్లిన సౌందర్య తన ఇంటికి వెళ్లిన విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని డ్రామాలు ఆడింది. అయితే పోలీసులు సౌందర్యను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సిట్టింగ్ ప్రియుడు ప్రభుతో కలిసి మాజీ ప్రియుడు విజయ్ కుమార్ గొంతు కోసి చంపేశానని కిలాడీ లేడీ సౌందర్య అంగీకరించిందని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Illicit relationship: Married woman murdered ex boyfriend accompany with her present boyfriend in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X