ఇక్కడే ఐఎం టెక్కీ శిక్షణ: దిల్‌షుక్‌నగర్ పేలుళ్లకు డబ్బు
హైదరాబాద్: పోలీసులకు చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అజాజ్ షేక్ హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల ఓ సంస్థలో ఐటి పరికరాల వాడకంలో శిక్షణ పొందినట్లు వార్తలు వచ్చాయి. 2008లో జరిగిన లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నిందితుడు మన్సూర్ పీర్బాయ్ అరెస్టు తర్వాత అజాజ్ షేక్‌ను పట్టుకున్నారు. పీర్బాయ్ స్థానంలో షేక్ ఇండియన్ ముజాహిదీన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ విభాగం చీఫ్‌గా నియమితుడైనట్లు తెలుస్తోంది.
సాంకేతిక రంగంలో నిపుణులైన ఆ ఇద్దరు ఉగ్రవాదులు కూడా హైదరాబాదులోని వివిధ సంస్థల్లో శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం అజాజ్ బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో డిప్లమా చేసినట్లు, ఆ తర్వాత పూణే వెళ్లి అక్కడ బిపివోలో చేరినట్లు, వారిద్దరు కజిన్స్ అని, పూర్తిగా ఉగ్రవాద కార్యకలాపాల్లో మునిగిపోయారని తమకు తెలిసిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

ఆ పత్రిక వార్తాకథనం ప్రకారం - వెస్టర్న్ యూనియన్ ద్వారా లేదా హవాలా మార్గంలో అజాజ్‌కు దుబాయ్, కువైట్ల నుంచి డబ్బులు అందేవి. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద కార్యకలాపాలన్నింటికీ పూణే, ముంబైల నుంచి షేక్ డబ్బులు పంపిణీ చేసేవాడు. తన నుంచి డబ్బులు పొందేది ఎవరనే విషయం కూడా అతనికి తెలియదు.
దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లకు 6.8 లక్షల రూపాయలు అతను ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. ఆ డబ్బులను రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు తొలుత హవాలా మార్గంలో మంగళూర్‌లోని ఓ దుకాణం యజమానికి పంపించాడు. షాప్ కీపర్ ఆ డబ్బులను ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలు అసుదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, పాకిస్తానీ జాతీయుడు మోనుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.
తాను జమా మసీదు, వారణాసి, ఇతర ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడిన రియాజ్ భత్కల్, మోను, హడ్డీలకు డబ్బులు అందజేసినట్లు అజాజ్‌కు వారి అరెస్టు తర్వాత తెలిసింది. షాహరాన్‌పూర్‌లో అరెస్టయ్యే వరకు రియాజ్ భత్కల్‌తో అజాజ్ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చాడు. భారత్‌కు తిరిగి రావడానికి ముందు హడ్డీ, మోనులతో పాటు అజాజ్ నేపాల్‌లో ఆశ్రయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications