IMA సీరియస్ వార్నింగ్! విపరీతంగా పెరిగిన స్వైన్ ఫ్లూ కేసులు, సొంత వైద్యం అస్సలు వద్దు

వర్షాకాలంలో దేశంలో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) కేసులు వేగంగా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ప్రజలకు అత్యవసర ఆరోగ్య సూచనలను జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఇప్పటికే 1,770కి పైగా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ ఈ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. అయితే, ఇది సాధారణ సీజనల్ వైరస్ ప్రభావమేనని, వైరస్‌లో ఎలాంటి కొత్త మార్పులు లేవని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తత మాత్రం చాలా కీలకమని ఐఎంఏ తేల్చిచెప్పింది.

సొంతంగా మందులు వాడితే ప్రాణాలకే ప్రమాదం!

వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడినప్పుడు చాలామంది మెడికల్ షాపులకు వెళ్లి సొంతంగా యాంటీబయోటిక్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు. దీనిపై ఐఎంఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్1ఎన్1 అనేది వైరస్ వల్ల వచ్చే వ్యాధి అని, దానిపై యాంటీబయోటిక్స్ పనిచేయవని స్పష్టం చేసింది. అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్ వంటి యాంటీబయోటిక్స్ లేదా నోటికొచ్చిన యాంటీవైరల్ మందులు వాడితే శరీరంలోని మంచి బ్యాక్టీరియా నశించి 'యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్' అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది. డాక్టర్లు సిఫార్సు చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యం జోలికి వెళ్లవద్దని స్పష్టం చేసింది.

IMA Issues Advisory on H1N1 Swine Flu Surge Warns Public Against Dangerous Self-Medication Practices
H1N1: దేశంలో మళ్లీ స్వైన్ ఫ్లూ పంజా! జేపీ నడ్డా అత్యవసర సమీక్ష
H1N1: దేశంలో మళ్లీ స్వైన్ ఫ్లూ పంజా! జేపీ నడ్డా అత్యవసర సమీక్ష

వ్యాధి లక్షణాలు ఇవే.. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

స్వైన్ ఫ్లూ బారిన పడినవారిలో ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, వణుకు, పొడిదగ్గు, గొంతునొప్పి, విపరీతమైన కండరాల నొప్పులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో అయితే వాంతులు, విరేచనాలు కూడా కావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెల్లో నొప్పి, పెదవులు లేదా వేళ్లు నీలంగా మారడం, ఉమ్ముతో రక్తం పడటం, తీవ్రమైన మగత లేదా మూర్ఛ రావడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించాలని ఐఎంఏ సూచించింది.

H1N1: వణికిపోతున్న రాజధాని, కొత్త వేరియంట్ వచ్చిందా?
H1N1: వణికిపోతున్న రాజధాని, కొత్త వేరియంట్ వచ్చిందా?

ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష!

ఈ ఫ్లూ బారిన పడకుండా ఉండటానికి ప్రజలు కొన్ని నిబంధనలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం, గుంపుగా ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా మాస్క్ ధరించడం అలవాటు చేసుకోవాలి. జ్వరం తగ్గినా కనీసం 24 గంటల వరకు ఇళ్లలోనే విశ్రాంతి తీసుకోవాలని, పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లకూడదని తెలిపింది. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వైద్య సిబ్బంది ముందుజాగ్రత్తగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా సురక్షితమని ఐఎంఏ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+