బెంగళూరులో కేజీ బియ్యం ధర రూ 130, ఇక తిన్నట్లే, ఆ సమస్య వాళ్లకు చాలా ముఖ్యం, సన్న బియ్యం !
కర్ణాటకలో ఈ వర్షాకాలంలో వర్షాలు కురవకపోడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వరి పంట కొరత కారణంగా మార్కెట్‌కు బియ్యం సరఫరా కాకపోవడంతో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఊహించని రీతిలో బియ్యం ధరలు పెరిగాయి. రాజముడి బియ్యం కిలో రూ. 100 నుంచి రూ 130 పలకడం కర్ణాటక చరిత్రలో ఇదే తొలిసారి. కర్ణాటకలో రాజముడి బియ్యం ధరలు హద్దులు దాటింది.
వచ్చేనెలలో రాజముడి బియ్యం ధర మరింత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రాజముడి మాత్రమే కాదు, సోనా ముస్సోరీ బియ్యం ధరలు కూడా 25% పెరిగింది. రాజముడి బియ్యం అరుదుగా పండిస్తుంటారు. పోషక విలువలు కలిగిన బియ్యంలో రెడ్ రైస్‌లో ఒకటి. కర్ణాటకలోని మైసూరు, హాసన్‌లలో పండే ఈ రాజముడి బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది.

కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా రాజముడి వరి పంటకు కొరత ఏర్పడింది. దీంతో బెంగళూరు నగరంలో కేజీ రాజముడి బియ్యం ధర రూ.100 నుంచి రూ.130కి పెరిగింది. గత నెలలో రాజముడి బియ్యం కేజీ రూ. 52 నుండి రూ. 60 వరకు ఉండేది. అయితే రాజముడి బియ్యం ధర ఒక్కసారిగా పెరిగింది. సేంద్రియ పద్ధతిలో పండించిన రాజముడి బియ్యం కిలో ధర రూ. 130 వరకు పలుకుతోంది.
గతేడాది రాజముడి వరి క్వింటాల్‌కు రూ.2,500 పలికింది. ఈసారి అదే బియ్యం క్వింటాల్ రూ. 4 వేలకు పెరిగింది. 2022 డిసెంబర్ నెలలో సేకరించిన రాజముడి బియ్యం ఇప్పుడు అమ్మకానికి ఉంది. మైసూరు జిల్లాలోని పిరియాపట్నం, హోలేనరసీపుర, చెన్నరాయపట్నం, అరకలగూడు తాలూకాలు, కొడగు జిల్లాలోని కుశాలనగర్‌లో ఈసారి నైరుతి రుతుపవనాల కారణంగా వరి నాట్లు చాలా వరకు తగ్గాయి.

హేమావతి డ్యామ్ నీటిని వినియోగించుకుని వరిసాగు చేసిన రైతులు ఈసారి కాలువలకు నీరు సక్రమంగా రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. తక్కువ నీటితో వరిసాగుకు దూరంగా ఉన్న రైతులు చెరకు సాగు చేశారు. వరి నాట్లు వేయకపోవడంతో పంటల కొరత ఏర్పడింది. ది హిందూ పత్రికతో మాట్లాడిన రాజముడి వరి పండించే రైతు సంఘం నాయకుడు హోయ్సల ఎస్. అప్పాజీ రాజముడి వరి 1 నుంచి 1. 25 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది.
కానీ ఈసారి 30 నుంచి 40 శాతం తగ్గిందని, తక్కువ వరిసాగు చేసిన రైతులు వాటిని విక్రయించకుండా సొంత అవసరాలకు ఉంచుకుంటున్నారని, అందుకే రాజముడి బియ్యం ధరలు పెరిగిపోయాయని వివరించారు. షుగర్ పేషంట్లు ఎక్కువగా తినే రాజముడి బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో బెంగళూరులో ఆ బియ్యం వ్యాపారులు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications