స్కూటర్ 50 వేలు: ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 8 లక్షలు ఖర్చు..!
చంఢీగడ్: ఫ్యాన్సీ నెంబర్లంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. కానీ యాభై వేలు ఖరీదు చేసే యాక్టివా స్కూటరుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం చంఢీగడ్‌లో ఓ వ్యాపారి లక్షలు ఖర్చు పెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. హర్యానాలోని చంఢీగడ్‌కు చెందిన వ్యాపారవేత్త కన్వల్జిత్ వాలియా రూ. 8.1 లక్షలు చెల్లించి వీఐపీ ప్యాన్సీ నెంబర్ సీహెచ్ 01 బీసీ 0001ను కొనుగోలు చేశారు.ఈ వేలం పాటను చంఢీగడ్ లైసెన్సింగ్ అధారిటీ శనివారం నిర్వహించింది.
దీంతో పాటు వాలియా తన కుమారుడి కొనిచ్చిన కొత్త బైకుకు సీహెచ్ 01 బీసీ 0011 అనే నెంబర్ కోసం రూ. 2.6 లక్షలు వెచ్చించి వేలంపాటలో కోనుగోలు చేశారు. అంతే కాదు వాలియా ఇంట్లో ఉన్న అన్ని వాహనాలకు కూడా ప్యాన్సీ నెంబర్లు ఉండటం విశేషం.
అంతక ముందు వేలంపాటలో తన ఎస్‌యూవీ కోసం సీహెచ్ 01 బీసీ 0026 అనే నెంబర్‌ను కోనుగోలు చేశాడు. ఇలా మొత్తం ఫ్యాన్సీ నెంబర్ల కోసం గాను వాలియా చెల్లించిన మొత్తం అక్షరాలా రూ. 8 లక్షలు. ఈ సందర్భంగా వాలియా మాట్లాడుతూ మా తండ్రి వద్ద రెండు ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయని తెలిపారు.

చంఢీగడ్ ట్యాక్సీ యూనియన్‌కు తన తండ్రి మొట్టమొదటి ప్రెసిడెంట్ అని పేర్కొన్నాడు. ప్రజల్లో ఈ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజీని దృష్టిలో పెట్టుకుని శనివారం చంఢీగడ్ లైసెన్సింగ్ అధారిటీ నిర్వహించిన వేలం పాటలో రూ. 77.77 లక్షలు ఆర్జించింది.
'0001' ఈ నెంబర్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి నెంబర్స్ కోసం చాలా మంది సుమారు రూ. 70,00 నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. 2010లో జరిగిన వేలంపాటలో షేర్‌గిల్ అనే ఓ రియల్టర్ అత్యధిక ధరను చెల్లించి '0001'ను కైవసం చేసుకున్నాడు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications