Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుక్క మొరిగిందని ఆ కుక్క యజమాని మీద యాసిడ్ దాడి, మిస్టర్ జేమ్స్ ఏమిటిది?, వాడు ఏం చెప్పాడంటే!

కుక్క అరుపుల కారణంగా ఆ కుక్క యజమానిపై యాసిడ్ దాడి చేసిన ఘటనలో కర్ణాటకలోని చిక్కమగళూరులోని ఎన్. ఆర్. పురంలో జరిగింది. కుక్క యజమాని ఎడమ కంటికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని కన్ను దెబ్బ తినే అవకాశం ఉందని, ఇప్పటికే ఆపరేషన్ చేశామని, అతని ఆరోగ్యం గురించి పూర్తి సమాచారం తరువాత చెబుతామని వైద్యులు అంటున్నారు.

కుక్క మొరిగిందన్న కారణంతో యాసిడ్ దాడికి పాల్పడిన అమానవీయ ఘటన చిక్కమగళూరు జిల్లాలో కలకలం రేపింది. ఎన్. ఆర్ పురం తాలూకాలోని కురగుంద గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కుక్క యజమాని సుందర్ రాజ్‌పై యాసిడ్ దాడి చేశారు. సుందర్ రాజ్ అతని ఇంటిలో రెండు కుక్కలు పెంచుకుంటున్నారు. ప్రతిరోజు సుందర్ రాజ్ కుటుంబ సభ్యులు ఆ కుక్కలను చాలా బాగా చూసుకుంటున్నారు.

In Chikkamagalur, the dogs owner was attacked with acid because the dog was barking too much

సుందర్ రాజ్ ఇంటిలోని కుక్కలు అప్పుడప్పుడు ఎక్కువగా మొరగుతున్నాయని తెలిసింది. ఎప్పటిలాగే సుందర్ రాజ్ ఇంటిలోని కుక్క గట్టిగా మొరిగింది. సుందర్ రాజ్ పక్కింటిలో జేమ్స్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా సుందర్ రాజ్ కుటుంబ సభ్యులకు, జేమ్స్ కుటుంబ సభ్యులకు చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

సుందరాజ్ ఇంటిలోని కుక్క గట్గిగా మొరగడంతో పక్కింటి జేమ్స్ ఆ కుక్కను తిట్టాడు. దీంతో యజమాని సుందర్ రాజ్ కూడా అతని ఇంటిలోని కుక్కను తిట్టడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో తననే సుందర్ రాజ్ తిడుతున్నాడని జేమ్స్ రగిలిపోయాడు. తనను సుందర్ రాజ్ తిడుతున్నాడని తెలిసి రగిలిపోయిన జేమ్స్ ఇంటిలోకి వెళ్లి యాసిడ్ తీసుకు వచ్చి కుక్క యజమాని సుందర్ రాజ్ ముఖంపై పోశాడు. యాసిడ్ దాడి కారణంగా సుందర్ రాజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

అనంతరం ప్రాథమిక చికిత్స అందించి శివమొగ్గలోని మెగా ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి కారణంగా, సుందర్ రాజ్ ఎడమ కంటికి తీవ్ర గాయాలయ్యాయి మరియు కంటి పొరను మార్చమని డాక్టర్లు తెలిపారు. సుందర్ రాజ్ తనను తిట్టాడని తెలిసి కోపంతో అతనిపై దాడి చేసినట్లు జేమ్స్ అంగీకరించాడని, జేమ్స్ ఎన్ఆర్. పురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+