బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో సినిమా స్టైల్లో మహిళ మీద రివాల్వర్ తో కాల్పులు, వ్యానిటీ బ్యాగ్, హత్యకు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో సినిమా స్టైల్ లో మహిళను హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే మహిళ చాకచక్యంగా దుండగులను ఎదిరించి తప్పించుకుని ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

విద్యారణ్యపుర

విద్యారణ్యపుర

బెంగళూరు నగరంలోని విద్యారణ్యపురలోని రామచంద్రాపురం సమీపంలోని హనుమాన్ లేఔట్ మొదటి క్రాస్ లో సింధు అనే మహిళ నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సమీపంలోని అక్క ఇంటిలో ఉన్న కుమార్తె ను పిలుచుకురావడానికి సింధు ఇంటి నుంచి బయటకు వచ్చారు.

స్కూటర్ తీసిన సింధు

స్కూటర్ తీసిన సింధు

ఇంటి నుంచి బయటకు వచ్చిన సింధు స్కూటర్ లో అక్క ఇంటికి బయలుదేరడానికి సిద్దం అయ్యారు. అదే సమయంలో స్ల్పెండర్ బైక్ లో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. స్కూటర్ బయటకు తీస్తున్న సింధు చేతిలో ఉన్న వ్యానిటీ బ్యాగ్ లాక్కోవడానికి నిందితులు ప్రయత్నించారు.

రివాల్వర్ తో కాల్పులు

రివాల్వర్ తో కాల్పులు

దుండగుల చేతికి వ్యానిటీ బ్యాగ్ చిక్కకుండా సింధు ప్రయత్నించారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన బైక్‌పై వెనుక కూర్చున్న నిందితుడు జోబులో నుంచి రివాల్వర్ బయటకు తీసి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.

దూసుకుపోయిన బుల్లెట్

దూసుకుపోయిన బుల్లెట్

రెండు రౌండ్లు బుల్లెట్లు పేలకుండానే రోడ్డు మీద పడ్డాయి. సింధు పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో ఓ బుల్లెట్ ఆమె వెన్నులోకి దూసుకుపోయింది. సింధు గట్టిగా కేకలు వెయ్యడం, బుట్లెట్ శభ్దాలు రావడంతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు.

పక్కా ప్లాన్

పక్కా ప్లాన్

బుల్లెట్ గాయాలైన సింధును ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. శాస్త్ర చికిత్స చేసి సింధు వెన్నులో ఉన్న బుల్లెట్ ను బయటకు తీశారు. సింధు వ్యానిటీ బ్యాగ్ లాక్కోవడం కోసమే రివాల్వర్ తో కాల్పులు జరిపారా, లేక ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించారా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
In a cinematic style two miscreants have fired with gun on a women, identified as Sindhu while she was going on a scooter at Hanuman layout in Vidyaranyapura. Miscreants were tried to snatch her vanity bag and she was opposed an cried. Later they fired on her, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X