విలీనం: ఏప్రిల్ 1 నుంచి విజయాబ్యాంకు దేనా బ్యాంకులు కనిపించవు
దేశంలో ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుబంధ బ్యాంకులు విలీనం అయిన సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు విలీనం అయ్యాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేనా బ్యాంకు, విజయాబ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీసీఐ బ్యాంకుల తర్వాత దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా బ్యాంక్ ఆఫ్ బరోడా గుర్తింపు పొందింది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయా బ్యాంకు విలీనం ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుంది. ఇలా మూడు వేర్వేరు బ్యాంకులు కలిసి ఒకే బ్యాంకుగా రూపాంతరం చెందడం భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఇదే తొలిసారి.

ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు విజయా బ్యాంకు విలీనంకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మీడియాతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. ఇకనుంచి దేనా బ్యాంకు, విజయా బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులను బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలకు బదిలీ చేస్తామని వెల్లడించారు. విలీనం అయిన సందర్భంగా ఉద్యోగుల తగ్గింపు ఉండదని ఎంతమంది ఉద్యోగులైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో అందరినీ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలకు బదిలీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications