కడుపునొప్పి పేషెంట్‌ని చితక్కొట్టిన డాక్టర్ (వీడియో)

జైపూర్ : వేళకు తినకపోవడం, నిద్రలేమితో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. అలానే ఓ యువకుడికి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దీంతో కడుపునొప్పి భరించలేక .. డాక్టర్లపై దుర్భాషలాడాడు. అక్కడే ఉన్న వైద్యుడు తట్టుకోలేకపోయాడు. రోగి అని కూడా చూడకుండా దాడికి తెగబడ్డాడు.

నొప్పి భరించలేక .. నోటి దూల ...
జైపూర్‌కి చెందిన ఒకతను కడపునొప్పి భరించలేకపోయాడు. సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చేరాడు. నొప్పి తట్టుకోలేకపోయాడు. ఎంతకీ తనవద్దకు వైద్యులు రాకపోవడంతో .. వైద్యులపై నోటిదురుసు ప్రదర్శించాడు. డాక్టర్లను అసభ్యపదజాలంతో దూషించాడు. రోగికి వైద్యం అందించలేదు కదా .. నొప్పి ఉంది కదా అని కూడా చూడలేదు అక్కడున్న వైద్యుడు. రోగిని తిట్టొద్దని చెప్పినా ఊరుకోకపోవడంతో .. రంగంలోకి దిగాడు.

in hospital doctor attack by patient

పిడిగుద్దులు ..
బెడ్ మీద పడుకున్న రోగిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు ముబ్రిక్ అనే వైద్యుడు. కింద నుంచి కాకుండా .. బెడ్ మీద ఎక్కి మరీ దాడిచేశాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన మరో వైద్యుడు కలుగజేసుకున్నాడు. ముబ్రిక్‌కు సర్దిచెప్పి పక్కకు పంపించడంతో గొడవ సద్దుమణిగింది. తర్వాత రోగి సమస్య తెలుసుకుని చికిత్స అందించారు. అతను గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించి మందులిచ్చి పంపించారు. అయితే ఈ వ్యవహారం అంతా వీడియో తీశారు ఓ నెటిజన్. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరలైంది. ఈ ఘటనపై రాజస్థాన్ ఆరోగ్యశాఖ స్పందించింది. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి రఘుశర్మ ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+