ఏటా లక్ష రోడ్డు ప్రమాదాలు .. ఐదేళ్లలో ఎంతమంది చనిపోయారో తెలుసా ..?
న్యూఢిల్లీ : దేశంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ సంస్థ చేసిన సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదికి కనీసం లక్షమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని వివరించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. మోటారు వాహనల చట్టం 1988కి సవర్ణపై మంగళవారం పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ప్రసంగించారు గడ్కరీ.
దేశంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అంగీకరించారు నితిన్ గడ్కరీ. ప్రపంచవ్యాప్తంగా చేస్తే ఇండియా రోడ్డు ప్రమాదాల్లో నెంబర్ వన్ అని పేర్కొన్నారు. మిగతా విషయాల్లో భారత్ నెంబర్ వన్ ఉండాలి గానీ .. రోడ్డు ప్రమాదాల్లో ఉండటం బాధ కలిగించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంస్థ చేసిన సర్వే వివరాలను లోక్‌సభకు తెలిపారు. 2017 నాటికి దేశంలో 4.7 లక్షల ప్రమాదాలు జరిగాయని వివరించారు. ఐదేళ్ల లెక్కిస్తే 5 లక్షల ప్రమాదాలు జరిగి ఉంటాయని తెలిపారు. ఏడాదికి లక్ష రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు 2013లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1.37 లక్షలు కాగా .. అది 2017 నాటికి 1.48 లక్షలకు పెరిగిందని వివరించారు.

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం మరింత కఠిన నిబంధనలు, నియమాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications