ఇస్రోతో జీశాట్-6ఏ ఉపగ్రహనికి తెగిన లింక్, ఏమైందంటే?
శ్రీహరికోట: జీశాట్-6ఏ ఉపగ్రహం ఇస్రోతో సంబంధాలను తెగిపోయాయి. ఈ ఏడాది మార్చి 29న జీశాట్-6ఏ ఉపగ్రహన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని ఆ రోజే ఇస్రో ప్రకటించింది.కానీ, ఈ ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో ఆదివారం నాడు ప్రకటించింది. ఉపగ్రహంతో సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించింది ఇస్రో.
సుమారు రూ.270 కోట్లతో ఈ ఉపగ్రహన్ని పంపింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఈ ఉపగ్రహం ద్వారా మంచి ప్రయోజనాలు దక్కుతాయని ఇస్రో ప్రకటించింది. ఈ ఉపగ్రహం రెండో దశవరకు శుక్రవారం రాత్రి 10 గంటల వరకు అంతా సవ్యంగానే సాగిందని ఇస్రో చెబుతోంది.

లిక్విడ్ అపొగీ మోటార్ ప్రణాళిక ప్రకారంగానే ఫైర్ అయింది. అయితే కొన్ని క్షణాల్లోనే కమ్యూనికేషన్‌లో అవరోధాలు ఏర్పడ్డాయని సమాచారం. ఈ ఉపగ్రహం మొదటి దశ గురించి శుక్రవారం నాడు ప్రకటనను ఇస్రో విడుదల చేసింది. కానీ, ఆ తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థర్డ్ ఆర్బిట్ రైజింగ్ ఎక్సర్‌సైజ్ గురించి కూడ ఎటువంటి ప్రకటన రాలేదు.
ఇస్రోతో జీశాట్-6ఏ ఉపగ్రహం సంబంధాలను తెగిపోయిందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఉపగ్రహం ప్రయోగించిన 48 గంటల్లోనే ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి.
అయితే జీశాట్- 6ఏ ఉపగ్రహం సంబంధాలను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 1న మూడో, చివరి ఫైరింగ్ జరగవలసి ఉందని, అయితే ఉపగ్రహం నుంచి సమాచారం రావడం లేదని ఇస్రో ఆదివారం ప్రకటించింది. ఈ ఉపగ్రహంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications