వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో కుదుపు: పార్టీ వీడిన మాజీ సీఎం, 11 మంది ఎమ్మెల్యేలు కూడా..

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదుపు.. ఓ మాజీ సీఎం, 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇప్పటికే ఆ పార్టీకి దేశంలో క్రేజ్ తగ్గుతుంది. ఇంతలో ఉన్న నేతలు ఒక్కొక్కరు వదిలి వెళుతున్నారు. మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా సహా 11 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి తమ డిమాండ్లను సంగ్మా ఇదివరకే తెలియజేశారు. అయినా నెరవేర్చకపోవడంతో.. పార్టీని వీడారు.

 In massive jolt to Congress, former CM Mukul Sangma, 11 other MLAs join TMC

నెలక్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సంగ్మా భేటీ అయ్యారు. సమావేశంలో పార్టీ అధినేత విన్సెంట్ హెచ్ పాలా కూడా పాల్గొన్నారు. పాలాకు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంగ్మాకు పొసగడం లేదు. పాలాను నియమించే సమయంలో తనను సంప్రదించలేదని సంగ్మా అంటున్నారు. దీంతో అతను పార్టీ మారాలని అనుకున్నాడు. వారిద్దరు కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. శనివారం కూడా ట్రై చేసింది. కానీ ఫలితం లేకపోయింది.

ఈ క్రమంలో అక్టోబర్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సంగ్మా భేటీ అయ్యారు. కానీ అప్పుడు పార్టీ మార్పు గురించి తెలియజేయలేదు. మరోవైపు గోవా మాజీ సీఎం ఫెలెరియో కూడా టీఎంసీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది.

English summary
former Meghalaya Chief Minister Mukul Sangma and 11 others join Trinamool Congress in Meghalaya. With this move, 12 out of 17 Congress MLAs joined Trinamool.కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదుపు.. ఓ మాజీ సీఎం, 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇప్పటికే ఆ పార్టీకి దేశంలో క్రేజ్ తగ్గుతుంది. ఇంతలో ఉన్న నేతలు ఒక్కొక్కరు వదిలి వెళుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X