ప్రియుడితో భార్య: వీడియో పెట్టి భర్త సూసైడ్

ముంబై ప్రతిక్షానగర్‌లోని సియాన్స్ అపార్ట్‌మెంట్‌లోని తన 4వ ఫ్లోర్‌లో జయేష్ రావత్(29) నవంబర్ 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించుకున్నాడు. 44 నిమిషాలపాటు ఉన్న ఆ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. తన భార్య తృప్తి(23), ఆమె ప్రియుడు రాజేష్ వర్మ(38)తో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ వీడియోలో బాధితుడు పేర్కొన్నాడు.
తన భార్య సంతోషం ఎన్ని చేసినా ఆమె తన ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని తెంచుకోకపోవడంతో తాను చాలా ఆవేదనకు గురైనట్లు జయేష్ తన సూసైడ్ వీడియోలో పేర్కొన్నాడు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వీడియోను తన భార్య తృప్తికి మెసేజ్ చేశాడు జయేష్. ఆత్మహత్య తర్వాత తన మృతదేహాన్ని సియాన్ ఆస్పత్రిలో చూడవచ్చని ఆమెతో చెప్పాడు.
జయేష్ రావత్ ఆత్మహత్యకు సంబంధించిన వీడియోను అతని తమ్ముడు చూడడంతో విషయం బయటికి వచ్చింది. ఆ వీడియోను జయేష్ తమ్ముడు పోలీసులకు అందించడంతో నవంబర్ 23న నిందితులు తృప్తి, రాజేష్ వర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు బుధవారం వరకు పోలీస్ కస్టడీ విధించారు.












Click it and Unblock the Notifications