విద్యార్థినితో ట్యూషన్ టీచర్ : తన క్యాబిన్‌లో.. పాడుపని...!!! అరెస్ట్
ముంబై : గురువులు దారితప్పుతున్నారు. విద్యార్థులను తమ బిడ్డల్లా చూసుకోవాల్సిన కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆ వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. విద్యార్థుల పట్ల మిస్ బిహెవ్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఘటన కూడా ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ విద్యార్థినితో ట్యూషన్ టీచర్ అసభ్యకంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది.
ముంబైలోని పోవై పోలీసు స్టేషన్ పరిధిలో ఓ 42 ఏళ్ల వ్యక్తి ట్యూషన్ చెప్తున్నాడు. తన వద్దకు చాలా మంది విద్యార్థులు వస్తున్నారు. అలాగే ఓ 13 ఏళ్ల విద్యార్థిని కూడా వస్తున్నారు. అయితే ఈ నెల 11న అమ్మాయిని తనతో క్యాబిన్‌కు పిలిచాడు. తనతో అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఎంతవరకు దిగజరాడంటే .. తనతో సెక్స్ చేయాలని ఉంది అని అన్నాడు. దీంతో ఆ విద్యార్థిని ఖంగుతింది. ఏం చేయాలో తెలియలేదు. వెంటనే క్యాబిన్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇంటికెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విద్యార్థిని ఆమె తల్లి పోవై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ట్యూషన్‌కొచ్చే మిగతా విద్యార్థులను కూడా విచారిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ అలా చెప్పలేదని .. ఒకవేళ చెబితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications