భర్తపై భార్య పోటీ!: 'బిజెపి హీరో స్ప్లెండర్, కాంగ్రెస్ చేతక్'

In Muzaffarnagar, incumbent MP will run against his wife
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో భార్యాభర్తలే ఒకరిపై మరొకరు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, దగ్గరి బంధువులు ప్రత్యర్థులుగా తలపడిన ఘటనలు ఉన్నాయి. కానీభార్యా భర్తలు ప్రత్యర్థులుగా తలపడడం అరుదు.

ఉత్తరప్రదేశ్‌లోని అల్లర్ల కేంద్రం ముజఫర్‌నగర్‌లో భార్యాభర్తల మధ్య పోటీ నెలకొంది. బీఎస్పీకి చెందిన సిట్టింగ్ పార్లమెంటు సబ్యుడు కదిర్ రాణాపై అయన సతీమణి షాహిదా బేగమ్ పోటీకి దిగనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కదిర్ రాణా బిఎస్పీ అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ముజఫర్‌నగర్ అల్లర్లకు సంబంధించి సిట్ ఛార్జిషీటులో పేర్కొన్న 10 మందిలో రాణా ఒకరు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినందుకు ఆయనపై దర్యాప్తు జరుగుతోంది. ముజఫర్‌నగర్ లోకసభ స్థానానికి ఏప్రిల్ 10న పోలింగ్ జరుగనుంది.

చేతక్, హీరో స్ప్లెండర్‌లతో కాంగ్రెస్, బిజెపిలకు పోలిక

బజాజ్ ఆటో మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ బజాజ్ దేశ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్, బిజెపిలను ద్విచక్ర వాహనాలతో పోల్చారు. కాంగ్రెస్ చేతక్ లాంటిదని, బిజెపి హీరో స్ప్లెండర్ లాంటిదన్నారు. చేతక్ ఒకప్పుడు గొప్పగా వెలిగినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, స్ప్లెండర్ లానే బిజెపి కూడా మెరుగ్గా కనిపిస్తోందన్నారు.

అయితే, రెండు పార్టీలు కూడా ఆ తానులో గుడ్డేనని సూత్రీకరించారు. పాలనా పటిమపరంగా రెండూరెండేనని రాజీవ్ బజాజ్ అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని పల్సర్‌తో పోల్చారు. ఆ పార్టీ స్పష్టమైన విధానంతో తనకంటూ ఓ స్థానం సృష్టించుకుందని చెప్పారు. ఆమ్ ఆద్మీని ఇష్టపడొచ్చు లేక ద్వేషించవచ్చు కానీ, విస్మరించలేమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+