బార్డర్‌లో స్వీట్స్, ముస్లిం చిన్నారుల దీపావళి (పిక్చర్స్)

న్యూఢిల్లీ: దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుండే దేవాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తిరుమలకు భక్తులు పోటెత్తారు. టపాసులు కాల్చుతూ ఆనందం పంచుకుంటున్నారు. అయితే టపాసుల ధరలు భయపెడుతున్నాయి. దీంతో టపాసుల సందడి క్రితం ఏడాది కంటే కొద్దిగా తగ్గింది. కొనుగోళ్లు తగ్గాయి.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడు పైన మంచి గెలుపే దీపావళి. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో గడిపేందుకు బెంగళూరుకు రెండు రోజుల క్రితమే వెళ్లారు.

లోకసభ స్పీకర్ మీరా కుమార్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, మరియు ఇతర రాష్ట్ర పార్టీ నాయకులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఒడిస్సా

ఒడిస్సా

గురువు సుజాతా మోపత్రాతో కలిసి ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌లో దీపావళి సంబరాలు జరుపుకుంటున్న విదేశీ ఒడిస్సా డ్యాన్సర్స్ దృశ్యం.

రాజస్థాన్

రాజస్థాన్

రాజస్థాన్‌లోని పుష్కర్ ప్రాంతంలో ఒంటెలను పోషించే వారు ఒక్కచోటకు చేరి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. వారు కాకరపుల్లలు కాలుస్తున్న దృశ్యం.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాదులో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. 200 టెస్టుతో రిటైర్ కానున్న సచిన్ టెండుల్కర్‌కు పేరును దీపాలతో ఉంచారు.

పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో

పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సైనికులు పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పండుగను జరుపుకున్నారు. దినాజ్‌పూర్ జిల్లా దక్షిణలోని బలుర్గాట్ సమీపంలోని హిలి ప్రాంతంలో సైనికులు దీపావళిని జరుపుకున్నారు.

త్రిపుర

త్రిపుర

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సైనికులు త్రిపురలోని అగర్తాలా సమీపంలోని లంకామురా వద్ద భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొవ్వొత్తులు వెలిగిస్తున్న దృశ్యం.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్

దీపావళి పర్వదినం సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర వారణాశి(కాశీ క్షేత్రం)లోని ఓ మైదానంలో లక్షలాది దీపాలను వెలిగించారు.

గుజరాత్

గుజరాత్

గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాదులో ఓ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో దీపాలను అలంకరిస్తున్న దృశ్యం. దీపావళి పర్వదినం సందర్భంగా వారు ఇంటిని దీపాలతో నింపారు.

జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్

దీపావళి పర్వదినం సందర్భంగ జమ్మూ కాశ్మీర్‌లోని ఓ ప్రాంతంలో హ్యాపీ దివాళీ అని ఉన్న ప్రత్యేకమైన విద్యుత్ లాంతర్లను విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన దృశ్యం.

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్

దీపావళి పర్వదినం సందర్భంగా కోల్‌కతా దక్షిణ ప్రాంతంలో గల కాళీ మాతను దర్శించుకునేందుకు భారీగా బారులు తీరిన భక్తుల దృశ్యం.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ ప్రాంతంలో దీపావళి పండుగ సందర్భంగా కాకరవత్తులు కాల్చుతున్న ముస్లిం చిన్నారుల దృశ్యం.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్

దీపావళి సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని గంటాఘర్‌లో అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన చిన్న చిన్న ప్రమిదలను కొంటున్న దృశ్యం.

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ దినాజ్‌పూర్ జిల్లా దక్షిణలోని బలుర్గాట్ సమీపంలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సైనికులు బార్డర్ గార్డ్ ఆఫ్ బంగ్లాదేశ్(బిజిబి) సైనికులకు మిఠాయిలు ఇస్తున్న దృశ్యం.

ప్రణబ్

ప్రణబ్

దీపావళి పండుగ సంబరాలు న్యుఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆశీస్సులను తీసుకుంటున్న ఓ వ్యక్తి.

ప్రణబ్ ముఖర్జీ

ప్రణబ్ ముఖర్జీ

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ చిన్నారి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దీపావళి శుభాకాంక్షలు చెబుతున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+