Cyber Crime: రేటింగ్ ఇవ్వాలని చెప్పి రూ.13 లక్షలు కాజేశారు..
దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలకు చదువుకున్న వారు కూడా బలైపోతున్నారు. తాజాగా ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.13 లక్షలకు పైగా నష్టపోయంది. చివరికి మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఆమె అదనపు ఆదాయం కోసం నెట్ లో పార్ట్ టైమ్ జాబ్ గురించి సెర్చ్ చేసింది.
ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్ల ఆమెకు ఫోన్ చేశారు. తమది ఓ కంపెనీ అని.. మీరు ఆన్ లైన్ లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. రేటింగ్ ఇచ్చిన ప్రతిసారి రూ.150 చెల్లిస్తామని వివరించారు. దీంతో ఆమె రేటింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ చేసిన పనికి అవతలి వారు ఆమెకు డబ్బులు చెల్లించారు.

ఇలా కొద్ది రోజులు చేసిన తర్వాత తమ వద్ద పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అవుతాయని చెప్పారు. దీంతో ఆమె అక్టోబర్ 13 వరకుడబ్బులు వారికి పంపుతూ వెళ్లింది. ఆ తర్వాత ఆ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రాలేదు. వారికి ఫోన్ చేయగా.. మరింత పెట్టుబడి పెట్టాలని కోరారు. అయితే ఆణె అప్పటికే రూ.13.76 లక్షలు ఇచ్చింది. దీంతో ఆమె తన వద్ద డబ్బు లేదని తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరింది.
అయితే ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. మోసపోయానని తెలిసుకున్న బాధిత మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఇలాంటి నేరాలు జరిగాయి. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాజ్ చేస్తున్నారు. ఆమెకు యూట్యూబ్ వీడియోలకు లైక్ లు కొడితే డబ్బులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు చెప్పారు. ఆ తర్వాత ఆమె యూట్యూబ్ వీడియోలకు లైక్ లు కొట్టారు. దీనికి ఆమెకు డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలని కోరారు. దీంతో ఆమె రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయారు.
అనంతరం తాను పెట్టుబడి పెట్టిన డబ్బును, అలాగే లాభాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించడంతో అసలు విషయం వెల్లడైంది. దానికి వారు ఓకే చెయ్యకపోగా బదులుగా మరింత సంపాదించడానికి మరింత పెట్టుబడి పెట్టమని అడిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి ఘటనే ఇటీవలే ముంబైలో చోటుచేసుకుంది. ఆన్‌లైన్ జాబ్ ఆఫర్‌తో పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తిని రూ.20.22 లక్షలు మోసం చేశారు.












Click it and Unblock the Notifications