పంజాబ్ ఎన్నికలు: ప్రతి ఐదుగురిలో ఒకరు ఎస్సెస్సీలోపే

పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతి ఐదుగురికి ఒక అభ్యర్థి పదో తరగతిలోపే విద్యాభ్యాసం చేశారంటే అతిశేయోక్తి కాదు.

చండీగఢ్: భారత దేశంలో విద్యారంగం పురోగతి సాధించినా.. విద్యావంతులైన వారు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్లో, రాజకీయాలంటే వ్యతిరేకత వల్లో గానీ ఎన్నికల్లో పోటీకి ముందుకు రావడం లేదు. దీనికి తోడు ఆయా పార్టీల నాయకత్వాలను మెప్పించడం అభ్యర్థులకు తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతి ఐదుగురికి ఒక అభ్యర్థి పదో తరగతిలోపే విద్యాభ్యాసం చేశారంటే అతిశేయోక్తి కాదు. ఆ 21 శాతం మంది అభ్యర్థుల్లోనూ మూడో వంతు పదో తరగతికి చేరకముందే డ్రాపౌట్లుగా మధ్యలోనే స్కూల్ మానేసిన వారే. అయినా చట్టసభల్లో భావి తరాలకు లబ్ది చేకూర్చేందు కోసం ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

74 మంది ఎస్సెస్సీలోపే

త్రిముఖ పోటీ ఖాయమైన పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ - బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీల తరఫున 351 మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే వారిలో 74 మంది పదో తరగతి లోపు చదివిన వారే. అందులో పదో తరగతి పరీక్ష రాసిన వారు ఉన్నారు. మధ్యలోనే చదువు మానేసిన వారూ ఉన్నారు. వచ్చేనెల నాలుగో తేదీన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల సమాచారమే ఈ సంగతి తెలియజేస్తున్నది.

కాంగ్రెస్, అకాలీ - బీజేపీ సమానమే

సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ - బిజెపి కూటమి దాదాపు సమాన సంఖ్యలో పదో తరగతిలోపు విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులను బరిలోకి దించాయి. కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు, అకాలీదళ్ - బిజెపి కూటమి 29 స్థానాల్లో పదో తరగతిలోపు విద్యావంతులను నిలిపాయి. కొత్తగా రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), దాని మిత్రపక్షం లోక్ ఇన్సాఫ్ పార్టీ (ఎల్ఎస్‌పి) మాత్రం పదో తరగతిలోపు విద్యావంతుల్లో 13 మందికి అవకాశం కల్పించాయి.

In Punjab polls, 21% of the candidates haven’t studied beyond Class 10

ప్రస్తుత అసెంబ్లీలో మూడోవంతు పదో తరగతి చదివిన వారే

రద్దు కానున్న 14వ అసెంబ్లీలో 117 మంది ఎమ్మెల్యేల్లో 35 మంది పదో తరగతి, అంతకంటే తక్కువ విద్యాభ్యాసం చేసిన వారే. కొత్తగా కొలువుదీరనున్న అసెంబ్లీలో భిన్నమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. త్రిముఖ పోటీల్లో అత్యధికులు పదో తరగతి లోపు విద్యాభ్యాసం చేసిన వారు. 74 మంది అభ్యర్థుల్లో 10వ తరగతి గానీ, 12 తరగతిలోపు విద్యాభ్యాసం చేసిన వారు ఉన్నారు. వారిలో డిగ్రీ కూడా పూర్తి చేయని వారూ ఉన్నారు.

సగం మంది ఉన్నత విద్యావంతులే..

ఇందులో కొంత మంచి వార్త కూడా లేకపోలేదు. మిగతా అభ్యర్థుల్లో సగానికి పైగా గ్రాడ్యుయేషన్, ఆ పై ఉన్నతస్థాయి విద్యాభ్యాసం పూర్తిచేసిన వారు ఉన్నారు. న్యాయవిద్యాశాఖలో ప్రొఫెషనల్ డిగ్రీ పొందిన వారు, మెడిసిన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేసిన వారు ఉన్నారు. పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అల్లుడు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి ఆదాయిష్ ప్రతాప్ సింగ్ ఖైరోన్ ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ఎంబిఎ చేశారు. ఆయన సన్నిహితురాలు ఉపిందర్ జిత్ కౌర్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఆర్థిక శాస్త్రంలో పిజి, పంజాబ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి పూర్తిచేశారు. పాటియాలా నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మన్ ప్రీత్ సింగ్ బాదల్ ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో గ్రాడ్యుయేట్, లండన్ విశ్వవిద్యాలయంలో బారిస్టర్ లా డిగ్రీ పొందారు.

పంజాబ్‌లో తొలిసారి ఓటర్లే కీలకం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువకులే కీలకం కానున్నారు. 2.8 కోట్ల మంది జనాభాలో 1.97 కోట్ల మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 1.04 కోట్ల మంది పురుషులు, 93.1 లక్షల మంది మహిళా ఓటర్లు. వీరిలో సగం మంది 1.05 కోట్ల (53శాతం) మంది యువకులే. వీరిలో 18 - 39 ఏళ్ల మద్య వయస్కుల్లో సగానికి పైగా తొలిసారి ఓటర్లే ప్రధానం కానున్నారు. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్ నేతల్లో ఒకరిని తదుపరి సిఎంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ 89 ఏళ్ల వయస్కుడు కాగా, ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కు వచ్చే మార్చి నాటికి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.

యువ నేతల ద్వారా ప్రధాన పార్టీల పాట్లు

ప్రధాన పార్టీల అభ్యర్థులు రోజువారీగా సంప్రదాయ ప్రచారం చేస్తూనే యువ ఓటర్లను తమ బుట్టలో వేసుకునేందుకు సోషల్ మీడియా, ముఖాముఖీ చర్చలు, డోర్ టూ డోర్ క్యాంపెయిన్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. నాలుగు పార్టీలు కూడా తమ యువ నాయకుల ద్వారా తొలిసారి ఓటేసే కుర్రాళ్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సంప్రదాయ ప్రత్యర్థులు అకాలీదళ్ - బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ బ్రేక్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై విస్త్రుతస్థాయిలో ప్రచారం కల్పిస్తామని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికె సింగ్ తెలిపారు.

అధికార కూటమిపై ప్రజా వ్యతిరేకత

అధికార శిరోమణి అకాలీదళ్, బిజెపి కూటమి వరుసగా పదేళ్లుగా అధికారంలో కొనసాగుతూనే మరోసారి ప్రజాతీర్పును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే వరుసగా దశాబ్ద కాలం పాటు అధికారంలో కొనసాగడంతో ప్రజా వ్యతిరేకత కూడా బాగానే ఉంది. అవినీతి, అశ్రిత పక్షపాతం, వివిధ రంగాల్లో మాఫియా, డ్రగ్ మాఫియా, రవాణా, ఇసుక, లిక్కర్ మాఫియాలను ప్రోత్సహిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు శిరోమణి అకాలీదళ్ - బిజెపి కూటమి కసరత్తు చేస్తోంది.

గ్రామీణ ప్రాంతాలపై కాంగ్రెస్, ఆప్ కన్ను

కాంగ్రెస్ పార్టీ సిఎం అభ్యర్థిగా భావిస్తున్న పంజాబ్ పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం అకాలీ - బిజెపి సంకీర్ణ ప్రభుత్వం మాఫియాను ప్రోత్సహిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తోందని మండిపడ్డారు. అకాలీదళ్ 94, బిజెపి 23 స్థానాల్లో పోటీ చేస్తున్నది. అధికార కూటమికి పట్టణ ప్రాంతాల్లో పట్టు ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు గ్రామీణ ప్రాంతాలపై ద్రుష్టిని కేంద్రీకరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+