రాజ్యసభ ఎన్నికలు: జయాబచ్చన్ ఓకే, మాయావతికి బీజేపీ చిక్కు, బీజేపీ వ్యూహం ఫలించేనా:?
Recommended Video

లక్నో: దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 58 రాజ్యసభ స్థానాలకు 63 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న బీజేపీకే అత్యధిక రాజ్యసభ సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో బీజేపీకి 311 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆ పార్టీకి 8 సీట్లు కచ్చితంగా వచ్చే అవకాశముంది. బీహార్‌లో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ-జేడీయూ కూటమికి మూడు సీట్లు వస్తాయి. మహారాష్ట్రలో బీజేపీకి 2, శివసేనకు 1, కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు వచ్చే అవకాశముంది. 5 సీట్లు ఖాళీగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి నాలుగు సీట్లు రావొచ్చు.

ఆసక్తికరంగా ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ
మధ్యప్రదేశ్‌లోనూ ఐదు సీట్లలో బీజేపీకి నాలుగు స్థానాలు రావొచ్చు. గుజరాత్‌లో కాంగ్రెస్, బీజేపీలు చెరో రెండు స్థానాలు గెలుచుకునే అవకాశముంది. అన్నింటికంటే ఉత్తర ప్రదేశ్‌లో రాజ్యసభ పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంటుంది. తొమ్మిదో సీటు కోసం కొన్ని ఓట్లు తక్కువ పడతాయి. దీంతో బీజేపీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చింది.

ఒక్కో అభ్యర్థికి 37 ఓట్లు అవసరం
ఉత్తర ప్రదేశ్‌లో ఒక్కో అభ్యర్థికి 37 ఓట్లు అవసరం. బీజేపీ 300 మందికి పైగా ఎమ్మెల్యేలను కలిగి ఉంది. తమకు ఉన్న అభ్యర్థులతో ఎస్పీ కూడా ఒక సీటును గెలుచుకుంటుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎస్పీ తమ అభ్యర్థికి ఓటు వేయగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ ఎనిమిది మంది బీఎస్పీ అభ్యర్థికి మద్దతిస్తారు.

బీఎస్పీ అభ్యర్థి గెలుస్తారా
దీంతో బీఎస్పీ అభ్యర్థికి మొత్తం 27 ఓట్లు వస్తాయి. వీటికి తోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు, అజిత్ సింగ్ పార్టీకి చెందిన ఒకరు కూడా మద్దతిస్తున్నారు. వీరితో కలుపుకుంటే బీఎస్పీకి మద్దతిచ్చే వారి సంఖ్య 35కు చేరుకుంటుంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతిస్తున్నారు. దీంతో బీఎస్పీ గెలవొచ్చు. కానీ బీఎస్పీ, ఎస్పీల నుంచి జైలుకు వెళ్లిన ఒక్కో ఎమ్మెల్యే (మొత్తం ఇద్దరు) ఓట్లు చెల్లకపోవచ్చు. ఇదే ఇప్పుడు బీఎస్పీకి చిక్కులు తెచ్చి పెడుతోంది.

బీజేపీ వ్యూహం
దీంతో బీజేపీ తమకు మిగిలిన అభ్యర్థులకు తోడు తొమ్మిదో అభ్యర్థి కోసం ఏవైనా ప్రయత్నాలు చేస్తే, అందుకు అనుగుణంగా క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం బీఎస్పీ చిక్కులు తప్పవని అంటున్నారు. ఎస్పీ పక్కా గెలుస్తుంది. దీంతో ఆ పార్టీ నుంచి జయా బచ్చన్ బరిలో ఉన్నారు. బీఎస్పీ నుంచి బీంరావ్ ఉన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications