Crime News: విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తానని దారుణానికి ఒడిగట్టిన స్కూల్ కరస్పాండెంట్..
గురువు అంటే విద్యార్థులను తీర్చిదిద్దాలి. కానీ ఓ స్కూల్ టీచర్ మాత్రం కామాంధుడిలా మారి విద్యార్థులను లైగికంగా వేధిస్తున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని తిరునిన్రావూర్‌లో చదువులో రాణించలేని విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తానన్న నెపంతో ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల కరస్పాండెంట్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
శిక్షణ
చదువులో రాణించలేని విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తానన్న నెపంతో ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ వినోద్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల కరస్పాండెంట్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున రోడ్లను దిగ్బంధించారు.

పోక్సో చట్టం
తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ప్రైవేట్ పాఠశాల అధికారిపై పోక్సో చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications