బావిలో పెట్రోల్!: చేదుకునేందుకు జనం బారులు
పాట్నా: వేసవి కాలంలో నీళ్ల కోసం బావుల వద్ద జనం భారీ సంఖ్యలో బారులు కట్టడం చూస్తూనే ఉంటాం. అయితే, ఆ బావిలో పెట్రోల్ లాంటి చమురు లభిస్తే... ఇంకేముందు ఆ బారులు మరింత పెరిగిపోతాయి. బీహార్ రాష్ట్రంలో కూడా అదే జరిగింది.
బీహార్ రాష్ట్రంలోని గయలోని ఓ పాతబావిలో నీళ్ల కోసం బక్కెన వేస్తే నీళ్లు కాదు ఏకంగా పెట్రోల్ లాంటి చమురు వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పాడుపడిన బావి కదా చాలా రోజుల్నుంచి నీళ్ల కూడా తోడ లేదు అందుకే నీళ్లు ఇలా ఉంటాయేమో అని మరోసారి తోడారు.
మళ్లీ చమురే వచ్చింది. దీంతో ఇది నిజంగా పెట్రోల్ అని ఊరు ఊరంతా బిందెలు, బకెట్లు, డబ్బాలతో బావి దగ్గరికి క్యూ కట్టారు. విషయం తెలుసుకున్న పక్క గ్రామస్థులు కూడా బావి వద్దకు చేరుకున్నారు. పోటీ పడి మరీ బకెట్లతో ఆయిల్ తోడుకున్నారు.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి పోలీసుల చెవిన పడింది. పెద్ద ఎత్తున పోలీసులు బావి దగ్గరికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. బావి దగ్గరికి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో గ్రామస్థులు కాస్త వెనకడుగేసి బావి దగ్గర్నుంచి వెళ్లిపోయారు. అయితే బీహార్‌లో బావిలో నీళ్లకు బదులు చమురు లభించడం ఇదే మొదటి సారి అని స్థానికులు చెబుతున్నారు.
కాగా, ఈ సమాచారం తెలియడంతో బీహార్ ప్రభుత్వం కూడా స్పందించింది. బావిలో పెట్రోల్ తరహా చమురు లభిస్తున్నట్టు తెలిసిందని, దీంతో బావిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్‌ఐ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఇది పెట్రోలా.. కాదా? అని నిర్ధారించడానికి త్వరలో ప్రభుత్వం తరపున నిపుణులు, అధికారులు రానున్నారని పోలీసు అధికారి తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications