39మంది కలిసి మహిళను గ్యాంగ్ రేప్ చేశారు.. ఊరంతా ఆమెను ఛీకొట్టింది.. స్టేషన్ లో లొల్లి..
''అప్పుడే రాత్రి భోజనానికి కూర్చున్నాం.. అంతలోనే తలుపు చప్పుడు.. వెళ్లి చూస్తే తలుపు దగ్గర మగాళ్ల గుంపు.. తలుపు తోసుకుంటూ లోనికి దూసుకొచ్చారు.. నా భర్తపై దౌర్జన్యంచేసి.. నన్ను గదిలోకి లాక్కెళ్లారు.. ఒకరి తర్వాత ఒకరు మొత్తం 39 మంది నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్లలో నలుగురు నాకు బాగా తెల్సినవాళ్లే..''అంటూ జరిగిన ఘోరాన్ని పోలీసులకు వివరించి 32 ఏండ్ల బాధితురాలు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. కానీ ఆమెకు వ్యతిరేకంగా ఊరుఊరంతా ఏకం కావడంతో కథ అడ్డంతిరిగింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల వివరణ ఇది..

రేప్ చేసి డబ్బులెత్తుకెళ్లారు..
ఉత్తబాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్, శంభు, చమన్, పుష్పేంద్ర అనే నలుగురితోపాటు గుర్తుతెలియని మరో 35 మందిపై గ్యాంగ్ రేప్, దొంగతనం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్ జరిగే సమయంలో ఇంట్లోని బీరువా నుంచి అమిత్ రూ.50వేలు కొట్టేశాడనీ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ 39 మందీ అమాయకులేనని, ఆ మహిళ కావాలనే వాళ్లను కేసులో ఇరికించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారంతా ఆదివారం బరేలీలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు ఆందోళనకు దిగారు. ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా జరిపిస్తామన్న హామీతో నిరసన విరమించారు.

అసలేం జరిగింది?
కాగా, గ్రామస్తుల వెర్షన్ మాత్రం బాధితురాలు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. నిజానికి గ్యాంగ్ జరగనేలేదని, తీసుకున్న అప్పు ఎగ్గొట్టడానికే ఈ నాటకమాడారని చెబుతున్నారు. సదరు బాధిత మహిళ భర్త తాగుడుకుబానిసై ఊళ్లోవాళ్లందరి దగ్గరా అప్పులు చేశాడని, త్వరలోనే పొలం అమ్మేసి అప్పు తీర్చుతానని బుకాయించేవాడని, తీరా పొలం అమ్మిన తర్వాత కూడా చలనం లేకపోవడంతో అప్పులోళ్లంతా డబ్బుల కోసం ఇంటికెళ్లి నిలదీశారని, ఆ క్రమంలో వాగ్వాదం జరిగిందేగానీ, కొట్లాట, రేప్ లాంటివి జరగనేలేదని అజయ్ కుమాన్ అనే స్థానికుడు వివరించాడు.

ఆమెపైనా కేసు పెట్టాలి..
గ్యాంగ్ రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 39 మందే.. మహిళ భర్తకు సుమారు 2.5లక్షలు అప్పిచ్చినవాళ్లని స్థానికులు చెబుతున్నారు. అజయ్ గుర్తుచేశాడు.తమపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళ, అప్పు తీసుకొని ఎగ్గొట్టిన ఆమె భర్తపైనా కేసు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచీ ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోందని, అందుకే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని బరేలీ సీఐ అశోక్ కుమార్ చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications