రూ.152 కోట్ల బ్యాక్ మనీ: బ్యాంకు మేనేజర్లు పరుగో పరుగు

ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారుల దాడుల్లో రూ. 4.70 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు బయటపడటంతో అవినీతి అధికారులకు సహకరించిన బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులు హడలిపోయారు.

బెంగళూరు: ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారుల దాడుల్లో రూ. 4.70 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు బయటపడటంతో అవినీతి అధికారులకు సహకరించిన బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులు హడలిపోయారు.

ఎక్కడ ఐటీ అధికారులు మా మీద దాడి చేసి అరెస్టు చేస్తారో ? అని ఆందోళనతో మయాం అయ్యారు. అయితే బెంగళూరుకు చెందిన ఇద్దరు అవినీతి అధికారులు చిక్కరాయప్ప, జయచంద్రకు రూ. 2,000 కొత్తనోట్లు ఇచ్చింది ఎవరూ ? అని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Incom tax raids are said to have taken place at the homes of two senior officers

మూడు రోజుల పాటు బెంగళూరులోని కావేరీ జలమండలి చీఫ్ ఇంజనీరు చిక్కరామయ్య, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్ర ఇండ్లు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

రూ. 6 కోట్ల కొత్త నోట్లు, 7 కిలోల బంగారు: తెలీదు, సీఎం

వీరి ఇంటిలో ఇటీవల అమలులోకి వచ్చిన రూ.2,000 నోట్లు (రూ.4.70 కోట్లు)లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైసూరు, తమిళనాడులోని ఈరోడ్డు, బెంగళూరులోని ఓ బ్యాంకులో రూ.4.70 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు తీసుకున్నారని ఐటీ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

అయితే రూ.4.70 కోట్ల విలువైన కొత్త రూ.2,000 నోట్లు ఏవిధంగా చిక్కరాయప్ప, జయచంద్రలకు ఇచ్చారు ? వీరి బ్లాక్ మనీని వైట్ మనీగా చేశారా ? అనే కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఐటీ దాడితో కాంగ్రెస్ గూబ గుయ్ మంది: సస్పెండ్

వీరిద్దరికి సహకరించిన మైసూరు, ఈరోడ్డు, బెంగళూరులోని బ్యాంకు ఉద్యోగులు భయంతో పరుగు తీశారు. వారు ఎక్కడ తలదాచుకున్నారు అని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. రూ. 4.70 కోట్ల కొత్త నోట్లు ఇచ్చిన బ్యాంకు అధికారులు ఎంత మొత్తంలో కమీషన్ తీసుకున్నారు ? వీరి మీద అధికారంలో ఉన్న నాయకులు ఎమైనా ఒత్తిడి చేశారా ? అని ఆరా తీస్తున్నారు.

Incom tax raids are said to have taken place at the homes of two senior officers

కర్ణాటక ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులైన కావేరీ జలమండలి చీఫ్ ఇంజనీరు చిక్కరామయ్య, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్రలను సస్పెండ్ చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సీఎం సిద్దరామయ్యతో పాటు ఓ ప్రముఖ మంత్రితో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+