రాహుల్‌కు మరోసారి ఎదురుదెబ్బ.. తిరగబడిన మరో కేసు...
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ వాణిజ్య సంస్థ కాదు అని రాహుల్ గాంధీ పేర్కొనడం అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అది వాణిజ్య సంస్థ అని ఇన్‌కామ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఆదాయపు పన్ను రూ.100 కోట్లకు సంబంధించి రాహుల్ గాంధీపై కేసు తిరిగి విచారిస్తామని స్పష్టంచేసింది.
చారిటబుల్ ట్రస్ట్ నగదు గురించి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. గతేడాది సెప్టెంబర్ 10న వారు కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు 2011-2012లో ఆదాయపు పన్ను, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కేసులో కూడా కోర్టును వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసులకు సంబంధించి ఇన్‌కాం ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని రాహుల్ గాంధీకి.. సుప్రీంకోర్టు సూచించింది. దీంతో రాహుల్ గాంధీ యంగ్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ వాణిజ్య సంస్థ కాదు అని పేర్కొన్నారు. దానిని అప్పిలేట్ ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.

నేషనల్ హెరాల్డ్ కేసుతోపాటు చారిటబుల్ ట్రస్ట్ పన్నులపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ అండ్ కో పై విచారణ ఆదాయపు పన్ను శాఖ నుంచి సుప్రీంకోర్టు వరకు జరుగుతున్నాయి. ఈ కేసులో రాహుల్ గాంధీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications