గాలి కార్యాలయంలో డాక్యూమెంట్లు సీజ్ !
బెంగళూరు: గాలి జనార్దన్ రెడ్డి ఆయన కుమార్తె బ్రహ్మిణి వివాహం ఇంత వైభవంగా ఎలా చేశారు ? అడబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? పెళ్లి కోసం ఎంత నగదు ఖర్చు పెట్టారు ? ఆ నగదు ఎలా వచ్చింది? అని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
సోమవారం బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, ఎఎంసీ సంస్థల్లోని కార్యాలయాల్లో సోదాలు చేసిన ఆదాయ పన్ను (ఐటీ శాఖ) అధికారులు దాడులు చేసి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం సాయంత్రం వరకు ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. బళ్లారీలోనే ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని సైతం అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి కోసం ఎంత ఖర్చు పెట్టారు అని అధికారులు ఆరా తీస్తున్నారు.
పెళ్లికి ఖర్చు పెట్టిన ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? అని పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఐటీ శాఖ అధికారులు నిర్ణయించారు. గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని ఆస్తులు, విదేశాల్లోని ఆస్తులు కొన్ని విక్రయించారని, కొన్ని ఆస్తులు కుదవ పెట్టారని ఇంతకు ముందు ఆయన అనుచరులు చెప్పారు.
అయితే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయినప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆ ఆస్తుల వివరాలు సీబీఐకి చెప్పారా ? అని ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద పెళ్లికి అయిన అన్ని ఖర్చుల వివరాలు సేకరించాలని ఐటీ శాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఈ విషయంపై ఇప్పటి వరకు గాలి జనార్దన్ రెడ్డి కాని ఆయన అనుచరులు కాని నొరువిప్పలేదు. ఐటీ శాఖ అధికారులు సైతం సోమవారం సాయంత్రం వరకు మీడియాకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications