college girl: కాలేజ్ అమ్మాయి పేరుతో సహ అసభ్యంగా రాసి, అర్దరాత్రి కాలేజ్ లో ఏం జరుగుతోంది ?
బెంగళూరు/కోప్పళ: కర్ణాటకలోని కోప్పళ పట్టణంలోని కేపీఎస్ చెన్నశ్రీరుద్ర ఇంటర్ కళాశాలలో విద్యార్థిని పేరుతో కాలేజ్ గోడపై అశ్లీల రాతలు రాసి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం పట్టణానికి చెందిన విద్యార్థినిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన రాతలు, చిత్రాలు గీసి కాలేజ్ లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీసింది.
ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు ఈచర్యను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు మనవి చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అనుమానాస్పద యువకుడిని స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. కాలేజ్ అమ్మాయి విషయంలో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదైయ్యింది.

డిసెంబర్ 28వ తేదీ రాత్రి పట్టణంలోని కేపీఎస్, చెన్నశ్రీరుద్ర పీయూ కళాశాలలోని వరుస గదులపై అదే విద్యార్థిని పేరుతో అసభ్యంగా మళ్లీ రాశారు. ఎలాంటి కారణం లేకుండా విద్యార్థి పేరును ఉపయోగించి అసభ్యకరంగా రాయడం ఆమె కుటుంబాన్ని కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజ్ ను అసభ్యకరమైన రాతలను తొలగించాలని సూచించారు. కాలేజ్ యాజమాన్యం గోడలకు పెయింట్ వేసింది. మళ్లీ పోలీసులు పలు సెక్షల కింద కేసు నమోదు చేశారు.
ఇంటర్ కాలేజ్ లో వరుసగా అన్ని గదుల్లో విద్యార్థిని పేరును ఉపయోగించి అసభ్యకరమైన రాతలు రాసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తింస్తామని పోలీసులు అంటున్నారు. కాలేజ్ విద్యార్థినిని టార్గెట్ చేసిన దుండగులు పాఠశాల గోడపై పదే పదే అసభ్యకర రాతలు రాస్తూ అసభ్యకర చిత్రాలు గీస్తుండటంతో ఆ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు హడలిపోతున్నారు. ఇలాంటి సంఘటనలతో నిందితులను గుర్తించడానికి సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని కాలేజ యాజమాన్యం అంటోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications