చిక్కుల్లో యాక్టర్ ఇందర్: మోడల్‌పై రేప్ ధ్రువీకరణ

ముంబై: మోడల్‌పై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. 23 ఏళ్ల మోడల్‌పై ఆయన అత్యాచారానికి పాల్పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ మేరకు శనివారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సంఘటనకు సంబంధించి భయానకమైన విషయాలు బయటపడ్డాయని మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియా వార్తల ప్రకారం - మోడల్ అత్యాచారానికి గురి కావడమే కాకుండా అతని చేతుల్లో వేధింపులకు కూడా గురైనట్లు తెలింది. ఆమె మెడ, భుజాలపై కాలిన గాయాలు ఉన్నాయని, సిగరెట్ పీకలతో కాల్చడం వల్ల ఆ గాయాలు అయి ఉంటాయని అనుమానిస్తు్నారు.

Inder Kumar in trouble, medical reports confirm rape

మోడల్‌పై ఫోర్క్ వంటి ఆయుధాలతో దాడి చేసినట్లు తెలుస్తోందని, బహుశా బీర్ బాటిల్స్‌తో కొట్టి ఉంటారని వైద్య పరీక్షల్లో తేలింది. అయితే, ఇందులో తన నేరం లేదని ఇందర్ కుమార్ అంటున్నారు. మోడల్ సమ్మతితోనే లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు 40 ఏళ్ల నటుడు చెప్పారు.

లైంగిక క్రీడ కోసం తాను మోడల్‌ను బలవంత పెట్టలేదని చెప్పారు. అయితే, మోడల్‌పై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో ఇందర్ కుమార్ వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా తీవ్ర సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+