ఇండియా బ్లాక్ టాప్ గేర్: ఈ సారి నేరుగా ప్రధాని మోదీ, అమిత్ షా నివాసాల మీదికే.. !!

దేశ రాజధాని వేదికగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ తన వ్యూహాన్ని మార్చింది. తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా కొత్త ఎత్తులు వేస్తోంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న విపక్షాలు.. తమ తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తోన్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో అత్యవసరంగా సమావేశం అయ్యాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఇండియా కూటమికి చెందిన పార్లమెంటు సభ్యులు భేటీ కావాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో తదుపరి నిరసనలకు సంబంధించిన పూర్తి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక నివాసాలను ముట్టడించాలని ఇండియా బ్లా్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి నివాసం, సేవా తీర్థ్ వంటి ప్రాంతాల వద్ద భారీ ఎత్తున ధర్నాలకు ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.

INDIA Bloc Flags Next Protest Venues PM Amit Shah s residences and awaiting President appointment

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ విధివిధానాల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఈ ఆందోళనలను ఉమ్మడిగా చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయాలని కూడా ఇండియా కూటమి నిర్ణయించింది. రాష్ట్రపతి భవన్ అపాయింట్‌మెంట్ సైతం కోరింది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 2వ తేదీ నుంచే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోన్నట్లు తెలిపారు.

హైఓల్టేజ్ నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రభంజనం
హైఓల్టేజ్ నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రభంజనం

రాష్ట్రపతిని కలిసే నేతల పేర్లను కూడా రాష్ట్రపతి కార్యాలయానికి సమర్పించామని, అయినప్పటికీ ఈ ఉదయం వరకు కూడా ఎలాంటి అధికారిక స్పందన రాలేదని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలవడానికి అపాయింట్‌మెంట్ లభించకపోతే, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ ముందున్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతిని కలిసే విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని వ్యాఖ్యానించారు.

బీజేపీ నుంచి లత రజినీకాంత్: ఢిల్లీ స్థాయిలో గట్టిగానే ప్లాన్ చేసిన సూపర్ స్టార్
బీజేపీ నుంచి లత రజినీకాంత్: ఢిల్లీ స్థాయిలో గట్టిగానే ప్లాన్ చేసిన సూపర్ స్టార్

మూడు రోజులుగా ఢిల్లీలో విపక్ష నేతలు వరుస నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. గురువారం కూడా రాజ్‌ఘాట్ వద్ద రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతలంతా మోకాళ్లపై కూర్చుని మౌన ప్రదర్శనలు నిర్వహించారు. దీన్ని మరింత తీవ్రతరం చేయబోతోన్నారు. విపక్షాలు నిర్వహించే ఎటువంటి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వట్లేదని అటు ఢిల్లీ పోలీసులు కూడా తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+